Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
ఇండియా సౌత్ ఆఫ్రికాతో సిరీస్ మొదలైనప్పటి నుంచి టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్, సెలక్షన్ కమిటీపై ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. అలాగే టీమ్ లో సీనియర్స్ vs మేనేజ్‌మెంట్ అంటూ కూడా చర్చలు మొదలైయ్యాయి. దాంతో ఈ విషయాలపై ఫోకస్ పెట్టిందట బీసీసీఐ. ఫ్యూచర్ లో వచ్చే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా ఈ ఇష్యూని సాల్వ్ చేయాలనీ నిర్ణయించుకుందట. ఇందు కోసమని బీసీసీఐ పెద్దలు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తోపాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో సమావేశం కానున్నారని తెలుస్తుంది.
ఏడాదికాలంలో టీమ్ ఇండియా టెస్టులో రెండు సార్లు వైట్‌వాష్ కు గురవ్వడం, డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు, అలాగే సీనియర్ ప్లేయర్స్ కు మేనేజ్‌మెంట్ మధ్య ఉన్న విభేదాలు .. ఇలా పలు అంశాలపై చర్చించనున్నారు. రోహిత్, కోహ్లీతో గంభీర్ కమ్యూనికేషన్ గ్యాప్‌పై ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి. ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో గంభీర్ కోహ్లీ మాట్లాడుకోకపోవడం, రోహిత్ శర్మతో సీరియస్ గా చర్చిస్తున్న రోహిత్ శర్మ.. ఇలా పలు ఫోటోలు వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. దాంతో వీటన్నిటికీ చెక్ పెట్టాలని డిసైడ్ అయింది బీసీసీఐ.





















