అన్వేషించండి

2025 Hyundai Venue డీజిల్‌ వచ్చేసింది - Tata Nexon, Kia Sonet, Mahindra XUV 3XO ముందు నిలుస్తుందా?

కొత్త Hyundai Venue డీజిల్‌ SUV మైలేజ్‌, ధర, ఫీచర్లు చాలా బాగున్నాయి. దీనిని Kia Sonet, Tata Nexon, Mahindra XUV 3XOతో పోలిస్తే ఏది 'వాల్యూ ఫర్ మనీ'గా నిలుస్తుందో ఈ రిపోర్ట్‌లో తెలుసుకోండి.

New Hyundai Venue Diesel Mileage, Price Comparison: దేశంలో కాంపాక్ట్‌ SUV మార్కెట్‌ వేగంగా పెరుగుతోంది. ప్రతి కంపెనీ తనదైన స్టైల్‌లో కొత్త SUVలు తెస్తుండగా, Hyundai Venue కూడా... రెండో తరం డీజెల్‌ వెర్షన్‌తో మళ్లీ రంగంలోకి దిగింది. సెకండ్‌-జెన్‌ వెన్యూను నవంబర్‌ 4, 2025న లాంచ్‌ చేసింది. అయితే... Kia Sonet, Tata Nexon, Mahindra XUV 3XO, Maruti Suzuki Brezza, Skoda Kylaq లాంటి పాతుకుపోయిన ప్రత్యర్థుల మధ్య Venue ఎంత బలంగా నిలుస్తుందో తెలుసుకుందాం.

కొత్త వెన్యూ ఇంజిన్‌ పవర్‌, పనితీరు
కొత్త Venue డీజిల్‌ వెర్షన్‌లో 1.5 లీటర్‌ టర్బో డీజిల్‌ ఇంజిన్‌ అందించారు. ఇది 114 bhp శక్తి, 250 Nm టార్క్‌ ఇస్తుంది. ఇదే ఇంజిన్‌ Kia Sonet, Syros లో కూడా వాడుతున్నారు. అంటే పవర్‌ అవుట్‌పుట్‌ పరంగా ఇవన్నీ దగ్గరగా ఉంటాయి. కానీ Tata Nexon డీజిల్‌ 260 Nm టార్క్‌తో మరికాస్త బలంగా నిలుస్తుంది. అంతేకాదు.. Mahindra XUV 3XO డీజిల్‌ 300 Nm టార్క్‌ ఇస్తూ మరింత శక్తిమంతమైన SUVగా నిలుస్తోంది. Venueలో కొత్తగా వచ్చిన 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ మాత్రం మంచి ఫీచర్‌. Venue లో దీనిని మొదటిసారి ప్రవేశపెట్టారు.

మైలేజ్‌ పోలిక
మైలేజ్‌ వైపు చూసుకుంటే, Venue డీజిల్‌ ARAI ప్రకారం 24.2 kmpl (మాన్యువల్‌) & 19.1 kmpl (ఆటోమేటిక్‌) ఇస్తుంది. Kia Sonet కంటే కాస్తా ఎక్కువ మైలేజ్‌ ఇస్తుంది, కానీ Nexon డీజిల్‌ మాత్రం అన్ని కాంపాక్ట్‌ SUVల్లో టాప్‌ మైలేజ్‌ SUVగా నిలుస్తోంది. Mahindra XUV 3XO (AMT) వేరియంట్‌ కూడా సగటున బాగానే ఇస్తోంది. మొత్తంగా చూస్తే Venue మైలేజ్‌ బాగుంది కానీ Tata Nexon ‌ను మించలేకపోయింది.

కొత్త హ్యుందాయ్ వెన్యూ డీజిల్ మైలేజ్ vs ప్రత్యర్థులు

 
హ్యుందాయ్ వెన్యూ కియా సోనెట్ కియా సైరోస్‌ మహీంద్రా XUV 3XO టాటా నెక్సాన్
6-గేర్‌ MT 20.99 kmpl - 20.75 kmpl 20.6 kmpl 23.23 kmpl
6-గేర్‌ AMT N/A N/A N/A 21.2kpl 24.08kpl
6-గేర్‌ AT
 
17.9 kmpl 18.6 kmpl 17.65 kmpl N/A N/A

ధరల పోలిక
కొత్త Hyundai Venue డీజిల్‌ ధరలు ₹9.70 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి మొదలై ₹12.51 లక్షల వరకు ఉన్నాయి. Kia Sonet తో పోలిస్తే సుమారు ₹1.50 లక్షల వరకు ఎక్కువ. Syros తో పోలిస్తే దాదాపు ₹3.6 లక్షల వ్యత్యాసం ఉంది. కానీ ఫీచర్ల పరంగా Venue అప్‌గ్రేడ్‌ ఫీల్‌ ఇస్తుంది. Tata Nexon డీజిల్‌ MT వెర్షన్‌ కంటే Venue కాస్త తక్కువ ధరలో ఉంది, అయితే ఆటోమేటిక్‌ వేరియంట్లలో Venue ధర కాస్త ఎక్కువే.

కొత్త హ్యుందాయ్ వెన్యూ డీజిల్ ధరలు vs ప్రత్యర్థులు

 
హ్యుందాయ్ వెన్యూ కియా సోనెట్ కియా సైరోస్‌ మహీంద్రా XUV 3XO టాటా నెక్సాన్
MT ధరలు రూ. 9.70-12.51 లక్షలు రూ. 8.98-11.25 లక్షలు రూ. 10.14-12.80 లక్షలు రూ. 8.95-13.43 లక్షలు రూ. 10.00-14.90 లక్షలు
AMT ధరలు N/A N/A N/A రూ. 10.71-13.17 లక్షలు రూ. 11.70-15.60 లక్షలు
AT ధరలు రూ. 11.58-15.51 లక్షలు రూ. 12.03-14.00 లక్షలు రూ. 15.22-15.94 లక్షలు N/A N/A

ఫీచర్లలో కొత్తదనం
రెండో తరం Venue కొత్త Global K1 ప్లాట్‌ఫామ్‌ మీద తయారైంది. మరింత సేఫ్‌గా, రోడ్‌ గ్రిప్‌ బలంగా ఉండేలా దీనిని రూపొందించారు. కొత్త ఇన్ఫోటైన్‌మెంట్‌, డిజిటల్‌ క్లస్టర్‌, బ్లూలింక్‌, వెంట్‌లేటెడ్‌ సీట్లు వంటి ఫీచర్లు కూడా యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి.

మొత్తం మీద Hyundai Venue డీజిల్‌ స్టైలిష్‌గా, ఫీచర్లతో నిండిన SUV. పనితీరు, సేఫ్టీ పరంగా బాగుంది. అయితే మీరు మైలేజ్‌కి ప్రాధాన్యం ఇస్తే Nexon మంచి ఆప్షన్‌. ఆటోమేటిక్‌ సౌకర్యం కావాలంటే Venue లేదా Sonet తీసుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Suriya 46 Movie : ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
Cheapest Automatic Cars India: ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Suriya 46 Movie : ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
Cheapest Automatic Cars India: ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Cinnamon Water : 2026లో బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే దాల్చినచెక్క నీరు తాగేయండి
2026లో బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే దాల్చినచెక్క నీరు తాగేయండి
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Embed widget