శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుత పోరాటపటిమ కనబరిచాడు. గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ క్రీజులోకి వచ్చి ఎంఎస్ ధోని పేరిట ఉన్న చారిత్రాత్మక రికార్డును తిరగరాశాడు.తొలి రోజు మ్యాచ్లో శ్రీలంక పేసర్ లహిరు కుమార వేసిన షార్ట్ పిచ్ బంతికి పంత్ చేతికి తీవ్ర గాయమై రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే రెండో రోజు ఎలాంటి భయంలేకుండా బరిలోకి దిగిన పంత్.. షార్ట్ బాల్స్ దాడిని ఎదుర్కొంటూనే అద్భుతమైన అర్ధశతకం సాధించాడు. అంతేకాదు, విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత వికెట్ కీపర్గా (2500+ పరుగులు) ఎంఎస్ ధోని (2496 రన్స్) ఆల్-టైమ్ రికార్డును బ్రేక్ చేసి నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.