కొరియా క్వీన్ హేఓ హ్వాంగ్-ఓక్ విగ్రహాన్ని మోదీ అయోధ్యలో ఆవిష్కరించారు. ఆ రాణికి భారతీయ మూలాలు

Published by: Raja Sekhar Allu

దక్షిణ కొరియా పురాతన గ్రంథం 'సామ్ గుక్ యూసా' ప్రకారం, ఆమె అయోధ్య రాజ్యానికి చెందిన రాజకుమారి. ఆమె అసలు పేరు సూరిరత్న.

Published by: Raja Sekhar Allu

క్రీస్తుశకం 48లో, తన 16వ ఏట ఆమె సముద్ర మార్గం ద్వారా సుదీర్ఘ ప్రయాణం చేసి కొరియాలోని గయా రాజ్యానికి చేరుకున్నారు.

Published by: Raja Sekhar Allu

ఆమె తల్లిదండ్రులకు వచ్చిన ఒక కల కారణంగా, ఆమెను సుదూర ప్రాంతంలో ఉన్న రాజును వివాహం చేసుకోవాలని పంపించారు.

Published by: Raja Sekhar Allu

కొరియా చేరుకున్నాక ఆమె అక్కడి 'గెయుమ్‌గ్వాన్ గయా' రాజ్య స్థాపకుడైన రాజు కిమ్ సురోను వివాహం చేసుకుని, ఆ రాజ్యానికి తొలి రాణి అయ్యారు.

Published by: Raja Sekhar Allu

తర్వాత ఆమెకు హేఓ హ్వాంగ్-ఓక్అ నే పేరు వచ్చింది. హ్వాంగ్-ఓక్ అంటే కొరియన్ భాషలో పసుపు రంగు రత్నం

Published by: Raja Sekhar Allu

దక్షిణ కొరియా జనాభాలో దాదాపు 60 లక్షల మంది ఆమె వంశానికి చెందినవారుగా భావిస్తారు.

Published by: Raja Sekhar Allu

'కిమ్', 'హేఓ' అనే ఇంటిపేర్లు ఉన్నవారు ఆమె వారసులమని చెప్పుకుంటారు.

Published by: Raja Sekhar Allu

ఈ చారిత్రక సంబంధాన్ని పురస్కరించుకుని అయోధ్య , కొరియాలోని గిమ్హే పట్టణాలను 'సిస్టర్ సిటీస్ 'గా ప్రకటించారు.

Published by: Raja Sekhar Allu

సరయూ నది తీరాన ఆమె గుర్తుగా 'క్వీన్ హేఓ మెమోరియల్ పార్క్' ఉంది. కొరియన్లు పెద్ద ఎత్తున వస్తూంటారు.

Published by: Raja Sekhar Allu