NTR Neel Movie: ఎన్టీఆర్ ఇంట్లో ప్రశాంత్ నీల్... 'డ్రాగన్' కోసం లేట్ నైట్ డిస్కషన్లు!
Jr NTR house in Hyderabad: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ వీకెండ్ నైట్ ముచ్చట్లు పెట్టారు. 'డ్రాగన్' సినిమా కోసమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా!

మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కలిసి పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. ఆ మూవీ టైటిల్ 'డ్రాగన్' (Dragon Movie). ఆ సంగతి ఇంకా అనౌన్స్ చేయలేదు అనుకోండి. ఈ మూవీ లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... హీరోతో పాటు దర్శకుడు వీకెండ్ నైట్ ముచ్చట్లు పెట్టారు.
ఎన్టీఆర్... నీల్...
ఫోటో షేర్ చేసిన లిఖిత!
Who is Likhitha Reddy Neel: లిఖిత ఎవరు? అని ఆలోచించొద్దు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్, నీల్ అభిమానులకు ఆవిడ పరిచయమే. దర్శకుడు ప్రశాంత్ నీల్ భార్య పేరు లిఖిత. సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్ యాక్టివ్ మెంబర్ కాదు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ లేరు. ఆయనకు సంబంధించిన కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ లిఖిత షేర్ చేస్తూ ఉంటారు. శనివారం రాత్రి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సరదాగా ముచ్చట్లు పెట్టిన ఫోటోను ఆవిడ షేర్ చేశారు.
NTR's Dragon movie updates: 'డ్రాగన్' సినిమా రెగ్యులర్ షూటింగ్ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం అయింది. హీరో ఎన్టీఆర్ అవసరం లేని సన్నివేశాలు కొన్నిటిని ప్రశాంత్ నీల్ తీశారు. త్వరలో ఎన్టీఆర్ సైతం చిత్రీకరణకు హాజరు అవుతారని సమాచారం. 'మనుషులు ఇద్దరే కానీ ప్రపంచం ఒక్కటే' అంటూ లిఖితా రెడ్డి ఈ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు. దాంతో షూటింగ్, సినిమాకు సంబంధించిన విషయాల గురించి హీరో దర్శకుడు డిస్కషన్ చేసుకొని ఉండొచ్చు.
Also Read: ఎవరీ మహీరా శర్మ? సిరాజ్‌తో డేటింగ్ రూమర్లతో వైరల్... ఆవిడ ఏం చేసిందో తెలుసా?
View this post on Instagram
'వార్ 2' చిత్రీకరణలో ఎన్టీఆర్...
ఇటీవల ముంబై టు హైదరాబాద్!
ఎన్టీఆర్ ఈ వారమే ముంబై నుంచి హైదరాబాద్ వచ్చారు. గత కొన్ని రోజులు ఆయన అక్కడే ఉన్నారు. హిందీ సినిమా 'వార్ 2' షూటింగ్ చేశారు. సినిమాలో మరో హీరో హృతిక్ రోషన్ గాయపడడంతో బ్రేక్ వచ్చింది. దాంతో హైదరాబాద్ వచ్చేశారు. బాలీవుడ్ టాప్ డాన్సర్లలో హృతిక్ ఒకరు. ఎన్టీఆర్ డాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన టాలీవుడ్ టాప్ డాన్సర్లలో ఆయన ఒకరు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని టాప్ డాన్సర్ల లిస్టు తీస్తే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ పేర్లు ఉంటాయి. దాంతో వాళ్ళిద్దరి మీద దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎటువంటి సాంగ్ ప్లాన్ చేశారు? అనేది డిస్కషన్ పాయింట్ అవుతోంది.
Also Read: మీనాను అవమానించిన నయనతార... రెజీనా సెల్ఫీ తీయడంతో అసంతృప్తి, అలక?
'దేవర' విజయం తర్వాత ఎన్టీఆర్ నుంచి ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా వార్ 2. అది మల్టీస్టారర్. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న స్పై ఫ్రాంచైజీ లో వస్తున్న సినిమా. 'డ్రాగన్' విషయానికి వస్తే ఎన్టీఆర్ సోలో హీరోగా రూపొందుతున్న సినిమా. అందుకనే దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

