CSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP Desam
10 ఐపీఎల్ కప్పులు కలిపి ఓ మ్యాచ్ ఆడితే ఎలా ఉంటుంది ఈరోజు చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూస్తే తెలుస్తుంది. 17వ సంవత్సరాల ఐపీఎల్ ప్రయాణంలో ఈ రెండు జట్లు చెరో ఐదుసార్లు విజేతగా నిలిచి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లుగా నిలిచాయి. వ్యక్తిగతంగా చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని టీమిండియాకు కెప్టెన్ గా ఎన్ని మరుపురాని విజయాలను ఇచ్చాడో అంతే స్థాయిలో చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా ఐదుకప్పులు అందించి తలా ధోనిగా తమిళనాడు గుండెల్లో నిలిచిపోయాడు. రోహిత్ శర్మ కూడా అంతే..డెక్కన్ ఛార్జర్స్ లో ఆటగాడిగా ఉన్నప్పుడే కప్పు గెలిచిన రోహిత్...ముంబైకి కెప్టెన్ గా ఐదుసార్లు కప్పు అందించాడు. సో అలాంటి బాహుబలులు ఈ రోజు ఆడుతున్న మ్యాచ్ లో ఆదివారం రాత్రి నాటు కోడి కూరలాంటి ఎక్స్ పీరియన్స్ ను ఇవ్వటం పక్కా.





















