అన్వేషించండి

Medaram Latest News: మేడారం వనదేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు పునఃదర్శనం!

జువ్వి చెట్టును సమ్మక్క తల్లి శక్తికి ప్రతీకగా కోయ గిరిజనులు భావిస్తారు. అలాంటి చెట్టు ఎండిపోవడంతో అపశకునంగా ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారంగా అధికారులు రీప్లాంటేషన్ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మేడారం సమ్మక్క గద్దె వద్ద జువ్వి చెట్టును తిరిగి నాటారు.
  • ఎండిన పాత చెట్టు స్థానంలో శాస్త్రీయంగా క్రేన్లతో కొత్తది నాటారు.
  • ఈ జువ్వి చెట్టు వనదేవతల శక్తికి, భక్తుల విశ్వాసానికి ప్రతీక.
  • సమ్మక్క చరిత్ర, ఆదివాసీల విశ్వాసాలతో ఈ చెట్టు ముడిపడి ఉంది.

Medaram Latest News: మేడారం వనదేవతల గద్దెల వద్ద దర్శనమిచ్చిన జువ్వి చెట్టు. కొద్ది సంవత్సరాల క్రితం సమ్మక్క గద్దెను అనుకొని ఉన్న జువ్వి చెట్టు ఎండిపోవడం... భక్తుల విశ్వాసానికి భంగం కలగడంతో శాస్త్రీయ పద్ధతిలో మరో జువ్వి చెట్టు ను ప్లాంటేషన్ చేశారు అధికారులు.

జువ్వి చెట్టు రీ ప్లాంటేషన్.

ఆదివాసీ గిరిజన కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతిదీ ప్రత్యేకత చాటుకోవడంతోపాటు భక్తుల విశ్వాసానికి, ఆదివాసీ గిరిజన సంప్రదాయాలు, నమ్మకాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. మేడారంలో వనదేవతలైన సమ్మక్క సారలమ్మలతోపాటు సమ్మక్క గద్దె వద్ద ఉన్న జువ్వి చెట్టుకు సైతం వనదేవతలతో సమానంగా భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఇది మొదటి నుంచి వస్తున్న ఆచారం. అయితే జాతర ప్రారంభమైన నాటి నుంచి గద్దెల వద్ద ఉన్న జువ్వి చెట్టు కొద్ది సంవత్సరాల క్రితం ఎండిపోయి నేలకూలింది. దీంతో అధికారులు అదే స్థానంలో జువ్వి మొక్క నాటారు. అది కూడా ఎండిపోయింది. దీంతో గద్దెల సమీపంలో జువ్వి చెట్టు పెంచి వృక్షంగా మారుతున్న క్రమంలో అధికారులు వట ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్ధతిలో క్రేన్, జేసిబీ సహాయంతో తవ్వి తీశారు. గతంలో సమ్మక్క గద్దె పక్కనే జువ్వి చెట్టు ఉన్న స్థానంలో అధికారులు, ఆదివాసుల సమక్షంలో పూజలు నిర్వహించి సమ్మక్క సారలమ్మకు ఇష్టమైన బుధవారం రోజున జువ్వి చెట్టును రీ ప్లాంటేషన్ చేశారు.

భక్తుల నమ్మకం, ఆదివాసుల విశ్వాసానికి ప్రతీక.

జువ్వి చెట్టును సమ్మక్క తల్లి శక్తికి ప్రతీకగా కోయ గిరిజనులు భావిస్తారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతర సమయంలో, సాధారణ సమయంలో భక్తులు ఈ చెట్టు వద్దకు వచ్చి మొక్కులు చెల్లించడం విశ్వాసంగా, ఆదివాసులు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఆదివాసీ గిరిజన సంప్రదాయం ప్రకారం అడవి, ప్రకృతి, వనదేవతల మధ్య ఉన్న అనుబంధానికి జువ్వి చెట్టు ఒక చిహ్నంగా నిలుస్తుంది. 

వనదేవతల చరిత్రకు సాక్షిగా...!

కోట్లాది మంది భక్తులకు వనదేవతులుగా మారిన సమ్మక్క, సారలమ్మ చరిత్రలో వృక్షాలు, గద్దెలు  పవిత్రమైనవిగా భావించబడతాయి. చరిత్రకారులు సమ్మక్క, సారలమ్మ లు కాకతీయులతో పోరాడి వీరమరణం పొందినట్లు చెబుతున్నట్లు చరిత్రకారులు చెబుతున్నట్లు ప్రాచుర్యంలో ఉన్న చరిత్ర. అయితే ఆదివాసులు చిలకల గుట్ట వైపు వెళ్లిన సమ్మక్క ఆ గుట్టపై జువ్వి చెట్టు కింద కుంకుమ భరణి రూపంలో దర్శనమిచ్చినట్లు వారి నమ్మకం. అప్పటిని నుంచి జువ్వి చెట్టును ఆదివాసులు విశ్వాసం, ధైర్యానికి ప్రతిగా భావిస్తూవస్తున్నారు.

Frequently Asked Questions

మేడారంలో జువ్వి చెట్టును ఎందుకు రీ ప్లాంటేషన్ చేశారు?

గతంలో సమ్మక్క గద్దె వద్ద ఉన్న జువ్వి చెట్టు ఎండిపోవడంతో భక్తుల విశ్వాసం దృష్ట్యా అధికారులు కొత్త జువ్వి చెట్టును నాటారు. ఇది ఆదివాసీ గిరిజనుల నమ్మకాలకు ప్రతీక.

జువ్వి చెట్టుకు భక్తులు ఎందుకు మొక్కుకుంటారు?

భక్తులు జువ్వి చెట్టును వనదేవతలతో సమానంగా భావిస్తారు. కోయ గిరిజనులు దీనిని సమ్మక్క శక్తికి ప్రతీకగా నమ్ముతారు, ఇక్కడ మొక్కులు చెల్లించడం ఆనవాయితీ.

జువ్వి చెట్టు గురించి ఆదివాసుల నమ్మకం ఏమిటి?

సమ్మక్క చిలకల గుట్టపై జువ్వి చెట్టు కింద కుంకుమ భరణి రూపంలో దర్శనమిచ్చిందని ఆదివాసులు నమ్ముతారు. అప్పటినుండి దీనిని విశ్వాసం, ధైర్యానికి చిహ్నంగా భావిస్తారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
Telangana Woman Dies: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి, మరొకరికి గాయాలు
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి, మరొకరికి గాయాలు
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget