అన్వేషించండి

Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !

Udaypur Gangrape:రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఒక ఐటీ కంపెనీ మహిళా మేనేజర్‌పై తనపై సీఈవో మరికొంత మందితో కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదుచేసింది.

Udaypur Crime Gangrape:రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఒక ఐటీ కంపెనీ మహిళా మేనేజర్‌పై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాను పనిచేస్తున్న సంస్థ సీఈఓ ,సహోద్యోగులే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులకుఫిర్యాదు చేసింది. 
 
బర్త్ డే పార్టీలో దారుణం - సీఈఓ సహా ముగ్గురి అరెస్ట్

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఒక ఐటీ సంస్థ మహిళా మేనేజర్‌పై జరిగిన సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.  GKM IT అనే ప్రైవేట్ సంస్థ సీఈఓ  జితేష్ సిసోడియా , ఎగ్జిక్యూటివ్ హెడ్  శిల్పా సిరోహి , ఆమె భర్త  గౌరవ్ సిరోహి కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 20న సీఈఓ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు.  ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారిని నాలుగు రోజుల పోలీస్ రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల కథనం ప్రకారం, శోభాగ్‌పురా ప్రాంతంలోని ఒక హోటల్‌లో సీఈఓ జితేష్ సిసోడియా బర్త్ డే , న్యూ ఇయర్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకకు బాధితురాలైన మహిళా మేనేజర్ కూడా హాజరయ్యారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమెకు మత్తుగా అనిపించడంతో ఇంటికి వెళ్లాలని కోరారు. ఆ సమయంలో శిల్పా సిరోహి తన కారులో దింపుతానని నమ్మించి బాధితురాలిని ఎక్కించుకున్నారు. కారులో అప్పటికే సీఈఓ జితేష్ , శిల్ప భర్త గౌరవ్ ఉన్నారు. మార్గమధ్యంలో ఆమెకు సిగరెట్   ఇచ్చి తాగించారని, ఆ తర్వాత   పూర్తిగా స్పృహ కోల్పోయానని  బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  

అనంతరం నిందితులు ముగ్గురూ కలిసి కదులుతున్న కారులోనే  సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె గుర్తించింది.   తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆమెను ఇంటి వద్ద వదిలి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం స్పృహలోకి వచ్చిన బాధితురాలు, తన శరీరంలోని గాయాలను , లోదుస్తులు, చెవి రింగులు కనిపించకపోవడాన్ని గమనించి జరిగిన దారుణాన్ని గ్రహించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. వైద్య పరీక్షల్లో కూడా ఆమెపై అఘాయిత్యం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి.

ఈ కేసులో కారులోని  డ్యాష్ క్యామ్  అత్యంత కీలకమైన ఆధారంగా మారింది. నిందితులు దారుణానికి పాల్పడుతున్న సమయంలో కారులోని ఆడియో ,వీడియో దృశ్యాలు ఈ డ్యాష్ క్యామ్‌లో రికార్డ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలి స్టేట్‌మెంట్, ఈ సాంకేతిక ఆధారాల బలంతో నిందితులను సుఖేర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలకు అత్యంత సురక్షితమైన సంస్థగా  ప్రచారం చేసుకుంటున్న కంపెనీలోనే స్వయంగా సీఈఓ ఇలాంటి దారుణానికి పాల్పడటంపై  నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Embed widget