US Visa: డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
US new visa rules : అమెరికా వీసా అప్లయ్ చేసే వారికి డయాబెటిస్, ఊబకాయం ఉండకూడదని ట్రంప్ ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేశారు. అలా ఉంటే వీసా ఇవ్వరు.

No Visa For diabetes Patient: అమెరికా వీసా కావాలంటే ఇక డయాబెటిస్ ఉండకూడదు.. ఊబకాయం ఉండకూడదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో ఉత్తర్వు జారీ చేశారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల జారీ చేసిన కొత్త గైడెన్స్ ప్రకారం, డయాబెటిస్, ఊబకాయం, హార్ట్ డిసీజ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వీసాలు నిరాకరిస్తారు. డయాబెటిస్, గుండె జబ్బులు, ఊబకాయం లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వీసా రిజెక్ట్ అవుతుందని చెబుతోంది. ఇది పబ్లిక్ చార్జ్ అనే నియమం కింద వస్తుంది.
వీసా అధికారులు మెడికల్ రిపోర్టులు పూర్తిగా చూస్తారు. జబ్బు చికిత్సకు ఖర్చు ఎక్కువ అయితే, అమెరికా ప్రభుత్వానికి భారం అవుతుందని భావిస్తారు. ఇండియా నుంచి వెళ్లే H-1B, టూరిస్ట్ వీసాలకు కూడా ఇది వర్తిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సర్టిఫికేట్, బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి. ఇండియాలో 10 కోట్ల మందికి డయాబెటిస్ ఉంది. చాలా మంది అమెరికా వీసా కోసం అప్లై చేస్తారు. కొత్త రూల్స్ వల్ల రిజెక్షన్ రేటు 20-30 శాతం పెరగవచ్చునని భావిస్తున్నారు.
'పబ్లిక్ చార్జ్' అంటే పబ్లిక్ కి ఆర్థిక భారంగా పరిగణించి వీసా నిరాకరిస్తారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల జారీ చేసిన ఈ గైడెన్స్, వీసా అధికారులకు మెడికల్ కండిషన్స్‌పై మరింత డీప్ అసెస్‌మెంట్ చేసే అధికారాన్ని ఇచ్చింది. డయాబెటిస్, ఊబకాయం, కార్డియోవాస్కులర్ డిసీజెస్, క్యాన్సర్, మెటబాలిక్ డిసీజెస్, న్యూరాలజికల్ డిసీజెస్, మెంటల్ హెల్త్ కండిషన్స్ వంటివి 'హై కాస్ట్'గా పరిగణిస్తున్నారు. వీసా కోరేవారి మెడికల్ హిస్టరీ, ఫ్యూచర్ ట్రీట్‌మెంట్ కాస్ట్, ఉపాధి సామర్థ్యాన్ని అసెస్ చేస్తారు. ఇమ్మిగ్రెంట్ వీసాలకు ప్యానెల్ ఫిజిషియన్ ఎగ్జామ్ ఇప్పటికే ఉంది . కానీ ఇప్పుడు మరింత ఫోకస్ పెంచుతారు.
🚨 US is planning to deny visas to foreign nationals with chronic conditions like diabetes, obesity, or heart disease.
— Indian Tech & Infra (@IndianTechGuide) November 7, 2025
(CBS news) pic.twitter.com/HhrABu3e9D
డయాబెటిస్ వంటివి ఇంతకు ముందు సమస్య కాదు. కానీ ఈ సారి మాత్రం కలిపారు. రానిక్ డిసీజెస్ ఉన్నవారు 'గవర్నమెంట్ హెల్త్‌కేర్'పై డిపెండ్ అవుతారని భావిస్తే వెంటనే రిజెక్ట్అవుతారు. డయాబెటిస్ ఉన్నవారు ముందుగా డాక్టర్ రిపోర్ట్ తీసుకోవాలి. జబ్బు నియంత్రణలో ఉందని, ఖర్చు భరించగలరని చూపించాలి. ఇన్సూరెన్స్, ఆర్థిక డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలని నిపుణులు సలహాలిస్తున్నారు.





















