అన్వేషించండి

Numeros నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ ‘n-First’ లాంచ్‌ - సిటీ రైడర్లను ఆకట్టుకునే లుక్‌, ఫీచర్లు

బెంగళూరులోని Numeros Motors, ₹64,999 ప్రారంభ ధరతో ‘n-First’ ఎలక్ట్రిక్‌ బైక్‌ను లాంచ్‌ చేసింది. స్మార్ట్‌ ఫీచర్లు, 109 km రేంజ్‌, 16-అంగుళాల చక్రాలతో ఈ బైక్‌ యువతను ఆకట్టుకోనుంది.

Numeros n First Electric Scooter Launch: బెంగళూరు కేంద్రంగా పని చేసే EV స్టార్టప్‌ న్యూమెరోస్‌ మోటార్స్‌ (Numeros Motors) మరోసారి యువ రైడర్ల కోసం కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ తీసుకొచ్చింది. ఎన్‌-ఫస్ట్‌ (n-First) పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఎలక్ట్రిక్‌ టూ-వీలర్‌ ప్రారంభ ధర కేవలం ₹64,999 (ఎక్స్‌-షోరూమ్‌) మాత్రమే. మొదటి 1,000 మంది కస్టమర్లకు మాత్రమే ఈ ప్రత్యేక ధర వర్తిస్తుంది, ఆలస్యం చేస్తే ఈ సూపర్‌ ఆపర్చునిటీ చేజారి పోతుంది.

సిటీ రైడర్ల కోసం స్పెషల్‌ డిజైన్‌
n-First మోడల్‌ ప్రధానంగా అర్బన్‌ రైడర్లను, మరీ ముఖ్యంగా మహిళా కస్టమర్లను టార్గెట్‌ చేస్తోంది. బైక్‌ డిజైన్‌ను ఇటలీకి చెందిన Wheelab Design Studio తో కలిసి రూపొందించారు. తక్కువ బరువు, స్లిమ్‌ బాడీ, తేలికైన ఫ్రేమ్‌, సిటీ ట్రాఫిక్‌లో సులువైన హ్యాండ్లింగ్‌ ఈ బైక్‌కి హైలైట్స్‌. కాబట్టి, వయస్సులో పెద్దవాళ్లు, మహిళలు ఈ బండిని చాలా ఈజీగా నడిపించొచ్చు.

బ్యాటరీ & పనితీరు
n-First ఎలక్ట్రిక్‌ బైక్‌ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అందులో i-Max+ టాప్‌ మోడల్‌, ఇది 3 kWh బ్యాటరీతో 109 కి.మీ. (IDC రేంజ్‌) ఇస్తుంది. 2.5 kWh వెర్షన్‌లు సుమారు 91 కి.మీ. వరకు రన్‌ అవుతాయి. అన్ని వెర్షన్‌లలోనూ మిడ్‌-మౌంటెడ్‌ PMSM మోటర్‌, చైన్‌ డ్రైవ్‌, అలాగే OTA ‍‌(Over-the-Air) సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ సపోర్ట్‌ లభిస్తుంది.

ఫుల్‌ ఛార్జింగ్‌కి బ్యాటరీ ఆధారంగా 5 నుంచి 8 గంటల సమయం పడుతుంది.

16 అంగుళాల చక్రాలు - ప్రత్యేక ఫీచర్‌
స్కూటర్‌లలో చాలా అరుదుగా కనిపించే 16 అంగుళాల చక్రాలను ఈ బైక్‌కు బిగించారు. దీనివల్ల రోడ్డు గుంతల్లో కూడా రైడ్‌ స్టేబుల్‌గా ఉంటుంది. కంపెనీ ప్రకారం, n-First మోడల్‌ను జైసల్మేర్‌ వేడి వాతావరణం, మనాలి చలికాలం వంటి ఎక్స్‌ట్రీమ్‌ కండిషన్లలో కూడా టెస్ట్‌ చేశారు.

స్మార్ట్‌ టెక్‌ ఫీచర్లు
n-First యాప్‌ ద్వారా రైడర్లు థెఫ్ట్‌ అలర్ట్స్‌, జియో ఫెన్సింగ్‌, రిమోట్‌ లాక్‌, లైవ్‌ లొకేషన్‌, రైడ్‌ స్టాటిస్టిక్స్‌ వంటి స్మార్ట్‌ కనెక్టెడ్‌ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.

ఈ బండిని ఎక్కడ కొనాలి?
ప్రస్తుతం n-First బుకింగ్స్‌ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఓపెన్‌ అయ్యాయి. సిటీ రైడర్లకు స్టైలిష్‌గా, చవకగా ఉండే ఈ కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ నిజంగా గేమ్‌చేంజర్‌గా మారే అవకాశం ఉంది.

దక్షిణ భారతదేశంలో విస్తరణ
ఇటీవలే Diplos Max+ మోడల్‌ కూడా లాంచ్‌ చేసిన Numeros... ఇప్పుడు బెంగళూరు, చెన్నై, కొచ్చి, త్రిస్సూర్‌ వంటి నగరాల్లో డీలర్‌ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది.

Numeros Motors గురించి... 
2020లో ఏర్పాటైన  న్యూమెరోస్‌ మోటార్స్‌ కంపెనీకి బెంగళూరు సమీపంలో 70,000 యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్‌ ఉంది. ఇప్పటివరకు ఈ కంపెనీ 13.9 మిలియన్‌ కి.మీ. పైగా EV టెస్టింగ్‌ డేటా సేకరించింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget