అన్వేషించండి

Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Kondagattu: టీటీడీ నిధులతో చేపట్టనున్న కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులను పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ తెలంగాణలో పర్యటిస్తున్నారు.

Pawan Kalyan satarday Tour:  తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో శనివారం ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం కొండగట్టు క్షేత్రాన్ని దర్శించుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మంజూరు చేసిన రూ.35.19 కోట్ల భారీ నిధులతో నిర్మించనున్న భక్తుల వసతి సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10:30 గంటల నుండి 11:30 గంటల మధ్య ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.                          

కొండగట్టు అంజన్నను తన ఇలవేల్పుగా పవన్ కళ్యాణ్ భావిస్తారు. ఎన్నికల విజయం అనంతరం స్వామివారిని దర్శించుకున్న సమయంలో భక్తుల అవసరాలను గుర్తించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు లేక, దీక్షా విరమణ సమయంలో పడుతున్న ఇబ్బందులను ఆలయ అధికారులు, అర్చకులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్, కొండగట్టు అభివృద్ధికి టి.టి.డి సహకారం అందించాలని ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు   ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించడంతో టి.టి.డి నిధుల విడుదలకు మార్గం సుగమమైంది.                        

టి.టి.డి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు తో పవన్ కళ్యాణ్ జరిపిన చర్చల ఫలితంగా, బోర్డు రూ.35.19 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 96 గదుల భారీ సత్రం, అలాగే ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా విశాలమైన మండపాన్ని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో టి.టి.డి ఛైర్మన్‌తో పాటు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం , టి.టి.డి బోర్డు సభ్యులు పాల్గొననున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధాన్ని ఈ ప్రాజెక్టు మరింత బలోపేతం చేయనుంది.             

ఆలయ అభివృద్ధి కార్యక్రమాల అనంతరం పవన్ కళ్యాణ్ గారు రాజకీయ కార్యకలాపాలపై దృష్టి సారించనున్నారు. కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్టులో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ముఖ్యంగా, ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో విజయం సాధించిన ప్రతినిధులను ఆయన కలిసి, అభినందనలు తెలియజేయనున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం,  భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు.                    

టాప్ హెడ్ లైన్స్

Medaram Latest News: మేడారం వనదేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు పునఃదర్శనం!
మేడారం వనదేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు పునఃదర్శనం!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget