అన్వేషించండి

Musi Rejuvenation project: మూసి ప్రాజెక్ట్‌కు కేంద్రం, ఏడీబీ సాయం - ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభం - రేవంత్ కీలక ప్రకటన

Musi River: మూసీ ప్రాజెక్టుపై ప్రకటనలే చేస్తున్నారని ..పనులు చేయడం లేదని వస్తున్న విమర్శలపై రేవంత్ స్పందించారు. మార్చి 31 కల్లా ప్రాజెక్ట్ ఫైనల్ అవుతుందని అసెంబ్లీలో తెలిపారు.

Musi Rejuvenation project will be finalised by March 31: తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై అత్యంత కీలకమైన ప్రకటనలు చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన అంచనాలను ఈ ఏడాది మార్చి 31 నాటికి ఖరారు చేస్తామని, వెంటనే టెండర్లు ఆహ్వానించి పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) ఇప్పటికే రూ. 4,000 కోట్ల రుణాన్ని అందించేందుకు అంగీకరించిందని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మూసీ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ అభివృద్ధికి పచ్చజెండా ఊపిందని వెల్లడించారు.

ఎమ్మెల్యేలందరికీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్              

డీపీఆర్ (DPR) సిద్ధమైన తర్వాత ఎమ్మెల్యేలందరికీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వారి సలహాలను తీసుకుంటామని సీఎం తెలిపారు. లండన్ లోని థేమ్స్ నది, న్యూయార్క్, సింగపూర్ వంటి ప్రపంచ స్థాయి నగరాల నమూనాలను అధ్యయనం చేసి మూసీ ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ కోసం 60,000 కుటుంబాలను తరలించిన విషయాన్ని గుర్తు చేస్తూ, అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. మూసీ కాలుష్యం వల్ల నల్గొండ జిల్లా ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

55 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌

ఈ ప్రాజెక్టులో భాగంగా గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తామని సీఎం వివరించారు. గోదావరి జలాలను మళ్లించడం ద్వారా మూసీలో నిరంతరం స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా చేస్తామని, బాపు ఘాట్ వద్ద మూడు నదుల సంగమ క్షేత్రంలో గాంధీ సరోవర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మత సామరస్యానికి ప్రతీకగా మూసీ తీరంలో శివాలయం, గురుద్వారా, మసీదు, చర్చిలను నిర్మిస్తామని, దీనికోసం రక్షణ శాఖ భూములను ఇచ్చేందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.                      

ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా పాతబస్తీ                                     

పాతబస్తీని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని, పేదలకు మెరుగైన వసతులతో కూడిన ఇళ్లను నిర్మిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక పరిశ్రమ అని, గతంలో హైటెక్ సిటీ నిర్మించినప్పుడు కూడా ఇలాగే విమర్శలు చేశారని గుర్తు చేశారు. రాబోయే 20 ఏళ్లలో పట్టణీకరణ 75 శాతానికి పెరుగుతుందని, హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలందరూ సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు.               


 

టాప్ హెడ్ లైన్స్

Sammakka Sagar Barrage: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్.. ఛత్తీస్‌గఢ్ సీఎంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్.. ఛత్తీస్‌గఢ్ సీఎంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Yadadri Child Rescue: అయ్యో బిడ్డా.. వారం రోజులుగా అడవిలో బాతులతో పాటే నిద్ర.. ఆరేళ్ల బాలికను కాపాడిన గ్రామస్తులు!
అయ్యో బిడ్డా.. వారం రోజులుగా అడవిలో బాతులతో పాటే నిద్ర.. ఆరేళ్ల బాలికను కాపాడిన గ్రామస్తులు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బాబా వాంగ 2026 అంచనాలు: ఇయర్ ఎండ్ మీ రాశికి సంక్షోభమా, సంపదా?
బాబా వాంగ 2026 అంచనాలు: ఇయర్ ఎండ్ మీ రాశికి సంక్షోభమా, సంపదా?
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
ONGC Gas Leak: అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
Embed widget