Remove stray dogs: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - ఆ ప్రాంతాల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశం
Supreme Court: ఆసుపత్రులు, పాఠశాలలు, బస్ స్టాండ్ల నుంచి తిరుగుబాటు కుక్కలను తొలగించి ఆశ్రయాలకు మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Supreme Court big order on stray dogs: వీధికుక్కల దాడులు పెరగిపోవడంతో సుప్రీం కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు, ఆసుపత్రులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పబ్లిక్ స్పోర్ట్స్ కాంప్లెక్సులు వంటి ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తక్షణమే తొలగించి, స్టెరిలైజేషన్ చేసిన తర్వాత ఆశ్రయాలకు మార్చాలని ఆదేశించింది. ఈ స్థలాల్లో కుక్కలను మళ్లీ విడుదల చేయకూడదని స్పష్టం చేసింది. అలా చేస్తే తమ ఆదేశాలకు ప్రయోజనం ఉండదన్నారు.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్‌వి అంజారియా బెంచ్ వీధి కుక్కల సమస్యను సుమోటోగా తీసుకుని విచారమ జరిపింది. ఈ ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (UTలు) 8 వారాల్లోపు ఈ ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని.. కుక్కలను పట్టుకుని, వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసిన తర్వాత ఆనిమల్ బర్త్ కంట్రోల్ (ABC) రూల్స్ 2023 ప్రకారం ఆశ్రయాలకు (షెల్టర్ హోమ్స్) మార్చాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
Having regard to the "alarming rise of dog-bite incidents", the Supreme Court on Friday ordered that every educational institution, hospital, public sports complexes, bus stand and depots, railway stations, etc must be fenced properly to prevent the entry of stray dogs.
— Live Law (@LiveLawIndia) November 7, 2025
Read… pic.twitter.com/F7Rtjg1igH
ఈ సంస్థలు, ప్రదేశాలకు చుట్టూ ఫెన్సింగ్) నిర్మించాలి. ప్రతి సంస్థకు ఒక నోడల్ అధికారిని నియమించి, క్రమం తప్పకుండా ఇన్‌స్పెక్షన్స్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రజలు కూడా వీధి కుక్కలకు పబ్లిక్ ప్లేస్‌లలో ఆహారం ఇవ్వకూడదని వాటికి ప్రత్యేక ఫీడింగ్ స్పేస్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్లు, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ఆవులు, ఇతర జంతువులను తొలగించి, గోశాలలు లేదా ఆశ్రయాలకు మార్చాలని ఆదేశించింది. దీనికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) బాధ్యత వహించాలని.. రాష్ట్రాలు, UTల చీఫ్ సెక్రటరీలు కలిసి డ్రైవ్‌లు నిర్వహించాలని ఆదేశించింది.
మీడియాలో వచ్చిన ఓ కథనం ఆధారంగా ఢిల్లీలో వీధి కుక్కల కాటు దాడులతో పిల్లలు బాధితులవుతున్నారని, ఇది ప్రజా ఆరోగ్యానికి, భద్రతకు ముప్పుగా మారిందని సుప్రీంకోర్టు కేసును సుమోటోగా తీసుకుంది. మొదట కుక్కలను ఆశ్రయాలకు మార్చాలని, విడుదల చేయకూడదని ఆదేశించింది. ఇది నాయిడా, గురుగ్రామ్, ఘాజియాబాద్‌కు వర్తిస్తుందని ప్రకటించింది. అయితే తర్వాత ుత్తర్వులు సవరించారు. చాలా రాష్ట్రాలు ABC రూల్స్‌పై అఫిడవిట్‌లు సమర్పించకపోవడంపై చీఫ్ సెక్రటరీలను సమన్స్ చేసింది. తాజాగా .. కీలకమైన ప్రాంతాల నుంచి తప్పించాలని సూచించింది. అనిమల్ వెల్ఫేర్ సంస్థలు, సీనియర్ అడ్వకేట్లు ఇప్పుడు ఉన్న కుక్కల తొలగిస్తే కొత్తవి వస్తాయని.. ఆ సమస్యకు తొలగింపు పరిష్కరం కాదని వాదించారు. కానీ బెంచ్ పరిగణనలోకి తీసుకోలేదు.





















