Vijay Deverakonda Wedding: కోడలు రష్మికకు విజయ్ దేవరకొండ తల్లి ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా?
The Wedding Of Virosh: ఉదయ్‌పూర్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల పెళ్లి జరుగుతోంది. కోడలు రష్మికకు విజయ్ దేవరకొండ తల్లి ఇచ్చిన బహుమతి ఏమిటో తెలుసా?

'ది' విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మికా మందన్న వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. ఫిబ్రవరి 26, 2026న వీరిద్దరి పెళ్లి. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో పెళ్లి సందడి నెలకొంది. పెళ్లికి ముందు 'విరోష్ ప్రీమియర్ లీగ్' క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఆ తర్వాత నిశ్చితార్థం, సంగీత్ వేడుకలు జరిగాయి. సంగీత్‌లో కోడలు రష్మికకు విజయ్ దేవరకొండ తల్లి ప్రత్యేక బహుమతి ఇచ్చారని తెలిసింది.
రష్మికకు దేవరకొండ వారసత్వపు గాజులు
ఉదయపూర్ లోని ఐటిసి మెమెంటోస్ హోటల్ లో జరిగిన సంగీత్ వేడుకలో ఓ స్పెషల్ మూమెంట్ చోటు చేసుకుంది. విజయ్ దేవరకొండ తల్లి మాధవి దేవరకొండ తన కోడలు రష్మికా మందన్నకు సంప్రదాయం ప్రకారం... కుటుంబ వారసత్వంగా వచ్చిన గాజులను బహుమతిగా ఇచ్చారు. దాంతో ఆ క్షణం దేవరకొండ, మందన్నా కుటుంబాలకు చిరస్మరణీయంగా మారింది. ఈ పెళ్లికి వధూవరుల సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటున్నారు. మార్చి 4, 2026న హైదరాబాద్ సిటీలోని ఒక గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందులో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొంటారు.


ఆ సినిమాతో మొదలైన విజయ్ - రష్మిక కెమిస్ట్రీ
విజయ్, రష్మిక పెళ్లి వార్త అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వాళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎప్పుడూ అభిమానులను ఆకట్టుకుంది. వీరిద్దరూ తొలిసారిగా 'గీతా గోవిందం' (2018) సినిమాలో కలిసి నటించారు. అందులో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, ఈ జంట నటన అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత 2019లో 'డియర్ కామ్రేడ్'లో కూడా కలిసి నటించారు. ఇప్పుడు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలోని 'రణబలి' సినిమాలో కనిపించనున్నారు.
రష్మిక & విజయ్ రాబోయే సినిమాలకు వస్తే...
రష్మికా మందన్న విషయానికి వస్తే... ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధిఖీలతో కలిసి 'థామా' సినిమాలో కనిపించారు. త్వరలో హోమీ అద్జానియా 'కాక్‌టెయిల్ 2'లో కూడా కనిపించనుంది. అందులో షాహిద్ కపూర్, కృతి సనన్‌లతో కలిసి ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఆ సినిమాసెప్టెంబర్ 2026లో విడుదల కానుంది. విజయ్ దేవరకొండ లాస్ట్ సినిమా 'కింగ్‌డమ్'. దానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం 'రణబలి', 'రౌడీ జనార్దన్' సినిమాల్లో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. 'రౌడీ జనార్దన్' డిసెంబర్ 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది.























