గంభీర్ భాయ్.. నీకో దండం! బ్యాటింగ్ పొజిషన్ ఇలా సెలక్ట్ చేస్తున్నావా?
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ చూసిన తర్వాత కచ్చితంగా మన బ్యాటర్ల బ్యాటింగ్ పొజిషన్ సెలక్ట్ చేసుకోవడానికి కోచ్ సాబ్ గంభీర్ పక్కాగా ఇదే సిస్టం ఇంప్లిమెంట్ చేస్తున్నాడనిపించింది. రీసెంట్‌గా ఆసీస్‌తో జరిగిన నాలుగో టీ20లో దూబే వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చాడు. అది చూసి సగటు భారత క్రికెట్ ఫ్యాన్‌కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇక లోయర్ ఆర్డర్లో జితేష్, అక్షర్, వాషింగ్టన్ ల బ్యాటింగ్ పొజిషన్స్‌ని అయితే చిట్టీలేసి మరీ సెలక్ట్ చేస్తున్నాడున్నాడు కోచ్ గంభీర్ సాబ్.
పాపం.. ఏ మ్యాచ్‌లో ఏ పొజిషన్లో బ్యాటింగ్‌కి దింపుతాడో తెలియక.. జుట్టు పీక్కుంటున్నారట. ఎందుకంటే.. రెండో టీ20లో అక్షర్ 6త్ ప్లేస్‌లో వచ్చాడు. ఆ వెంటనే మూడో మ్యాచ్‌లో 5త్ ప్లేస్‌లో వచ్చాడు. ఇక మూడో టీ20లో ఆల్‌రౌండర్ వాషిని.. 6త్ ప్లేస్‌లో దించి.. శాంసన్ ప్లేస్‌లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్‌ని 7వ ప్లేస్‌లో దించాడు. ఇక నిన్న ఈ ఫష్లింగ్‌కి పరాకాష్టగా.. ఎప్పుడూ 7త్, 8త్ ప్లేస్‌లో బ్యాటింగ్ చేసే దూబేని వన్ డౌన్‌లో పంపించేశాడు గంభీర్ భాయ్. అదే దూబే రెండో టీ20లో 8వ ప్లేస్‌లో బ్యాటింగ్‌కి వచ్చాడు. ఆ మ్యాచ్‌లో దూబేకంటే ముందు మన ఆల్ ఫార్మాట్ ఆల్ రౌండర్ హర్షిత్ రాణా బ్యాటింగ్‌కి దిగడం ఇంకా విచిత్రం.
అంతకుముందు వన్డేల్లో కూడా ఫస్ట్, సెకండ్ వన్డేల్లో ఓపెనింగ్ రేంజ్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌ని 6త్ ప్లేస్‌లో దించి.. అక్షర్‌ని 5త్‌లో దించాడు. అవే మ్యాచ్‌ల్లో పర్‌ఫెక్ట్ ఆల్‌రౌండర్ అయిన నితీశ్ కుమార్ రెడ్డిని.. 7వ ప్లేస్‌లో బ్యాటింగ్‌కి దింపి.. నితీశ్ కంటే పై పొజిషన్‌లో అంటే 6త్‌లో వాషిని దించాడు. ఇదంతా చూస్తుంటే.. గంభీర్ భాయ్.. కచ్చితంగా టీమిండియాని బ్రహ్మానందం రేంజ్‌లో ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటున్నాడని మాత్రం అర్థమవుతోంది. కానీ.. ప్లేయర్లే అందుకోలేకపోతున్నారట. అంతేకాదు.. ఏ బ్యాటర్‌ని ఎప్పుడు బ్యాటింగ్‌కి వెళ్లమని ఆర్డర్ వేస్తాడో తెలియక.. ఓపెనింగ్ నుంచే 11 మంది ప్యాడ్లు కట్టుకుని రెడీగా కూర్చుంటున్నారట పాపం.. ఏది ఏమైనా.. టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో ఈ రేంజ్ షఫ్లింగ్ చూసి ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కి జుట్టుపీక్కుంటున్నారట.





















