అల్లటప్పా ఆటగాడనుకున్నారా.. రీప్లేస్ చేయాలంటే బాబులు దిగిరావాల!
టీమిండియాలో నెంబర్ 3 పొజిషన్లో విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదు. దాదాపు 15 ఏళ్ల పాటు.. వన్ డౌన్‌లో పెట్టని గోడలా.. టీమిండియాకి ఎన్నో అద్భుతమైన విజయాలందించాడు విరాట్. ఒక్క మాటలో చెప్పాలంటే భారత క్రికెట్ చరిత్రలో కోహ్లీలా ఇంకే బ్యాటర్ కూడా ఆ పొజిషన్లో అన్నేళ్ల పాటు కొనసాగింది లేదు. అంతకంటే ముఖ్యంగా ఆ ప్లేస్‌లో కోహ్లీలా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టిందీ లేదు. టీమిండియాలో ది వాల్‌గా పేరు తెచ్చుకున్న లెజెండరీ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ కూడా విరాట్ కోహ్లీ తర్వాతే.
మరి అంతలా వన్ డౌన్ పొజిషన్‌ని విరాట్ ఓన్ చేసుకున్నాడు. కానీ.. లాస్ట్ ఇయర్ 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ పొట్టి ఫార్మాట్‌కి రిటైర్మెంట్ ఇచ్చేయడంతో అసలు సమస్య మొదలైంది. కోహ్లీ సింపుల్‌గా రిటైర్మెంట్ ఇచ్చేసినప్పటి నుంచి.. థర్డ్ పొజిషన్లో బ్యాటింగ్ చేయడానికి ఎన్నో ఆప్షన్లని ట్రై చేసింది టీమిండియా మేనేజ్‌మెంట్. తిలక్ వర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, చివరిగా నిన్న ఆసీస్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌లో శివమ్ దూబే. ఇంతమందిని ట్రై చేసినా.. ఒక్కరంటే ఒక్కరు కూడా కోహ్లీ రేంజ్‌లో ఆ ప్లేస్‌ని సెక్యూర్ చేసుకోలేకపోతున్నారు. దీంతో టీమిండియాలో వన్ డౌన్ బ్యాటర్‌ని ఫిక్స్ చేయడం బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారింది.
ఇదంతా చూసి కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం.. అల్లాటప్పా ఆటగాడనుకున్నార్రా.. రీప్లేస్ చేయాలంటే బాబులు దిగిరావాల’ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. అంతేకాకుండా.. టీ20 రిటైర్మెంట్‌కే ఇంతలా వణికిపోతున్నారు.. మరి రేప్పొద్దున వన్డే రిటైర్మెంట్ కూడా ఇచ్చేస్తే పరిస్థితేంటో అంటూ సెటైర్లు కూడా పేలుస్తున్నారు. కానీ.. కొంతమంది మాత్రం.. థర్డ్ ప్లేస్‌లో అయ్యర్‌ని ఆడిస్తే పక్కా సెట్ అవుతాడంటూ సలహా ఇస్తున్నారు.




















