Honda SP 125 Bike EMI : ఒకసారి హోండా SP 125 బైక్ ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కి.మీ.లు ఆగాల్సిన పనిలేదు! కొనడానికి ఎంత EMI చెల్లించాలి?
Honda SP 125 Bike EMI : మంచి మైలేజ్, బెటర్ ప్రైస్‌లో బైక్ కొనాలనుకుంటే హోండా SP 125 మంచి ఆప్షన్. బైక్‌పై ఎక్కువ దూరం ప్రయాణించే వాళ్లకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది.

Honda SP 125 Bike Down Payment and EMI:: Honda SP 125 బైక్ ఆన్ డౌన్ పేమెంట్ అండ్ EMI: సగటు భారతీయులు బైక్ కొనాలంటే ముందుగా మైలేజీని చూస్తారు. అందుకే చాలా కంపెనీలు మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేసుకొనే కంపెనీలు మైలేజికి ప్రాధాన్యత ఇస్తుంటాయి. ఇలా బైక్స్‌లో మొదటి వరుసలో ఉండేది Honda SP 125 బైక్. దీని బడ్జెట్ అందుబాటులో ఉండటమే కాకుండా మైలేజీ విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది.
టూవీలర్‌పై ఎక్కువ సమయం గడిపే ఉద్యోగులకు, ఇతర రంగాల ప్రజలు ఈ హోండా బెస్ట్ ఆఫ్షన్‌గా ఉంటుంది. అయితే ఈ బైక్ ధర, ఫీచర్లు, పవర్ ట్రెయిన్ గురించి తెలుసుకుందాం.
Honda SP 125 ఇండియన్ మార్కెట్లో ఎక్స్-షోరూమ్ ధర 85 వేల 131 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. దీని ధర 89 వేల 131 రూపాయల వరకు ఉంటుంది. హోండా కంపెనీ ఈ మోటార్ సైకిల్ రెండు వేరియంట్లలో అందిస్తోంది. ఒకటి డ్రమ్, రెండోది డిస్క్ మోడల్‌లో వస్తుంది. ఈ బైక్ లో ABSతోపాటు డిస్క్ బ్రేక్ సౌకర్యం కూడా లభిస్తుంది.
Honda SP 125 ఆన్-రోడ్ ధర ఎంత?
హోండా SP 125 బేస్ వేరియంట్ హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర 1,09,675. ఈ ధరలో 11,053 రూపాయల RTO, 6,506 రూపాయల ఇన్సూరెన్స్ మొత్తం చేర్చారు. మీరు ఈ బైక్ ను 5 వేల రూపాయల డౌన్ పేమెంట్ పై కూడా కొనుగోలు చేయవచ్చు. దీనికి ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలో తెలుసుకుందాం.
ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి?
ఐదు వేలు డౌన్ పేమెంట్ చేసిన తర్వాత మీరు 1,04,675 రూపాయల బైక్ లోన్ తీసుకోవాలి. మీరు 10 శాతం వడ్డీ రేటుతో లోన్ తీసుకుంటే, మీరు 3 సంవత్సరాలకు ప్రతి నెలా 3,378 రూపాయల EMI చెల్లించాలి. ఒక విషయం గమనించాల్సింది ఏమిటంటే, ధర నగరాలు, డీలర్షిప్స్ ఆధారంగా మారుతుంది. ఈఎంఐ మీరు ఐదేళ్ల కోసం కూడా తీసుకోవచ్చు.
Honda SP 125 బైక్‌లో 123.94cc సింగిల్-సిలిండర్ BS 6, OBD2 కంప్లైంట్ PGM-FI ఇంజన్ లభిస్తుంది. ఇది 8kW పవర్, 10.9 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. కంపెనీ చెబుతున్నట్టు Honda SP 125 బైక్ ఒక లీటర్ పెట్రోల్‌తో 65 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. మీరు ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే దాదాపు 700 కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది.
ఇదే వడ్డీ రేటుకు బైక్ లోన్ ఏడాదికి తీసుకుంటే నెలకు 8,661 రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
ఇదే వడ్డీ రేటుకు బైక్ లోన్ ఏడాదిన్నరకు తీసుకుంటే నెలకు 5,913 రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
ఇదే వడ్డీ రేటుకు బైక్ లోన్ రెండేళ్లకు తీసుకుంటే నెలకు 4,540 రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
ఇదే వడ్డీ రేటుకు బైక్ లోన్ రెండున్నరేళ్లకు తీసుకుంటే నెలకు 3,717 రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
ఇదే వడ్డీ రేటుకు బైక్ లోన్ మూడున్నరేళ్లకు తీసుకుంటే నెలకు 2,780 రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
ఇదే వడ్డీ రేటుకు బైక్ లోన్ నాలుగేళ్లకు తీసుకుంటే నెలకు 2,488రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
ఇదే వడ్డీ రేటుకు బైక్ లోన్ నాలుగున్నరేళ్లకు తీసుకుంటే నెలకు 2,262 రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
ఇదే వడ్డీ రేటుకు బైక్ లోన్ ఐదేళ్లకు తీసుకుంటే నెలకు 2,082 రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

