బిగ్‌బాస్ డే 85 రివ్యూ... ఇమ్మూ-తనూజా ఎమోషనల్ డ్రామా... ఆర్గ్యుమెంట్స్ లోనూ నవ్వులే... ఈ వారం నామినేషన్ల లిస్ట్
Bigg Boss 9 Telugu Today Episode - Day 85 Review : ఈ వారం నామినేషన్లలో హీటింగ్ ఆర్గ్యుమెంట్స్ తో పాటు నవ్వుల పువ్వులు పూశాయి. నామినేషన్స్ లో సిల్లీ పాయింట్స్ పెట్టుకోవడంతో అందరూ సరదాగా నవ్వుకున్నారు.

బిగ్ బాస్ డే 85 ఉదయాన్నే ఇమ్మూ, రీతూ వర్కౌట్ చేస్తూ నవ్వించారు. "ఇప్పటి వరకూ మీరు చూపిన పోరాటం, కృషి ఇక్కడిదాకా తీసుకొచ్చింది. ఇప్పటి నుంచి మీరు ఆడే ఆట హౌస్ లో ఉంటారా ? వెనక్కి వెళ్తారా ? అనేది నిర్ణయిస్తుంది. ప్రతీ సభ్యులు ఇద్దరిని బాటిల్స్ ను పగలగొట్టి నామినేట్ చేయాలి" అని చెప్పారు బిగ్ బాస్. "నా ఫస్ట్ నామినేషన్ రీతూ. నన్ను బ్యాక్ స్టాబర్ అన్నావ్" అని చెప్పాడు ఇమ్మాన్యుయేల్. "ఎవరు కెప్టెన్ అయినా నాకు ప్రాబ్లం లేదు అన్నావ్" అని అడిగింది రీతూ. "మా ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఏంటంటే రీతూను నమ్మొచ్చా? అనుకున్నాము. కానీ తనూజా తీయొద్దని చెప్పింది. కళ్యాణ్ కెప్టెన్ కావాలన్నది నా పాయింట్. నువ్వు అడిగావ్ కత్తి ఇవ్వాలని" అంటూ క్లారిటీ ఇచ్చాడు ఇమ్మూ. "నావల్ల కాదు చివరిదాకా తనూజా వల్ల ఉన్నావ్. ఓకే వదిలేయ్" అని క్లియర్ చేశాడు ఇమ్మూ. "కెప్టెన్సీ టాస్క్ లో నన్ను నువ్వు తీసేయడం హర్టింగ్ గా అన్పించింది" అంటూ డెమోన్ ను నామినేట్ చేశాడు. "డెమోన్ టీంలో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే ఆడాను టీం కోసం కాదు" అని క్లారిటీ ఇచ్చాడు.
భరణి వర్సెస్ సంజన
"అందరూ గేమ్ ఆడుతుంటే సంజన ఫ్రాంక్స్ లోనే మిగిలిపోయింది. మెడిసిన్స్ నాకు ముఖ్యమైన టైమ్ లో ఆమె అలా చేయడం బాధగా, కోపంగా అన్పించింది. ఫన్ చేస్తానని చెబితే నా టాబ్లెట్స్ ఎత్తుకుపోతారని ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా అండి ? అది హ్యూమరా?" అంటూ సంజనాను నామినేట్ చేశాడు. సెకండ్ "గత వారం నుంచి డెమోన్ కనిపించట్లేదు. మా అందరికీ ఫిజికల్ గా నువ్వే స్ట్రాంగ్. మెంటల్ గా స్ట్రాంగ్ గా లేకపోతే ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండలేడు" అని చెప్పాడు భరణి. "వచ్చిన గెస్ట్ లు అందరూ యాంగర్ తగ్గించుకో అంటే ఏమైపోవాలి" అని అడిగాడు డెమోన్. "నువ్వు ఆకాశంలో చూస్తుంటే బాడీ నిది, ఫేస్ రాముది కన్పిస్తుంది. అయితే బాండ్ దగ్గరకి రావట్లేదు నేను. అది తప్పని ఎవరన్నా అంటే వాళ్లే తప్పు. కానీ ఆ ఒక్కటే మార్చుకో" అని క్లారిటీ ఇచ్చాడు భరణి. రీతూ సుమన్, సంజనాను నామినేట్ చేసింది. "నేను మళ్ళీ డ్రాగ్ చేయొద్దు అనుకున్నా. కానీ మీరు సండే ఫ్యామిలీ ట్రీ లోంచి నా ఫోటో తీసేసి మాటలన్నారు. నేను మిమ్మల్ని ఏ బూతులు అనలేదు" అని చెప్పింది. చివరికి ఇద్దరూ హగ్ చేసుకుని ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకున్నారు.
