Best Car Under 10 Lakh: డైలీ డ్రైవ్ కోసం ₹8-10 లక్షల్లో బెస్ట్ మిడ్-సైజ్ హ్యాచ్‌బ్యాక్ కావాలా? - ఈ కారు మీకు సరైన ఎంపిక!
రోజూ 50 కి.మీ. వరకు ప్రయాణం చేసే వారికి కంఫర్ట్, మైలేజ్ రెండూ కావాలంటే Maruti Suzuki Swift పర్ఫెక్ట్ ఆప్షన్. ₹8–10 లక్షల బడ్జెట్‌లో నమ్మకమైన పెర్ఫార్మెన్స్‌తో అందరికీ సూట్ అవుతుంది.

Comfortable daily commute hatchback under 10 lakhs: మీరు ప్రతి రోజూ 50 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తున్నారా?. ఈ అవసరం కోసం ఒక మంచి మిడ్-సైజ్ హ్యాచ్‌బ్యాక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?. ఇలాంటి సందర్భంలో, కారు కొనేటప్పుడు రెండు విషయాలు తప్పనిసరిగా చూడాలి - కంఫర్ట్ & మైలేజ్. ₹8–10 లక్షల బడ్జెట్‌లో ఈ రెండింటినీ సమానంగా ఇచ్చే కారు ఏది అంటే… - Maruti Suzuki Swift పేరు చెప్పవచ్చు!.
స్టైలిష్ లుక్‌తో యంగ్ ఫీలింగ్
Maruti Swift అంటే యూత్‌కి ఫేవరెట్ హ్యాచ్‌బ్యాక్. షార్ప్ హెడ్‌ల్యాంప్స్, స్పోర్టీ ఫ్రంట్ గ్రిల్, డ్యూయల్ టోన్ ఆప్షన్ లుక్‌తో ఈ కారు రోడ్డు మీద ప్రత్యేకంగా కనిపిస్తుంది. 20ల వయసులో ఉన్న యువకుడైనా, 40ల్లో ఉన్న మధ్యవయస్కుడైనా - Swift డ్రైవింగ్ స్మూత్ అనిపిస్తుంది.
కంఫర్ట్ & ఇంటీరియర్
రోజూ 45 కి.మీ. ప్రయాణం అంటే డ్రైవర్‌కి సీట్ కంఫర్ట్, సస్పెన్షన్ క్వాలిటీ చాలా ముఖ్యం. Swiftలో ఇచ్చిన సీట్లు సపోర్టివ్‌గా ఉంటాయి. సస్పెన్షన్ సాఫ్ట్‌గా ఉండడం వల్ల బంప్‌లు, గుంతల్లో కూడా కారు స్ధిరంగా ఉంటుంది. కేబిన్ స్పేస్ కూడా సరిపడా ఉండడంతో లాంగ్ రైడ్స్‌లోనూ అలసట తక్కువగా ఉంటుంది.
మైలేజ్ విషయానికి వస్తే...
Maruti Swiftలో ఉన్న 1.2 లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ స్మూత్‌గా పని చేస్తుంది. కంపెనీ క్లెయిమ్ చేసిన ప్రకారం, సిటీ డ్రైవింగ్‌లో సుమారు 20-22 kmpl, హైవే మీద 25 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది. అంటే రోజూ 50 km ప్రయాణం చేసినా, నెలకు ఫ్యూయల్ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఇది ఫ్యామిలీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్.
మెయింటెనెన్స్ & రిలయబిలిటీ
Maruti కార్లు మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉండడమే కాకుండా, సర్వీస్ సెంటర్లు గ్రామాల దాకా అందుబాటులో ఉండటం వలన సౌకర్యంగా ఉంటుంది. Swift రిపేర్ ఖర్చు తక్కువ, స్పేర్ పార్ట్స్ ఈజీగా దొరుకుతాయి. దీనిని డైలీ కమ్యూటింగ్ కోసం ఉపయోగిస్తే ఏ ఇబ్బంది ఉండదు.
స్విఫ్ట్‌కు ప్రత్యామ్నాయ కార్లు కూడా ఉన్నాయి
₹8–10 లక్షల బడ్జెట్‌లో మారుతి స్విఫ్ట్ మాత్రమే కాదు, మరికొన్ని ఇతర మోడళ్లను కూడా పరిశీలించవచ్చు. Hyundai Grand i10 Nios, Tata Tiago లాంటి కార్లూ మీ అవసరానికి సరిపోతాయి. కానీ Swift మాత్రం మైలేజ్, స్మూత్ డ్రైవ్, రీసేల్ విలువ - ఇలా ఆల్-రౌండ్ పెర్ఫార్మెన్స్‌లో ముందుంది.
అంతేకాదు, ఫస్ట్ కారు కొనేవాళ్లకు కూడా మారుతి స్విఫ్ట్ ఒక పర్ఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. లుక్, ఫన్ & మైలేజ్ - మూడింటినీ ఇది చక్కగా బ్యాలెన్స్ చేసింది.
రోజూ 50 కి.మీ. వరకు ప్రయాణం చేసే యువ డ్రైవర్‌కి ₹8–10 లక్షల రేంజ్‌లో Maruti Suzuki Swift కన్నా మంచి కాంబినేషన్ దొరకడం కష్టం.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















