IPL 2025 CSK VS MI Updates: ఎల్ క్లాసికో పోరుకు రంగం సిద్ధం.. నేడు చెన్నైతో ముంబై ఢీ.. హార్దిక్ గైర్హాజరు.. అటు CSKలో దిగులు
గతేడాది ఇరుజట్లు ఘోర ప్రదర్శన చేశాయి. పదో స్థానంతో ముంబై అట్టడుగులో నిలవగా, చెన్నై ఐదో స్థానంతో ప్లే ఆఫ్స్ కు చేరలేదు. ఈ సారి ఎలాగైనా నాకౌట్ కు చేరాలని ఫస్ట్ టార్గెట్ ను పెట్టుకున్నాయి.

CSK VS MI IPl H2H Records: ఐపీఎల్లో ఆదివారం రెండు ఉత్కంఠ భరిత మ్యాచ్ లు జరుగనున్నాయి. తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఢీకొంటుండగా, రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ అమీ తుమీ తేల్చుకోనుంది. ఎల్ క్లాసికో అని పేరు గాంచిన చెన్నై, ముంబై మధ్య పోరు ఐపీఎల్ ను హీటెక్కిస్తోంది. ఇరు జట్లు దిగ్గజ ఆటగాళ్లతో నిండి ఉండటంతో ఈ మ్యాచ్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక చెరో ఐదు టైటిళ్లతో ముంబై, చెన్నై ఈ టోర్నీలో తమ డామినేషన్ ను చూపించాయి. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్ లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. అయితే గతేడాది ఇరుజట్లు ఘోర ప్రదర్శన చేశాయి. పదో స్థానంతో ముంబై అట్టడుగు స్థానంలో నిలవగా, చెన్నై ఐదో స్థానంతో ప్లే ఆఫ్ బెర్త్ ను అర్హత సాధించ లేకపోయింది.ఈ సారి ఎలాగైనా నాకౌట్ కు చేరాలని ఫస్ట్ టార్గెట్ ను పెట్టుకున్నాయి. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా జరుగనుందని క్రికెట్ ప్రేమికులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ట్రెడిషనల్ గా చెన్నైలోని చేపాక్ పిచ్ స్పిన్ బౌలింగ్ కు అనుకూలిస్తుంది. ఈ మ్యాచ్ 170 పరుగుల స్కోరు చాలెంజింగ్ గా అనిపించవచ్చు.
CSK VS MI HEAD TO HEAD IN THE IPL. pic.twitter.com/7flDnVoUgx
— Kavya Yadav (@Kycricinfo) March 23, 2025
ముంబైదే పైచేయి..
టోర్నీ హిస్టరీని పరిశీలించినట్లయితే, ఇరుజట్ల మధ్య 37 మ్యాచ్ లు జరుగగా, 20 మ్యాచ్ ల్లో ముంబై విజయం సాధించింది. 17 మ్యాచ్ ల్లో చెన్నై గెలుపొందింది. బ్యాన్ కారణంగా ఈ మ్యాచ్ కు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ ఆడటం లేదు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. బ్యాటింగ్ లో ముంబై బలంగా ఉంది. బ్యాటర్లలో జాతీయ, అంతర్జాతీయ స్టార్లు ఉన్నారు. ఓపెనింగ్ రోహిత్ శర్మ , ర్యాన్ రికెల్టన్ బరిలోకి దిగుతారు. వన్ డౌన్ లో విల్ జాక్స్ ను పరిక్షించవచ్చు. టీ20 స్టార్ సూర్య కుమార్ యాదవ్, తెలుగు ప్లేయర్ తిలక్ వర్మలతో మిడిలార్డర్ చాలా పటిష్టంగా ఉంది. జార్ఖండ్ క్రిస్ గేల్ గా పేరుగాంచిన రాబిన్ మిన్జ్ వికెట్ కీపర్ బ్యాటర్ గా బరిలోకి దిగుతాడు. వీళ్లంతా హిట్టింగ్ పేరొందిన వాళ్లు కావడం విశేషం. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకోక పోవడం మైనస్ పాయింట్. తను కొన్ని మ్యాచ్ లకు దూరమవుతాడని ఇప్పటికే అప్డేట్ వచ్చింది. అయితే దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, మిషెల్ శాంట్నర్ లతో పటిష్టంగా ఉంది. ఇక స్పెషలిస్టు స్పిన్నర్ లేకపోవడం కాస్త మైనస్ పాయింట్. ఫస్ట్ చాయిస్ స్పిన్నర్ గా శాంట్నర్ బరిలోకి దిగుతాడు. ఇక కర్ణ్ శర్మ, ముజీబుర్ రహ్మాన్ ఉన్నప్పటికీ వాళ్లంతా ఫామ్ లో లేరు.
సొంతగడ్డపై బలంగా చెన్నై..
ఆరోసారి టైటిల్ కొట్టాలని భావిస్తున్న చెన్నై.. ఈసారి మెగావేలంలో జట్టును ఆల్ రౌండర్లలో నింపింది. ఇక జట్టు బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, డేవన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠిలతో టాపార్డర్ పటిష్టంగా ఉంది. మిడిలార్డర్లో ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, శామ్ కరన్, రవిచంద్రన్ అశ్విన్, విజయ్ శంకర్ లాంటి ప్లేయర్లతో పటిష్టంగా ఉంది. ఇక స్పిన్నర్లుగా అశ్విన్, జడేజా ద్వయంతోపాటు నూర్ అహ్మద్, శ్రేయస్ గోపాల్ తదితరులు ఉన్నారు. జట్టులో అనుభవం ఉన్న పేసర్లు లేకపోవడం చెన్నై బలహీనతగా చెప్పుకొవచ్చు. అటు ఇంటర్నేషనల్, ఇటు నేషనల్ లెవల్లో పేరుగాంచిన పేసర్లు ఎవరూ లేరు. నాథన్ ఎల్లిస్, మతీషా పత్తిరాణ, ఖలీల్ అహ్మద్, ముఖేశ్ చౌధరీ, కమలేశ్ నాగర్ కోటీలతో సాధారణంగా ఉంది. ఇందులో పత్తిరాణకు మాత్రమే మంచి గుర్తింపు ఉంది. అయితే పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్లు కరన్, దూబే, శంకర్ తదితరులు ఉండటం సానుకూలాంశం. ఏదేమైనా ఈ మెగా పోరులో గెలిచి టోర్నీలో తొలి అడుగు బలంగా వేయాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

