Virosh Wedding : సంగీత్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక డ్యాన్స్ - బెస్ట్ సాంగ్స్ విత్ బెస్ట్ మూమెంట్స్... వీడియో వైరల్
Rashmika Mandanna Wedding : విజయ్ దేవరకొండ, రష్మిక వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంబరాన్నంటాయి. బుధవారం రాత్రి సంగీత్‌లో కుటుంబ సభ్యులతో పాటు అతిథులు ఎంతో హుషారుగా డ్యాన్స్ చేశారు.

Vijay Deverakonda Rashmika Mandanna Sangeet Celebrations : ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఒకటే ట్రెండ్. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి సందడి. గురువారం ఉదయం 10:10 గంటలకు విరోష్ కపుల్ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. అంతకు ముందు వేదిక వద్ద సెలబ్రేషన్స్ అంబరాన్నంటాయి.
ఒకరి చేతిని ఒకరు పట్టుకుని
వేదిక వద్ద సంగీత్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. విజయ్ దేవరకొండ చేతిలో చెయ్యేసి రష్మిక సంగీత్ వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంబరంగా వేడుక జరిగింది. విజయ్, రష్మిక జంట వ్యక్తిగత ప్లే లిస్ట్‌తో పాటు వారి సినీ ప్రయాణాన్ని గుర్తు చేసేలా పాటలు వరుసగా ప్లే చేశారు.
ఫస్ట్ మూవీ 'గీత గోవిందం'తో బెస్ట్ పెయిర్ అనిపించుకున్న ఈ కపుల్... ఆ సినిమాలో పాటలు ప్లే చేయడంతో అతిథులు సంబరాల్లో మునిగి తేలారు. 'తెల్ల తెల్ల వెలుగు రేఖలా...', 'ఇంకేం ఇంకేం కావాలే', 'కల్యాణి వాచా వాచా' వంటి గీతాలు జోష్ పెంచాయి. అలాగే, పుష్ప 2లోని వైరల్ సాంగ్‌కు అతిథులంతా ఒక్కసారిగా డ్యాన్స్ ఫ్లోర్‌కు చేరి డ్యాన్స్ చేయడంతో సంగీత్‌కు హై ఎనర్జీ తీసుకొచ్చింది. సంగీత్‌లో విజయ్, రష్మిక కూడా డ్యాన్స్ చేశారు.
View this post on Instagram
ViRosh look stunning at
— Ketan Patel (@Patel_Gujarat3) February 25, 2026
Sangeet Event !
The Wedding Of ViRosh !!
Congratulations In Advance 🎉#ViRosh @iamRashmika#RashmikaMandanna ❤️#VijayDeverakonda pic.twitter.com/aQIAziNMds
Also Read : విజయ్ దేవరకొండ ఫోన్... బయటపడిన సీక్రెట్... సిగ్గుతో ఎర్రబడిన రష్మిక ఫేస్... వైరల్ వీడియో
రెండుసార్లు వివాహం
విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం వేర్వేరు సంప్రదాయాల ప్రకారం రెండుసార్లు జరగనుంది. ఉదయం హిందూ సంప్రదాయం ప్రకారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు జరగనుండగా... సాయంత్రం 4:30 గంటలకు కొడవ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ వేడుక జరగనుంది. ఇరువురి ఇళ్లల్లో పాటించే సంప్రదాయాల ప్రకారం తెలుగు, కొడవ పద్ధతుల్లో వివాహం చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం హల్దీ వేడుక ఘనంగా జరిగింది. అంతకు ముందు గేమ్స్ కూడా నిర్వహించగా... అందరూ సందడిగా పాల్గొన్నారు. ఆటపాటలు, హల్దీ వేడుకలతో సంబరాలు అంబరాన్నంటాయి.
అతిథులు వీరే...
వీరి వివాహానికి కొద్ది మంది అతిథులకు మాత్రమే ఆహ్వానాలు అందాయి. విజయ్, రష్మికలతో వర్క్ చేసిన డైరెక్టర్స్ తరుణ్ భాస్కర్, సందీప్ వంగా, రాహుల్ రవీంద్రన్‌లతో పాటు హీరోయిన్స్ ఆషికా రంగనాథ్, ఈషా రెబ్బా, స్టైలిస్ట్, నిర్మాత శ్రావ్య శర్మలు పెళ్లి వేడుకకు హాజరయ్యారు. మార్చి 4న రిసెప్షన్ హైదరాబాద్ తాజ్ హోటల్‌లో జరగనుంది. ఈ ఈవెంట్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నాయి. టాప్ సెలబ్రిటీలకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది.
