తనూజా వర్సెస్ డెమోన్
ఇక తనూజా వచ్చి "ఇమ్మూ నీకు దివ్య ఎప్పటి నుంచి క్లోజ్ అయ్యింది? ఫస్ట్ కళ్యాణ్, తరువాత ఆ లిస్ట్ లో దివ్య కూడా నీ ప్రిఫరెన్స్ ఉంటది. నీకు హెల్ప్ చేసిన వాళ్లకు చేస్తావ్. మరి నేను నీకు హెల్ప్ చేయలేదా? ప్రతిసారీ సపోర్ట్ చేయలేదు అన్నాను అనే పాయింట్ తీసుకొస్తున్నావ్ ఎందుకు" అని అడిగింది. "నువ్వు నా ఫ్రెండ్ కాదు అన్నప్పటి నుంచి నేను మారిపోయా" అని చెప్పాడు ఇమ్మూ. "హౌస్ లోకి వచ్చాక మీరంతా కొత్త. కానీ వాడితో ముందే 1 మంత్ ఫ్రెండ్షిప్. నేనుంటా అని అన్నాడు. ఇక్కడికి వచ్చాక మాత్రం షేర్ చేసుకున్న ప్రతిసారి నన్ను నామినేషన్ లోకి లాగాడు. భరణికి, నాకు డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కూడా నామినేషన్ లోకి లాగావు. ఏదో ఓ మాట అన్నంత మాత్రాన ఫ్రెండ్ ని విసిరి పారేశాము అని కాదు. ఇప్పటికీ నువ్వు నా ఫ్రెండ్ వే. ఏదన్నా ఉంటే ముఖం మీద చెప్పు" అంటూ ఏడ్చేసింది. "నీకన్నా ముందుగా 6 ఏళ్లుగా రీతూ తెలుసు. కానీ నీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. నువ్వు చిన్నది అన్నా హార్ట్ అవుతా. నువ్వు నా ఫ్రెండ్ కాదురా అన్నావ్" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమ్ము. ఇద్దరూ క్లారిటీ తెచ్చుకున్నారు వివాదాలపై. అయితే ఇది షేర్ చేసుకోవాలి అన్పించింది అని చెప్పి, ఇమ్మూను పక్కన పెట్టి డెమోన్ ను నామినేట్ చేసింది. "ఇప్పటిదాకా నామినేషన్ పాయింట్ చెప్పి మారిస్తే జోక్ లా అనిపించింది" అంటూ డెమోన్ ఫైర్ అయ్యాడు. సెకండ్ సంజనాను బాండింగ్ పేరుతో నామినేట్ చేసింది.
సుమన్ శెట్టి రీతూని 2 వీక్స్ నుంచి సేవ్ అవుతున్నావు అని, 'నీ హెల్త్ బాలేదు. వెళ్ళి రెస్ట్ తీసుకుంటే మంచిది. నీ గేమ్ నువ్వు అడట్లేదు' అంటూ డెమోన్ ను నామినేట్ చేశాడు. సంజన 'టికెట్ టు ఫినాలే.కొడతా అనడం నచ్చలే' అంటూ డెమోన్ ను, సెకండ్ 'సారీ చెప్పినా తీసుకోలేదు. క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు' అంటూ రీతూని నామినేట్ చేసింది. డెమోన్ ఇమ్మూని నామినేట్ చేయాలనుకుని, నామినేషన్ లో ఉండాలి నామినేట్ చేస్తావా? అని అందరూ నవ్వడంతో సంజనాను నామినేట్ చేశాడు. అలాగే తనూజాను నామినేట్ చేశాడు. కెప్టెన్ కళ్యాణ్ భరణి నామినేట్ చేశాడు. ఈవారం సంజన, రీతూ, పవన్, సుమన్, తనూజ, భరణి నామినేషన్ లో ఉన్నారు.





















