Soniya Singh buys Benz Car: రూ.60 లక్షల కారు కొన్న యంగ్ యాంకర్ - లుక్ అదిరిందిగా..
Virupaksha actress Soniya Singh buys Car: ప్రముఖ నటి సోనియా సింగ్ తన డ్రీమ్ కారును కొనుగోలు చేశారు. తన పార్టనర్ సిద్ధుతో కలిసి బెంజ్ కారును కొని సంబరాలు చేసుకున్నారు.

Virupaksha Actress Soniya Singh Buys Benz Car: యంగ్ బ్యూటీ, ప్రముఖ నటి సోనియాసింగ్ (Soniya Singh) తన కలల కారును కొనుగోలు చేశారు. దాదాపు రూ.60 లక్షలు పెట్టి మాధాపూర్‌లోని షోరూంలో మెర్సిడిస్ బెంజ్ సి క్లాస్ కారును కొన్నారు. దీంతో ఆమె తన బాయ్ ఫ్రెండ్ సిద్ధు, తన ఫ్యామిలీతో కలిసి సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read: 'దేవర'తో ఆటో గ్రాఫ్ స్వీట్ మెమొరీస్ - జపాన్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఇక మాస్ జాతరే..
అటు, సోషల్ మీడియాలోనూ ఇటు నటిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు సోనియా సింగ్. తొలుత ఇన్ స్టా రీల్స్ చేస్తూ భారీగా ఫాలోయర్స్‌ను సంపాదించుకున్నారు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్స్‌లో షార్ట్ ఫిల్మ్స్‌లో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఛాయ్ బిస్కెట్, గర్ల్స్ ఫార్ములా వంటి యూట్యూబ్ ఛానల్స్‌లో కామెడీ వీడియోస్‌తో పాపులర్ అయ్యారు. ఆ తర్వాత రౌడీ బేబీ, హే పిల్ల వంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా సొంతంగా వీడియోలు చేస్తూ హైప్ సంపాదించుకున్నారు. అలా తన అందం, అభినయం, నటనతో ఆకట్టుకుంటూ పలు సీరియల్స్‌లోనూ ఛాన్స్ దక్కించుకున్నారు.
'విరూపాక్ష'తో గుర్తింపు
ఈ క్రమంలోనే సాయిదుర్గా తేజ్ 'విరూపాక్ష' మూవీలో ఛాన్స్ కొట్టేసి కీలక పాత్రలో నటించి మెప్పించారు. మూవీలో ఆమె పల్లెటూరి అమ్మాయిగా కనిపించి ఆకట్టుకున్నారు. ఇంటర్వెల్ సీన్‌లో సోనియా నటన అద్భుతమనే ప్రశంసలు దక్కాయి. దీంతో వరుసగా సినిమా ఆఫర్లు సోనియాకు క్యూ కట్టాయి.
సోనియా తనతో పాటు షార్ట్ ఫిల్మ్స్ చేసిన నటుడు పవన్ సిద్ధుతో కలిసి ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ కలిసి పలు షార్ట్ ఫిల్మ్స్‌లో సైతం నటించారు. అటు.. సోషల్ మీడియాలోనూ కలిసి రీల్స్, ఫోటోలు చేస్తూ సందడి చేశారు. తాజాగా.. తన డ్రీమ్ కారును కొనుగోలు చేసి సిద్ధుతో కలిసి సంబరాల్లో మునిగి తేలారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

