అన్వేషించండి

IND VS SL 2nd Test Day 4 UPdates: సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!

India Vs Sri Lanka: కొలంబో టెస్ట్ నాల్గో రోజు ఫాలోఆన్ ఆడిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 229 రన్స్ చేసి 16 పరుగుల స్వల్ప లీడ్ న‌మోదు చేసింది. గురువారం ఆట‌కు చివ‌రి రోజు.

IND VS SL 2nd Test, Sri Lanka Erases Deficit In Second Innings:  శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాల్గో రోజు ఆటలో ప‌సందుగా జ‌రుగుతోంది. భారత జట్టు విధించిన ఫాలోఆన్ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక,  బుధ‌వారం నాలుగోరోజు  ఆట ముగిసే సమయానికి 72.4 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ పసిందు సూరియబండార (92) సూప‌ర్బ్ ఫిఫ్టీతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. అయితే భారీ వర్షం కారణంగా నాల్గో రోజు ఆటను అంపైర్లు ముందుగానే నిలిపివేశారు. ప్రస్తుతం శ్రీలంక 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో సొనాల్ దినుష (7), కేశర నువంత (3) ఉన్నారు. బౌల‌ర్ల‌లో మాన‌వ్ సుతార్ కు రెండు వికెట్లు ద‌క్కాయి.

భారత్ కు భారీ ఆధిక్యం..

అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 265-8తో నాల్గో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌట్ అయింది. సొనాల్ దినుష (103) అద్భుత శతకం సాధించిన కొద్దిసేపటికే లంక ఇన్నింగ్స్ పూర్త‌య్యింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3/52, మానవ్ సుతార్ 3/85 వికెట్లతో చెలరేగగా, అరంగేట్రం చేసిన స్పిన్నర్ సారాంశ్ జైన్ 2/69 తో తన తొలి 2 టెస్ట్ వికెట్లను నమోదు చేశాడు. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేయడంతో లంకపై 213 పరుగుల భారీ ఆధిక్యం ద‌క్కింది. దీంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించాడు.

పోరాడిన పసిందు, కమిందు..
రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన లంకకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ లహిరు ఉడారా (3) విఫలమవ్వగా, కమిల్ మిషారా (32) తో కలిసి పసిందు చక్కని భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో వికెట్ కు 58 పరుగులు జోడించిన తర్వాత కమిల్ ను జడేజా ఔట్ చేశాడు.  ఆ తర్వాత పసిందు సూరియబండార అద్భుత క్లాస్ బ్యాటింగ్ తో నడిపించాడు. సెంచరీకి చేరువైన సూరియబండార 92 రన్స్ వద్ద అవుట్ కాగా, కమిందు మెండిస్ 55 పరుగులతో విలువైన హాఫ్ సెంచరీ సాధించి , చ‌క్క‌ని భాగ‌స్వామ్యం న‌మోదు చేశాడు. వీరిద్దరి 115 పరుగుల నిలకడైన భాగస్వామ్యంతో శ్రీలంక జట్టు కోలుకుంది, ఆఖర్లో ఆ తర్వాత కాస్త ప్రతిఘటించిన కెప్టెన్ ధనంజయ డిసిల్వా (23) ను సుతార్ పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత 16 పరుగుల స్వల్ప లీడ్ లోకి వచ్చింది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచేందుకు అన్ని ర‌కాలుగా ట్రై చేశారు.

రేపు తేల‌నున్న ఫ‌లితం.. సిరీస్ క్లీన్ స్వీప్ పై భారత్ గురి
వర్షం కారణంగా ఆట నిలిచిపోయినప్పటికీ మ్యాచ్ పై భారత్ పూర్తి పట్టును నిలుపుకుంది. గురువారం ఐదో రోజు ఆట ప్రారంభంలోనే లంక మిగిలిన 4 వికెట్లను త్వరగా పడగొట్టి, స్వల్ప లక్ష్యాన్ని ఛేదించాలని భారత జట్టు పక్కా వ్యూహంతో బ‌రిలోకి దిగ‌నుంది. గాలేలో జరిగిన మొదటి టెస్టులో అద్భుత విజయం సాధించిన గిల్ సేన, ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్‌ను 2-0 తో క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. దీంతో డ‌బ్ల్యూటీసీ రేసులో మ‌రింత ముందుకు దూసుకుపోవాల‌ని భావిస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
Morne Morkel Comments: తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
Balakrishna Dhoni : కొందరికి కెప్టెన్ కూల్... మనందరికీ తలా - ధోనీపై బాలయ్య ఎలివేషన్ వేరే లెవల్
కొందరికి కెప్టెన్ కూల్... మనందరికీ తలా - ధోనీపై బాలయ్య ఎలివేషన్ వేరే లెవల్
Mitchell Santner Injury: టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
US Military Aircraft Attack: గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
Morne Morkel Comments: తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
Embed widget