Aamir Khan: 'డివోర్స్ టైంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా' - రోజుకో బాటిల్ తాగేసివాడినన్న ఆమిర్ ఖాన్
Aamir Khan Dating: తన విడాకుల సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ చెప్పారు. ఆ సమయంలో వర్క్‌కు దూరమయ్యానని.. మద్యానికి కూడా బానిసైనట్లు వెల్లడించారు.

Aamir Khan Says He Went To Depression After Divorce: తన మాజీ భార్యతో విడాకుల సమయంలో తాను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ (Aamirkhan) తెలిపారు. ఇటీవల వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆయన.. తన మాజీ భార్య రీనాదత్త, ఆమెతో డివోర్స్ గురించి చెప్పారు. తాము ఎంతో ఆనందంగా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ అనుకోని విధంగా విడిపోవాల్సి వచ్చిందని అన్నారు.
'మద్యానికి బానిసయ్యాను'
డివోర్స్ పరిణామాలను తాను ఏమాత్రం ఊహించలేదని.. దీని కారణంగా తాను మద్యానికి బానిసయ్యానని ఆమిర్ వెల్లడించారు. ఆ బాధ నుంచి బయటపడేందుకు ఎంతో టైం పట్టిందని చెప్పారు. 'రీనాతో విడాకుల సమయంలో నేనెంతో బాధపడ్డా. సుమారు మూడేళ్ల పాటు దాని నుంచి బయటపడలేకపోయాను. దీంతో షూటింగ్స్‌కు దూరంగా ఉన్నా. స్క్రిప్ట్స్ వినలేదు. ఇంట్లో ఒంటరిగా కూర్చుని బాధపడేవాడిని. సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు. ఏం చేయాలో అర్థం కాలేదు.
ప్రశాంతంగా నిద్రపోవడం కోసం మద్యానికి అలవాటు పడ్డాను. అసలు ఆల్కహాల్ అంటేనే తెలియని నేను ఉన్నట్లుండి రోజుకో బాటిల్ తాగేసేవాడిని. దాదాపు ఏడాదిన్నర పాటు ఆ వ్యసనానికి బానిసయ్యాను. దేవదాస్‌లా మారి.. తీవ్ర మానసిక వేదన, కుంగుబాటుకు గురయ్యాను. ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు చాలా టైం పట్టింది. పరిస్థితిని అర్థం చేసుకున్నా. ఇష్టపడిన వారు పక్కన లేకుండానే జీవితం కొనసాగించాలని తెలుసుకున్నా.' అని ఆమిర్ వెల్లడించారు.
అయితే.. ఆమిర్‌ఖాన్ - రీనాదత్తా 1986లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు జునైద్, కుమార్తె ఐరా ఉన్నారు. 2002లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమిర్.. కిరణ్‌రావును పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరిద్దరూ విడిపోయారు.
Also Read: అట్లీ సినిమాతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్... ప్రజెంట్ ఇండియాలో టాప్ అతనేనా!?
స్నేహితురాలితో రిలేషన్‌లో..
ప్రస్తుతం ఆమిర్ గౌరీ స్ప్రాట్ (Gauri Spratt) అనే స్నేహితురాలితో రిలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా వెల్లడించారు. 25 ఏళ్ల కిందట తామిద్దరం తొలిసారి కలుసుకున్నామని.. మధ్యలో ఆమె టచ్‌లో లేకుండా పోయారని చెప్పారు. రెండేళ్ల కిందట మళ్లీ కలుసుకున్నామని.. ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ 18 నెలల కిందట మొదలైందని చెప్పారు. గౌరీ స్ప్రాట్ ప్రస్తుతం బెంగుళూరులో నివసిస్తుండగా.. ఆమెకు పెళ్లై ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. తన డేటింగ్ గురించి ఆమిర్ సడెన్ సర్ ప్రైజ్ ఇవ్వడంతో ఫ్యాన్స్ అంతా ఆమె ఎవరో అంటూ తెగ సెర్చ్ చేశారు.
అసలెవరీ గౌరీ స్ప్రాట్..
ప్రముఖ స్టైలిస్ట్ రీటా స్ప్రాట్ కుమార్తె గౌరీ స్ప్రాట్. వీరి కుటుంబానికి బెంగుళూరులో సెలూన్ ఉంది. ప్రస్తుతం ఆమె అక్కడే ఉంటున్నారు. బ్లూ మౌంటెన్ స్కూల్‌లో విద్య అభ్యసించిన గౌరీ.. ఆ తర్వాత ఫ్యాషన్ కోర్స్ పూర్తి చేసి లండన్ యూనివర్శిటీలో ఎఫ్‌డీఏ స్టైలింగ్ అండ్ ఫోటోగ్రఫీలో శిక్షణ తీసుకున్నారు. ముంబయిలోని బీబ్లంట్ అనే సెలూన్ నడుపుతున్నారు. గత కొంతకాలంగా గౌరీ.. ఆమిర్ ఖాన్ నిర్మాణ సంస్థలో సహాయకురాలిగా పని చేస్తున్నారు. ఆయనతో ఆమెకు 25 ఏళ్ల స్నేహం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

