అన్వేషించండి

Hyundai Verna 2026 వెర్షన్ వచ్చేసింది - కొత్త డిజైన్, అదనపు సేఫ్టీ ఫీచర్లు

2026 Hyundai Verna ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త గ్రిల్, స్టీరింగ్ వీల్, అదనపు ఫీచర్లు, 7 ఎయిర్‌బ్యాగ్స్ వంటి మార్పులు వచ్చాయి. పాత వెర్నాతో పోలిస్తే ఏం మారింది, ధరలు ఎంత అనే వివరాలు తెలుసుకోండి.

Hyundai Verna facelift 2026: మన దేశంలో, సెడాన్ కార్లలో మంచి డిమాండ్ ఉన్న మోడళ్లలో Hyundai Verna ఒకటి. ఇప్పుడు హ్యుందాయ్ కంపెనీ, ఈ కారుకు 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్‌లో కారుకు పెద్దగా మార్పులు లేకపోయినా, కొత్త స్టైలింగ్ టచ్‌లు, ఇంటీరియర్ ఫీచర్లు & అదనపు సేఫ్టీ ఫీచర్లను జోడించారు. అయితే ఇంజిన్ & మెకానికల్ సెటప్ మాత్రం యథాతథంగానే ఉంది.

ఇప్పుడు కొత్త Hyundai Verna Facelift పాత వెర్షన్‌తో పోలిస్తే ఏం మారిందో తెలుసుకుందాం.

ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో మార్పులు

2026 వెర్నా మోడల్‌లో ప్రధానంగా సబ్‌టిల్ డిజైన్ అప్‌డేట్స్ మాత్రమే కనిపిస్తాయి.

కారు ముందు భాగంలో... కొత్త డార్క్ క్రోమ్ గ్రిల్, రివైజ్డ్ LED హెడ్‌ల్యాంప్స్ ఇచ్చారు. ఫ్రంట్ బంపర్ డిజైన్ కూడా కొద్దిగా మార్చారు. బంపర్ దిగువ భాగంలో & అంచుల వద్ద మరింత స్పష్టమైన డిజైన్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. ఇంకా, కొత్త 16 అంగుళాల అలాయ్ వీల్ డిజైన్ కూడా అందుబాటులోకి వచ్చింది.

కారు వెనుక భాగంలో మాత్రం పెద్ద మార్పులు లేవు. కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, బూట్ మౌంటెడ్ స్పాయిలర్ అదేవిధంగా కొనసాగుతాయి. కానీ రియర్ బంపర్ కొత్త డిజైన్‌తో వచ్చింది. దీనిలో సిల్వర్ ట్రిమ్ & డిఫ్యూజర్ ఎలిమెంట్ జోడించారు.

ఇంకా రెండు కొత్త కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి, అవి: Classy Blue, Titan Grey Matte. 

మొత్తానికి, వెర్నాకు ఉండే షార్ప్ డిజైన్‌ను అలాగే ఉంచుతూ చిన్నపాటి మార్పులు చేశారు.

ఇంటీరియర్‌లో మార్పులు

క్యాబిన్ డిజైన్‌లో పెద్ద మార్పులు లేవు. వెర్నాలో ఇప్పటికీ... డ్యూయల్ టోన్ బ్లాక్ & వైట్ ఇంటీరియర్ ఉంటుంది.

అయితే టర్బో పెట్రోల్ వేరియంట్లలో ఆల్ బ్లాక్ థీమ్ కొనసాగుతుంది.

ఈ కారులో ఉన్న రెండు 10.25 అంగుళాల స్క్రీన్‌లు అలాగే ఉన్నాయి. కానీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కు కొత్త గ్రాఫిక్స్ ఇచ్చారు.

ఇంకా, కొత్తగా త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు. దీనిపై హ్యుందాయ్ కంపెనీ మోర్స్ కోడ్ ‘H’ లోగో ఉంటుంది. ఇదే డిజైన్ Venue & Ioniq 5 మోడళ్లలో కూడా కనిపిస్తుంది.

