Fan Touched feet of Virat Kohli | KKR vs RCB మ్యాచ్ లో కొహ్లీపై అభిమాని పిచ్చి ప్రేమ | ABP Desam
విరాట్ కొహ్లీకి తన ఫ్యాన్స్ తో ఉండే ఎఫెక్షన్ ఏంటో తెలుసుగా..కింగ్ అని..మహారాజు అని రకరకాల పేర్లుతో విరాట్ ను ఆరాధిస్తూ ఉంటారు. అలాంటి కింగ్ కొహ్లీ నిన్న ఐపీఎల్ 18వ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ ను ముందుండి కేకేఆర్ పై గెలిపించాడు. అద్భుతమైన అర్థశతకంతో పాటు మ్యాచ్ ఫినిష్ అయ్యే చివరి బాల్ వరకూ ఉండి తన కమిట్మెంట్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకుంటున్నారు. 18వ ప్రయత్నంలోనైనా ఆర్సీబీ కప్ తీసుకురావాలనేది కొహ్లీకి ఉన్న ఏకైక లక్ష్యం. నిన్న అర్థశతకం పూర్తి చేయటానికి ఓ అద్భుతమైన బౌండరీ కొట్టాడు ఛేజ్ మాస్టర్. 13వ ఓవర్ లో జరిగింది ఇది. హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి గాల్లోకి బ్యాట్ చూపిస్తూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న టైమ్ లో ఓ ఘటన జరిగింది. గ్రౌండ్ లో కి ఓ అభిమాని డగౌట్స్ నుంచి దూసుకువచ్చాడు. సెక్యూరిటీస్ అన్నీ బ్రేక్ చేస్తూ పరిగెడుతూ వచ్చి కొహ్లీ కాళ్ల మీద పడిపోయాడు. ఒక్కసారిగా దూసుకువచ్చిన అభిమాని చర్యతో ముందు షాక్ గురైన కొహ్లీ… ఆతర్వాత తన కాళ్ల మీద పడి నమస్కరిస్తున్న అభిమానిని పైకి లేపి హగ్ చేసుకున్నాడు. బయటకు వెళ్లిపో పోలీసులతో రిస్క్ అంటూ ఏదో చెప్పాడు. ఈలోగా సెక్యూరిటీస్ వచ్చి ఆ ఫ్యాన్ ను కొట్టి లాక్కెళ్లబోతుంటే కొహ్లీ వాళ్లని వారించాడు. తెలియక చేశాడని అభిమానిని వదిలిపెట్టాలని కోరాడు. అఫీషియల్స్ కూడా కొహ్లీని మాటను గౌరవించి ఆ అభిమానిని జాగ్రత్తగానే బయటకు తీసుకువెళ్లారు. అంతే కొహ్లీని హగ్ చేసుకున్నాను కలిశానన్న సంతోషంతో ఆ అభిమాని సెలబ్రేట్ చేసుకుంటూ గ్రౌండ్ బయటకు వెళ్లాడు. కొహ్లీని హగ్ చేసుకున్నాడు..మేం చేయాలని ఉన్నా చేయలేకపోతున్న పనిని ఆ అదృష్టాన్ని ఆ అభిమాని దక్కించుకున్నాడు అంటూ కొహ్లీ ఫ్యాన్స్ ఆ వీడియోను ఫోటోలను వైరల్ చేస్తున్నారు.





















