YSRCP MLCs: బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు రివర్స్ - జకియా ఖానం రాజీనామా ఉపసంహరణ - పోతుల సునీత కూడా?
MLC Zakia Khanam: బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు మనసు మార్చుకున్నారు. ఎమ్మెల్సీ జకియా ఖానం రాజీనామా ఉపసంహరించుకున్నారు.

YSRCP MLCs who joined BJP have changed their minds: రాజీనామాలు చేసిన ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీల్లో ఇద్దరు వెనక్కి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నారు. మండలి చైర్మన్ గా కూడా ఉన్న జకియా ఖానం తన రాజీనామ లేఖను ఉపసంహరించుకున్నట్లు శాసన మండలి చైర్మెన్ మోషేన్ రాజుకు చెప్పారు. రాజీనామాపై విచారణకు వచ్చిన ఆమె విచారణలో రాజీనామా ఉపసంహరమ లేఖ రాసి ఇచ్చిన ట్లుగా తెలుస్తోంది. 13 -5-2025 న ఎమ్యెల్సీ పదవికి రాజీనామ చేశారు జకియా ఖానం. పునరాలోచనకు ఛైర్మెన్ మోషేన్ రాజు సమయం ఇవ్వడంతో తాను పునరాలోచన చేసుకున్నానని రాజీనామా లేఖ ఉపసంహరించుకున్నానని చైర్మెన్ మోషేన్ రాజుకు లేఖ ఇచ్చారు. జకియాఖానం నిర్ణయాన్ని ఆమోదిస్తూ ఆమె రాజీనామా లేఖను తిరస్కరించారు.
మరో ఎమ్మెల్సీ పోతుల సునీత విచారణకు హాజరు కాలేదు. పోతుల సునిత విచారణ హాజరు కాకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో టీడీపీలో ఉండే ఆమె.. తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీలో పోటీకి అవకాశం రాలేదు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు కుటుంబంపై అనుచితంగా మాట్లాడటంతో నారా లోకేష్ ఆమెపై పరువు నష్టం కేసులు వేశారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కానీ టీడీపీలో చేర్చుకోలేదు. దాంతో బీజేపీలో చేరారు.
జకియా ఖానం కూడా టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో నారా లోకేష్ ను కలిశారు. కానీ ఆమెను చేర్చుకునే విషయంలో కడప జిల్లా నేతలు అంగీకరించకపోవడంతో పట్టించుకోలేదు. దాంతో ఆమె బీజేపీలో చేరారు. జకియా ఖానం, పోతుల సునీత ఇద్దరూ బీజేపీలో చేరారు. జకియా ఖానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై, మొదటి ముస్లిం మహిళగా డిప్యూటీ చైర్మన్ పదవిని పొందారు. 2024 అక్టోబర్‌లో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో విపీ బ్రేక్ దర్శన టికెట్లను బ్లాక్‌మార్కెట్ చేసిన ఆరోపణలతో వచ్చాయి. ఈ కేసులో ఆమె, పీఆర్వో కృష్ణ తేజ, మరొకరి మీద కేసు నమోదైంది.
బీజేపీలో చేరిన తర్వాత, ఆమె ప్రధానమంత్రి మోదీ పాలిటిక్స్‌ను ప్రశంసించారు. మోదీ ముస్లిం మహిళలకు సమానత్వం, పేదలకు న్యాయం చేశారు. ఆయన తండ్రి పాత్ర పోషిస్తున్నారు అని చెప్పారు. ఇప్పుడు అనూహ్యంగా ఆమె రాజీనామాపై వెనక్కి తగ్గడంతో వైసీపీలోనే కొనసాగేందుకు నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చు.
జకియా ఖానం ఎమ్మెల్సీగా పదవి కాలం వచ్చే ఏడాది జూలై వరకే ఉంది. అంటే మరో ఏడు నెలలు మాత్రమే ఉంది. ఇప్పుడు రాజీనామా ఆమోదించిన కేంద్ర ఎన్నికల సంఘం..ఉపఎన్నిక నిర్వహించే అవకాశం లేదు. ఏడాది కిందటే రాజీనామా చేసినపుపుడు ఆమోదించి ఉంటే మిగతా పదవి కాలం వరకూ ఎన్నిక నిర్వహించేవారు. ఇప్పుడా అవకాశం లేదు. అయితే పోతుల సునీత పదవీ కాలం మాత్రం 2029 వరకూ ఉంది. ఆమె రాజీనామా ఆమోదిస్తే వచ్చే ఉపఎన్నికలో మళ్లీ ఆమెకే చాన్స్ ఇస్తారో లేదోక్లారిటీ లేకపోవడంతో విచారణకు హాజరు కాలేదని తెలుస్తోంది.




















