క్రూయిస్ కంట్రోల్‌తో Hero Xtreme 160R 2026 అవతార్ - లాంచ్‌కు ముందే డీలర్‌షిప్‌లలో ప్రత్యక్షం
Hero Xtreme 160R 2026 మోడల్ అధికారిక లాంచ్ కంటే ముందే షోరూమ్‌లలోకి వచ్చింది. క్రూయిస్ కంట్రోల్, కొత్త LCD క్లస్టర్, USD ఫోర్క్స్‌తో యువతను ఆకట్టుకునేలా రూపొందించారు.

2026 Hero Xtreme 160R Reach Showrooms: బైక్‌ల ప్రపంచంలో తాజాగా మరొక సూపర్ హాట్ టాపిక్ - 'హీరో మోటోకార్ప్'. 2026 Hero Xtreme 160R మోడల్ ఇప్పటికే డీలర్‌షిప్‌లకు చేరిxof. అంటే, లాంచ్‌కు ముందే యువత మధ్య బజ్ క్రియేట్ చేసింది.
ఇటీవల జరిగిన డీలర్ ఈవెంట్‌లో, హీరో బ్రాండ్ తన అప్‌డేటెడ్ స్ట్రీట్ ఫైటర్ (బైక్) సిరీస్‌ను చూపించింది. ఇందులో Xtreme 125R తో పాటు Xtreme 160R కూడా ఉంది. Xtreme 160R ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే కొత్తగా వచ్చే దానిని ఫేస్‌లిఫ్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా డిజైన్‌లో చాలా మార్పులు చేసి, ఈ టూవీలర్‌ను మరింత మస్క్యులర్‌గా, స్టైలిష్‌గా మార్చారు.
కొత్త డిజైన్, కాంబాట్ ఎడిషన్
2026 Hero Xtreme 160R లో క్రొత్త ఫ్రంట్ ఫాసియా రూపొందించారు, దీనిని తమ పెద్ద మోడల్ Xtreme 250R నుంచి తీసుకున్నారు. కొత్త హెడ్‌ల్యాంప్స్ డిజైన్ మోడర్న్‌గా, అగ్రెసివ్‌గా ఉంది. డీలర్‌ల వద్ద కనిపించిన Combat Edition గ్రే కలర్‌లో యునిక్ గ్రాఫిక్స్‌తో మరింత ఆకర్షణీయంగా కనిపించింది. గోల్డ్ ఫినిష్‌లో ఉన్న USD టెలిస్కోపిక్ ఫోర్క్స్ ఈ బైక్ లుక్స్‌ను లెవల్ అప్ చేశాయి.
ఫ్యూయల్ ట్యాంక్ చీసెల్డ్ డిజైన్‌లో ఉంది. సింగిల్ పీస్ సీట్, టబ్బీ ఎగ్జాస్ట్, LED టెయిల్‌ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్లు - ఇవన్నీ బైక్‌కి మోడర్న్ టచ్ ఇస్తున్నాయి. ఇంజిన్ కవల్ కొత్త గ్రాఫిక్స్‌తో రివైజ్ చేశారు.
క్రూయిస్ కంట్రోల్, కొత్త LCD క్లస్టర్
2026 Xtreme 160R లో సరికొత్త టెక్నాలజీ “రైడ్ బై వైర్” తొ వచ్చింది. దీని వల్లే హీరో తమ మోటార్ సైకిల్‌లలో క్రూయిస్ కంట్రోల్ ఫీచర్‌ను జోడించగలిగింది. ఇది, హైవే రైడింగ్‌లో రైడర్‌కు ఎక్స్‌ట్రా కంఫర్ట్, రిలాక్స్ ఫీలింగ్ ఇస్తుంది. రైట్ హ్యాండ్ స్విచ్ గేర్‌లో క్రూయిస్ కంట్రోల్ బటన్ ఉంటే, లెఫ్ట్ హ్యాండ్‌లో కొత్త కలర్ LCD క్లస్టర్‌ను కంట్రోల్ చేసే స్విచ్‌లు ఉన్నాయి. ఇది Xtreme 250R మోడల్ నుంచి తీసుకొచ్చినదే. ఈ క్లస్టర్‌లో బ్లూటూత్, నావిగేషన్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
డ్యూయల్ చానల్ ABS, రైడ్ మోడ్‌లు ఇప్పుడు డిఫాల్ట్‌గా లభిస్తాయి. టైర్ సైజులు, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ప్రస్తుత మోడల్ తరహాలోనే ఉన్నాయి. 163.2 cc సింగిల్ సిలిండర్ 4V ఆయిల్ కూల్డ్ ఇంజిన్ తో ఇది 16.6 bhp పవర్, 14.6 Nm టార్క్ ఇస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో జత కావడం ఈ బండి పర్ఫార్మెన్స్‌ను పెంచుతుంది. కానీ USB పోర్ట్ ఇంకా Type-A ఫార్మాట్‌లోనే ఉండటం మాత్రం చిన్న నిరాశ.
ఈ సెగ్మెంట్‌లో ఫస్ట్
హీరో, ఈ మోడల్‌ను 160cc సెగ్మెంట్‌లో తమ మార్కెట్ షేర్ పెంచే విధంగా డిజైన్ చేసింది. క్రూయిస్ కంట్రోల్ ఫీచర్ ఈ సెగ్మెంట్‌లో ప్రస్తుతం ఇతర బ్రాండ్స్‌లో లేదని కూడా గమనించాలి. ఈ బండి ఇంకా లాంచ్ కాలేదు కాబట్టి ధరను అధికారికంగా ప్రకటించలేదు. కానీ హైదరాబాద్, విజయవాడ షోరూమ్‌లలో త్వరలో అందుబాటులోకి రానుంది.
కొత్త డిజైన్, శక్తిమంతమైన ఫీచర్లు, కంఫర్ట్ & టెక్నాలజీ సమతుల్యతతో 2026 Hero Xtreme 160R యువతకు తగిన స్ట్రీట్ ఫైటర్‌గా మారబోతోంది. మీ రైడింగ్ స్టైల్‌కి టెక్-టచ్ జోడించాలనుకుంటే ఈ బైక్ మీద ఓ కన్నేయండి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















