Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
టీ20 వరల్డ్ కప్ 2026 స్క్వాడ్ ను బీసీసీఐ ప్రకటించింది. ఈ టీమ్ లో యంగ్ ప్లేయర్ శుబ్మన్ గిల్ పేరును చేర్చలేదు బీసీసీఐ సెలెక్టర్లు.ఇది పెద్ద కాంట్రోవర్సిగా మారింది. శుబ్మన్ గిల్ ను సెలెక్ట్ చేయకపోవడంపై రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేసాడు. టీ20ల్లో గిల్ పతనానికి రోహిత్ శర్మనే కారణమని చెప్పుకొచ్చాడు.
టీ20ల్లోకి ఓపెనర్ గా రోహిత్ శర్మ బోల్డ్ స్టైల్ గేమ్ ను తీసుకొచ్చాడు. ఆ దూకుడు వల్లే గిల్ తన స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఇక టీం మేనేజ్‌మెంట్ కూడా రోహిత్ శర్మ అదే ఫాలో అయింది. టీ20ల్లో టీమిండియా ఇప్పుడు పవర్‌ప్లేలోనే ప్రత్యర్థిపై పైచేయి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఆ గేమ్ ప్లాన్ కు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ లాంటి ప్లేయర్స్ సరిపోతారని అశ్విన్ అంటున్నాడు.
గిల్‌కు టీం మేనేజ్‌మెంట్, సెలెక్టర్ల నుంచి పూర్తిగా సహకారం ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడని అశ్విన్ అంటున్నాడు. స్ట్రైక్ రేటు విషయంలో శుబ్మన్ గిల్, సంజు శాంసన్ మధ్య పెద్దగా తేడా లేనప్పిటికి పరుగులు రాబట్టడంలో గిల్ విఫలమయ్యాడని తెలిపాడు. ఏది ఏమైనా గిల్ ఆటతీరు టీమ్ కాంబినేషన్‌ను దెబ్బతీస్తుందని, టీ20 వరల్డ్ కప్ కు శుబ్మన్ గిల్ ను సెలెక్ట్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగించలేదని అశ్విన్ పేర్కొన్నాడు.





















