అన్వేషించండి
Chandrababu: ఏపీ ప్రజలు రాక్షసుడ్ని ఓడించారు.. మళ్లీ వైకుంఠపాళి వద్దు - సీఎం చంద్రబాబు
Andhra Pradesh News | ఆదివారం విజయవాడ బీసెంట్ రోడ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. పలువురు చిరు, వీధి వ్యాపారులు, చెప్పుల షాపు నిర్వాహకులతో మాట్లాడారు.
విజయవాడ బీసెంట్ రోడ్డులో ఏపీ సీఎం చంద్రబాబు
1/14

విజయవాడలోని పున్నమీ ఘాట్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
2/14

అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... జీఎస్టీ సంస్కరణ ఉత్సవాలు దసరా నుంచి ప్రారంభించి దీపావళి వరకూ నిర్వహిస్తున్నాం. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు అందుతున్న ప్రయోజనాల గురించి విజయవాడలో కొందరు వీధి వ్యాపారులు, దుకాణాలను సందర్శించి వారితో మాట్లాడి తెలుసుకున్నాను
3/14

ఓటు అనే ఆయుధంతో చీకటి పాలనను ప్రజలు తరిమేశారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న రాక్షసుడిని ప్రజలు ఓడించారు. టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమిని 94 శాతం స్ట్రైక్ రేట్ తో ప్రజలు గెలిపించారు.
4/14

రాష్ట్రంలో మళ్ళీ వైకుంఠపాళి వద్దు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ప్రాణం పోసింది.16 నెలల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టాం. సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఉద్యోగులకు కూడా ఆర్థిక ప్రయోజనాలు కల్పించాం
5/14

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం విజయవాడ బీసెంట్ రోడ్‌లో పర్యటించారు. పలువురు చిరు, వీధి వ్యాపారులు, జనరల్ స్టోర్, చెప్పుల షాపు నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా వస్తువుల ధరల తగ్గుదలను గురించి ఆయా వర్గాల వారిని అడిగి తెలుసుకున్నారు.
6/14

చింతజపూడి దుర్గారావు అనే వీధి వ్యాపారితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. తాను ప్రమిదలు, జ్యూట్ బ్యాగులు విక్రయిస్తానని తెలిపారు. ఆయనకున్న సమస్యలను గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. మరో వీధి వ్యాపారి యక్కలి బాలకృష్ణతో మాట్లాడారు.
7/14

చదలవాడ వెంకటకృష్ణారావు అనే చెప్పుల షాపు యజమానితో మాట్లాడారు. వ్యాపారం నడుస్తున్న తీరు, చెప్పులపై జీఎస్టీ ఏ మేరకు తగ్గింది, విక్రయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. బట్టల షాపునకు వెళ్లి అందులో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోన్న గొడవర్తి లక్ష్మీ అనే మహిళతో ముఖ్యమంత్రి ముచ్చటించారు.
8/14

అనంతరం కిరాణా షాపు వద్దకు వెళ్లి నిర్వాహకుడు బొడ్డు శ్రీనివాస్‌తో చంద్రబాబు మాట్లాడారు. నిత్యావసర వస్తువుల జీఎస్టీ తగ్గింపు ఎంత వరకు ఉందని, గతానికి ఇప్పటికీ ధరల వ్యత్యాసం గురించి అడిగి తెలుసుకున్నారు.
9/14

ఈ సందర్భంగా బీసెంట్ రోడ్‌కు వచ్చిన కొందరు కొనుగోలు దారులతోనూ సీఎం మాట్లాడారు. వారితో ఫోటోలు దిగి ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
10/14

ఒక డీఏ ఉద్యోగులకు, పోలీసులకు ఒక సరెండర్ లీవ్‌ను మంజూరు చేశాం. త్వరలోనే ఈహెచ్‌ఎస్‌ను కూడా గాడిలో పెడతాం. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్నాము. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు, వ్యాపారులకు, పరిశ్రమలకు ప్రయోజనాలు కలుగుతున్నాయి
11/14

జీఎస్టీ తగ్గింపుతో ప్రతీ కుటుంబానికి రూ.15 వేలు ఆదా అవుతోంది. అమరావతి నిర్మాణం కూడా వేగంగా చేపడుతున్నాం. ప్రతీ ఇంటిలో ఒక పారిశ్రామిక వేత్త ఉండాలి. ఏపీ ఇక ఏఐగా మారాలి
12/14

విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ వల్ల ఇతర దేశాలకు సేవలు అందుతాయి. 2027 డిసెంబర్ కు పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం
13/14

పీ4 అనుసంధానం ద్వారా పేదలకు చేయూత ఇచ్చి జీవన ప్రమాణాలను పెంచుతాం. 2047 నాటికి భారత్ ప్రపంచలో నెంబర్ వన్ గా మారుతుంది. అందులో స్వర్ణాంధ్ర కూడా అగ్రస్థానంలో ఉంటుంది
14/14

ఏపీకి కావాల్సింది సుస్థిరమైన పాలనే. రాష్ట్ర ప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు దీపావళి పండుగ శుభాకాంక్షలు
Published at : 19 Oct 2025 10:03 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ప్రపంచం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















