అన్వేషించండి

Zohran Mamdani: జోహ్రాన్ మందానీ న్యూయార్క్ మేయర్‌గా ఫేమస్ అవ్వొచ్చు... కానీ ఎప్పటికీ US ప్రెసిడెంట్ అవ్వలేరు

Zohran Mamdani: ట్రంప్‌ను ఎదిరించి న్యూయార్క్ మేయర్‌గా నెగ్గిన మోడ్రన్ ఏజ్‌ నాయకుడు జోహ్రాన్ మందానీ. కాబోయే ప్రెసిడెంట్ అంటూ అంతా పొగుడుతున్నారు. కానీ అతను ఎప్పటికీ U.S ప్రెసిడెంట్ కాలేరు.. ఎందుకంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

న్యూయార్క్ సిటీ మేయర్‌గా జోరాన్ మమ్దాని ఎదిగిన తీరు ఇప్పుడు అమెరికా రాజకీయ చరిత్రలో ఒక ఆసక్తికరమైన అధ్యాయం. TikTok, Instagram, YouTube ఎక్కడ చూసినా ఆయన వీడియోలు, మీమ్స్‌, రీల్స్‌. “రాజకీయాలు కూడా రిఫ్రెష్‌గా ఉండొచ్చు” అనే కొత్త దృక్పథాన్ని ఆయన తెచ్చారు. న్యూయార్క్ నగరంలోని విభిన్నతను ప్రతిబింబించే ధైర్యమైన నాయకుడిగా, మైనారిటీలకు, ఇమ్మిగ్రెంట్లకు, యువతకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా ఆయన్ను ప్రొజెక్టు చేస్తున్నారు. న్యూ జనరేషన్GenZ కి మమ్దాని ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు విభిన్న ఆలోచనకు ప్రతిరూపం. శక్తివంతమైన అమెరికన్ ప్రెసిడెంట్ను నేరుగా ఎదిరించి.. కేవలం తన జెన్యూనిటీ... చాతుర్యంతో ప్రపంచ ఆర్థిక రాజధాని వంటి న్యూయార్క్ నగరానికి మేయర్గా ఎన్నికయ్యారు. భవిష్యత్లో ఇంకా పై స్థాయికి వెళతాడు అంటున్నారు. స్థాయికి వెళ్లినా. ఆయన ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడిగా మారలేరు.

అవును.. Zohran Mamdani ఎప్పటికీ ప్రెసిడెంట్ అవ్వలేరు.

ఈ అడ్డంకికి సోషల్ మీడియా వైరాలిటీకి సంబంధం లేదు, ఓట్లకు సంబంధం లేదు. అది రాజ్యాంగానికి సంబంధించినది. అమెరికా రాజ్యాంగంలోని Article II, Section 1లో స్పష్టంగా ఉంది: “No person except a natural-born citizen… shall be eligible to the Office of President.” అంటే అమెరికాలో పుట్టినవారే అధ్యక్షుడిగా అవ్వగలరు. పుట్టుకతో అమెరికన్ కానివారికి వైట్ హౌస్‌ తలుపు మూసుకుపోయినట్లే.. ఈ రూల్ కారణంగా ఎలాన్ మస్క్‌ లాంటి సూపర్‌ ఇన్నోవేటర్‌, ఆర్నాల్డ్‌ శ్వార్జనేగర్‌ లాంటి ప్రపంచ ప్రఖ్యాత నటుడు కూడా అధ్యక్ష పదవికి దూరమయ్యారు. జోరాన్ మమ్దాని కూడా అదే పరిధిలోకి వస్తారు ఆయన ఉగాండాలోని కంపాలాలో జన్మించారు, 2018లో మాత్రమే అమెరికా పౌరుడయ్యారు. అందువల్ల ఆయన రాజకీయ ప్రస్థానం ఎంత బలంగా ఉన్నా, ఆయన కల ఎంత పెద్దదైనా, రాజ్యాంగం ముందు ఆ కల.. కల్ల అవుతుంది.మెరికా గడ్డ మీద అయినా జన్మించి ఉండాలి.. లేదా జన్మత: అమెరికన్ తల్లిదండ్రులకు అయినా పుట్టి ఉండాలి. మందాని విషయంలోరెండూ జరగలేదు. ఆయన తండ్రిది ఉగాండా అయితే..తల్లి ఇండియన్. మందానీ తండ్రి ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్.. తల్లి విఖ్యాత దర్శకురాలు మీరా నాయర్.

