Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
భారత క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కెరీర్‌పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్‌కు మూడు ఫార్మాట్లలోనూ ఆడే అద్భుతమైన సత్తా ఉందన్న ద్రవిడ్.. టెస్ట్ క్రికెట్లోకి అతడిని ఇప్పుడే తొందరపడి తీసుకురావడం సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశారు.
ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ వైట్-బాల్ పెర్ఫార్మన్స్ సూపర్ అని అన్నారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున 16 మ్యాచ్‌ల్లో 237.30 భారీ స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్నాడు. అయితే ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అతడి ఎక్స్పీరియన్స్ అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటివరకు ఆడిన 8 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 17.25 సగటు మాత్రమే నమోదు చేశాడు.
లాంగర్ ఫార్మాట్‌కు అలవాటు పడేందుకు, క్రీజులో ఎక్కువసేపు నిలబడే స్కిల్ పెంచుకోవడానికి వైభవ్‌కు సమయం పడుతుందని ద్రవిడ్ చెప్పుకొచ్చారు. టెస్ట్ టీమ్‌లోకి రాకముందు దేశవాళీ క్రికెట్లో కనీసం రెండు సీజన్ల పాటు నిలకడగా రెడ్-బాల్ మ్యాచ్‌లు ఆడాలని సూచించారు. రాజస్థాన్ రాయల్స్‌లో వైభవ్‌ను దగ్గర్నుంచి గమనించిన ద్రవిడ్, అతడి గేమ్ పై నమ్మకం ఉన్నప్పటికీ లాంగ్ ఫార్మాట్లో రాణించాలంటే సహనం చాలా కీలకమని అభిప్రాయపడ్డారు.
ట్రెండింగ్ వార్తలు






















