Bullet Train : బెంగళూరు-హైదరాబాద్-అమరావతి-చెన్నై మధ్య బుల్లెట్ ట్రైన్; తెలంగాణ రైజింగ్ విజన్ 2047 రేవంత్ రెడ్డి చెప్పిందేంటీ?
Bullet Train Projects: బెంగళూరు-హైదరాబాద్, హైదరాబాద్-అమరావతి, అమరావతి-చెన్నై మార్గాల్లో బుల్లెట్ రైళ్లు నడుస్తాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసలు దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటీ?

Bullet Train Projects: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం నాడు ఒక పెద్ద ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని బెంగళూరు-హైదరాబాద్, హైదరాబాద్-అమరావతి, అమరావతి-చెన్నై మార్గాల్లో బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు కేంద్రం ఓకే చెప్పేలా తెలంగాణ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈ ప్రకటన దక్షిణ భారతదేశంలో మౌలిక సదుపాయాలను మార్చే లక్ష్యంతో కూడిన ఒక ప్రతిష్టాత్మక పథకంలో భాగం, దీని లక్ష్యం ప్రాంతీయ ఆర్థిక కేంద్రాలను వేగంగా అనుసంధానం చేయడమని అన్నారు. ఇందులో కీలక అడుగు పడిందని ప్రకటించారు.
రోడ్లు -జలమార్గాల ద్వారా కనెక్టివిటీని పెంచడంపై దృష్టి
ఇది కేవలం బుల్లెట్ రైళ్లకే పరిమితం కాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్ హైవేల నిర్మాణానికి కూడా ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఇది రోడ్డు రవాణాను మరో స్థాయికి తీసుకెళ్తుందని ఆయన అన్నారు. ఈ హైవేలు ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, వ్యాపారం, వాణిజ్యాన్ని కూడా ప్రోత్సహిస్తాయి. ఇది అన్ని రాష్ట్రాలకు ఆర్థికంగా ఊతమిచ్చేందుకు సహయపడుతుందని పేర్కొన్నారు.
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy addresses the media at Dr BR Ambedkar Telangana State Secretariat | Telangana Rising 2047 https://t.co/xYjPoYWz2q
— Telangana CMO (@TelanganaCMO) November 30, 2025
మచిలీపట్నం పోర్టు కనెక్టివిటీని పెంచడానికి కూడా ప్రాధాన్యతనిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, "మేము మచిలీపట్నం పోర్టు కనెక్టివిటీని అభివృద్ధి చేస్తున్నాము, తద్వారా ఇది ప్రాంతీయ వాణిజ్యానికి ఒక ప్రధాన కేంద్రంగా మారుతుంది." ఈ చర్య ఆంధ్రప్రదేశ్‌లోని ఈ తీరప్రాంత నగరాన్ని దక్షిణ భారతదేశంలోని లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌తో అనుసంధానించడానికి సహాయపడుతుంది. అని అభిప్రాయపడ్డారు.
చైనా, జపాన్- సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ - ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. "మా పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలతో కాదు, చైనా, జపాన్, జర్మనీ, సింగపూర్, దక్షిణ కొరియా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో ఉంది" అని ఆయన అన్నారు. ఇప్పటికే అక్కడ అధికారులు, మంత్రులు పర్యటించి అక్కడ అమలు చేస్తున్న ప్రాజెక్టుల గురించి అధ్యయనం చేశారన్నారు. వాటిని తెలంగాణ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించామన్నారు.
దీంతోపాటు రాష్ట్రంలోని మిగతాప్రాంతాలను ఎలా అభివృద్ధి చేస్తామో కూడా ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్ రేర్‌గా విభజిస్తారమన్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా డెవలప్‌చేస్తామని పేర్కొ్నారు.
ప్రస్తుతం బుల్లెట్ రైలు ప్రాజెక్టులో DPR- ఆర్థిక అనుమతి కోసం ఎదురుచూపు
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రాజెక్టులు వాస్తవ రూపం దాల్చితే దక్షిణ భారతదేశ ఆర్థిక గమనాన్ని మారుస్తాయి. తెలంగాణను దేశంలోని అత్యంత ప్రగతిశీల రాష్ట్రాల సరసన నిలబెడతాయని అంటున్నారు. అయితే, బుల్లెట్ రైలు ప్రాజెక్టులు ఇంకా ప్రతిపాదిత దశలో ఉన్నాయి. వీటిపై వివరణాత్మక DPR (వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్) ఆర్థిక అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ పడితే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తాయి.





















