'దేవర'లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. ట్రైలర్ చూస్తే ఆయన తండ్రి కొడుకులుగా నటిస్తున్నట్టు అర్థమైంది. మరి, దీనికి ముందు ఆయన డ్యూయల్ రోల్ చేసిన సినిమాలు ఎన్నో తెలుసా?
ఎన్టీఆర్ ప్రయాణంలో 'జై లవ కుశ' సినిమా చాలా స్పెషల్. డ్యూయల్ కాదు... అందులో ఆయన ట్రిపుల్ రోల్ చేశారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేసిన ఏకైక సినిమా ఇదే.
'జై లవ కుశ' సినిమాలో మరో స్పెషాలిటీ... ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ చేయడం. 'టెంపర్'లో అవినీతిపరుడైన పోలీసుగా నెగిటివ్ షేడ్స్ చూపించినా... జై పాత్రలో రావణుడిగా చేసిన పెర్ఫార్మన్స్ ఎప్పటికీ స్పెషల్ గా నిలిచి ఉంటుంది.
ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా 'అదుర్స్'. అందులో బ్రాహ్మణ యువకుడిగా ఆయన చేసిన అభినయం, ఆ డైలాగ్ డెలివరీ ఎక్స్ట్రాడినరీ.
ఎన్టీఆర్ కెరీర్‌లో ఫస్ట్ డ్యూయల్ రోల్ అంటే 'ఆంధ్రావాలా' సినిమా. అది ఆశించిన విజయం సాధించలేదు. కానీ, మ్యాన్ ఆఫ్ మాసెస్ తొలి ద్విపాత్రాభినయం చేసిన సినిమాగా అది ఎప్పటికీ రికార్డుల్లో ఉంటుంది.
మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన 'శక్తి' సినిమాలోనూ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. అది కూడా ఆశించిన విజయం సాధించలేదు.
ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఒకటి కంటే ఎక్కువ రోల్స్ చేసిన సినిమాలు నాలుగు. 'జై లవ కుశ', 'అదుర్స్' హిట్స్ కాగా... 'ఆంధ్రావాలా', 'శక్తి' ఫ్లాప్స్ అయ్యాయి. 'దేవర' విజయంతో హిట్స్ లెక్క పెంచాల్సిన టైమ్ వచ్చిందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 27న 'దేవర' సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.