సోషల్మీడియా స్టార్..

మమ్దాని జీవితం సినిమాలా ఉంటుంది. అ ఇండియన్-ఉగాండన్‌ మూలాలు కలిగిన కుటుంబంలో పుట్టి, చిన్న వయసులోనే అమెరికా వలస జీవితం చూసిన ఆయన, క్వీన్స్ వీధుల్లో పెరిగి, కాలేజీ రోజుల్లోనే సామాజిక సమస్యలపై చురుకుగా మాట్లాడారు. ఆర్థిక అసమానతల నుంచి మత వివక్ష వరకు ఆయన స్వరంలో ఆవేశం- ఆవేదన, నిజాయితీ ఉంటాయి. సోషల్ మీడియాలో వాయిస్కు చాలా ఫ్యాన్బేస్ ఉంది. నిజాయతీగా మాట్లాడటం.. అసలైన సమస్యలను చర్చించడం.. వలసదారులు, మైనారిటీ హక్కులను మాట్లాడటంతో వర్గాల్లో పట్టు పెరిగింది. సహజంగానే డెమాక్రాట్లకు వర్గాల్లో ఆదరణ ఉంది. ఇక న్యూయార్క్లాంటి కాస్మోపాలిటన్ నగరం...ప్రపంచ దేశాలలోని అనేక జాతుల సమాహారం. సహజంగానే తన ఐడెంటిటీ ఆయన్ను మేయర్ కుర్చీకి దగ్గర చేసింది. అయితే జనాల్లో ఎంత ఆదరణ ఉన్నా.. వారితో ఎంత కనెక్టివిటీ ఉన్నా.. ఆయనకు పరిమితి ఉంది. చట్టాన్ని దాటి మందానీ ముందుకు పోలేరు.


Zohran Mamdani: జోహ్రాన్ మందానీ న్యూయార్క్ మేయర్‌గా ఫేమస్ అవ్వొచ్చు... కానీ ఎప్పటికీ US ప్రెసిడెంట్ అవ్వలేరు

ఈ రూల్ ఫెయిర్‌నా?

ఈ ప్రశ్న ఇప్పుడు అమెరికా రాజకీయ వేదికపై కొత్తగా వినిపిస్తోంది. ఎందుకంటే అమెరికా అనేది వలసదారుల దేశం. “ఇక్కడ పుట్టినవారే నాయకులు కావాలి” అనే ఆలోచన 18వ శతాబ్దపు భద్రతా భయాల ఫలితం. కానీ నేటి ప్రపంచంలో, ప్రత్యేకించి ఇమ్మిగ్రెంట్లతో గర్వపడే అమెరికాలో, ఇది చాలా మందికి పాతతరం ఆలోచనగా అనిపిస్తోంది. Gen Z తరానికి ఇది ఒక గ్లిచ్‌లా కనిపిస్తోంది సిస్టమ్‌లోని సాఫ్ట్‌వేర్ బగ్‌లా. ఎందుకంటే వారి దృష్టిలో నాయకత్వం పుట్టుకతో కాదు, పనితీరుతో, విలువలతో, దృక్పథంతో నిరూపించుకోవాల్సినది.

ఇప్పటివరకు ఈ రాజ్యాంగ నియమాన్ని మార్చే ప్రయత్నాలు కూడా జరిగాయి. “Equal Opportunity to Govern Act” వంటి బిల్లులు కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. , కానీ అవి చర్చ దశకే పరిమితమయ్యాయి. చట్ట సవరణ అంటే అమెరికాలో ఒక పెద్ద ప్రక్రియ. 2/3 రాష్ట్రాల ఆమోదం, కాంగ్రెస్‌ మద్దతు, ప్రజల ఓటు ఇవన్నీ అవసరం. ఇది ఇప్పట్లో అంత తేలికగా జరిగే విషయం కాదు.

మందానీ ప్రజల మనసుల్లోకి చొచ్చుకుపోగలరేమో కానీ.. Oval ఆఫీసు తలుపులను తెరుచుకుని లోపలకు మాత్రం వెళ్లలేరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Advertisement

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget