Virat Kohli Records in Vizag Stadium | వైజాగ్ లో విరాట్ రికార్డుల మోత
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే మ్యాచ్ విశాఖపట్నంలో జరుగుతుంది. అయితే ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఆడిన రెండు మ్యాచులో కలిపి సెంచరీలు 237 పరుగులు చేశాడు. అయితే ఈ సెంచరీలతో ఎన్నో రికార్డ్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ మూడవ వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బ్రేక్ చేయడానికి కొన్ని రికార్డ్స్ రెడీగా ఉన్నాయి.
వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు మొత్తం 12 మంది క్రికెటర్లు వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసారు. భారత్ తరపున విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటివరకు ఒక్కొక్కసారి వన్డే సెంచరీల హ్యాట్రిక్ పూర్తి చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగే మూడో వన్డే మ్యాచ్‌లో కూడా విరాట్ సెంచరీ సాధిస్తే, వన్డేలలో సెంచరీల హ్యాట్రిక్ 2 సార్లు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మన్ అవుతాడు. వన్డే క్రికెట్‌లో దక్షిణాఫ్రికాపై వరుసగా 4 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్ అవుతాడు.
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 555 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 27910 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన లిస్ట్ లో మూడో స్థానంలో ఉన్నాడు. మూడో వన్డేలో మరో 107 పరుగులు చేస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్ అవుతాడు. రెండు మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ ఆడిన విధానంతో విశాఖ వన్డేపై భారీ అంచనాలు నెలకొన్నాయి.





