ఈ మోడల్‌లో Venue లాంటి 12.3 అంగుళాల పెద్ద స్క్రీన్‌లు ఇవ్వలేదు, ఎందుకంటే వెర్నా ప్లాట్‌ఫామ్ కొత్త Nvidia ఆధారిత ఎలక్ట్రానిక్ ఆర్కిటెక్చర్‌కు సపోర్ట్ చేయదు.

కొత్తగా వచ్చిన ఫీచర్లు

కొత్త వెర్నాలో కొన్ని కంఫర్ట్ & సేఫ్టీ ఫీచర్లు కూడా జోడించారు, అవి:

ఫ్రంట్ ప్యాసింజర్ పవర్డ్ సీట్

డ్రైవర్ సీట్ మెమరీ ఫంక్షన్

బాస్ మోడ్ (వెనుక సీటులో కూర్చున్న వారు ముందు సీట్‌ను ముందుకు జరపవచ్చు)

భద్రత

సేఫ్టీ విషయానికి వస్తే, టాప్ వేరియంట్‌లో ఇప్పుడు 360 డిగ్రీ కెమెరా, 7 ఎయిర్‌బ్యాగ్స్ అందిస్తున్నారు. ఇంతకుముందు ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్ మాత్రమే ఉండేవి. సెగ్మెంట్‌లో 7 ఎయిర్‌బ్యాగ్స్ ఇవ్వడం ఒక ప్రత్యేక ఫీచర్‌గా చెప్పుకోవచ్చు.

ఇంజిన్ & గేర్‌బాక్స్

మెకానికల్ పరంగా వెర్నాలో ఎలాంటి మార్పులు లేవు. ఇందులో రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి:

1.5 లీటర్ నేచురల్లి ఆస్పిరేటెడ్ పెట్రోల్; ఇది ఇచ్చే పవర్: 115 hp

1.5 లీటర్ టర్బో పెట్రోల్; ఇది ఇచ్చే పవర్: 160 hp

ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు:

6 స్పీడ్ మాన్యువల్

NA ఇంజిన్‌కు CVT ఆటోమేటిక్

టర్బో ఇంజిన్‌కు 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్

ధరలు

కొత్త Hyundai Verna ధరలు కొద్దిగా పెరిగాయి.

ఎక్స్ షోరూమ్ ధరలు: రూ. 10.98 లక్షల నుంచి రూ.18.25 లక్షల వరకు

బేస్ వేరియంట్ ధర సుమారు రూ.18,000 పెరిగింది, టాప్ వేరియంట్ ధర దాదాపు రూ.1.10 లక్షల వరకు పెరిగింది.

ఇంకా హ్యుందాయ్ ఇప్పుడు వేరియంట్ పేర్లను కూడా మార్చింది. కొత్త వేరియంట్లు: HX2, HX4, HX6, HX6+, HX8, HX10

మొత్తానికి, 2026 Hyundai Verna Facelift మోడల్‌ పెద్ద మార్పులు లేకుండా చిన్నపాటి డిజైన్ టచ్‌లు, కొత్త ఫీచర్లు, అదనపు సేఫ్టీతో వచ్చింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: మోడ్రన్‌ ఫీచర్లు ఉన్న ఈ కారు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
Honda Elevate Facelift డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిజమైన రోడ్డుపై ఎలా ఉంది? కొనవచ్చా?
మారుతి బలెనోకు పోటీగా 2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్‌తో మైలేజీ పెరుగుతుందా?
అక్టోబర్ 14న వస్తున్న టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌.. కొత్తగా ఏం ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు?
39hp పవర్‌తో కవాసాకి కొత్త బైక్‌ Kawasaki Z300.. రూ.3 లక్షల లోపే! ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే?
నింజా 300 ఇంజిన్‌తో కొత్త స్ట్రీట్ ఫైటర్.. Kawasaki Z300 లుక్‌ ఇదే - KTM డ్యూక్‌కు గట్టి పోటీ!
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
Embed widget