అన్వేషించండి

CM Revanth: సర్పంచ్ ఎన్నికల్లో కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళను ఎన్నుకోవద్దు - మక్తల్ బహిరంగసభలో సీఎం రేవంత్ పిలుపు

Revanth Muktal Meeting: సర్పంచ్ ఎన్నికల్లో అభివృద్ధి చేసే వారిని ఎన్నుకోవాలని సీఎం రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. మక్తల్ బహిరంగసభలో ప్రసంగించారు.

CM Revanth's speech at Maktal public meeting: పాలమూరు జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలను అందించి నిండు మనసుతో ఆశీర్వదించారు .. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది.. మోసం చేస్తే పాతాళానికి తొక్కుతుంది అని నిరూపించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవల్లో భాగంగా మక్తల్ బహిరంగసభలో ప్రసంగించారు. ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా కెసీఆర్ ను ఈ గడ్డ ఆదరించింది  కానీ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి సంగం బండను పగలగొట్టేందుకు రూ. 12 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయలేదు.. పదేళ్లలో నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని ఆలోచనచేయలేదన్నారు. 

ప్రజా ప్రభుత్వంలో పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసుకునేందుకు అడుగులు వేస్తున్నామని రేవంత్ తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు మొదలు పెట్టాలని ప్రయత్నిస్తే కోర్టులో కేసులు వేసి ఏడాదిన్నర పనులు జరగకుండా ఆపారని.. ఏ రైతుకు నష్టం జరగవద్దని ఎకరానికి  రూ. 20 లక్షలు ఇచ్చి 96 శాతం రైతులను ఒప్పించి భూసేకరణ చేశామన్నారు. నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేసి ఇప్పుడు పనులు మొదలు పెట్టుకోబోతున్నామని తెలిపారు. మీ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు.. పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందించే బాధ్యత తనదని ప్రకటించారు.
 
ప్రతీ పేదవాడికి విద్య అందించాలని విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం  ప్రతీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం ..పార్టీల గురించి ఆలోచన చేయలేదు.. జెండాలు ఎజెండాలు చూడలేదు  పాలమూరు అభివృద్ధి లక్ష్యంగా జిల్లాలో 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. దేశానికి పాలమూరు జిల్లా ఆదర్శంగా ఉండాలనేదే మా ఆకాంక్ష ..మీరు చేతికి ఓటు వేసి గెలిపిస్తే అభయహస్తమై మీ జీవితాల్లో వెలుగులు నింపుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. 

మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం , 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం , రేషన్ కార్డుల ద్వారా పేదలకు సన్న బియ్యం అందిస్తున్నాం , రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం , రెండేళ్లల్లో రైతులకు 1 లక్ష 4 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేసి చూపించాం  ఒకవైపు కెసీఆర్ చేసిన 8 లక్షల కోట్ల అప్పును చెల్లిస్తూ పాలమూరు అభివృద్ధికి మీ బిడ్డగా కృషి చేస్తున్నానన్నారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టి అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఈ నెల 8,9 న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం..2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఏకానమీగా తీర్చి దిద్దుతామని తెలిపారు. 

పంచాయతీ ఎన్నికలు వచ్చాయి… కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళను కాదు.. అభివృద్ధిని కోరుకునేవారిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు మంచి వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి.. మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోండి ..మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది.. నీళ్లు ఇచ్చే బాధ్యత నాది ..పదేళ్లలో పాలమూరును పసిడి పంటల పాలమూరుగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.                 

 

టాప్ హెడ్ లైన్స్

KBR Park Elevated Corridors: కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్.. బాలకృష్ణ సహా ప్రముఖుల స్థలాలు సేకరణ
కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్.. బాలకృష్ణ సహా ప్రముఖుల స్థలాలు సేకరణ
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
AP Coalition MLAs Controversies: ఎన్ని సార్లు చెప్పినా మారని కూటమి ఎమ్మెల్యేలు - చంద్రబాబు, పవన్ ఇక చర్యలు ప్రారంభించబోతున్నారా?
ఎన్ని సార్లు చెప్పినా మారని కూటమి ఎమ్మెల్యేలు - చంద్రబాబు, పవన్ ఇక చర్యలు ప్రారంభించబోతున్నారా?
Embed widget