అన్వేషించండి

Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించినంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?

Andhra Capital: అమరావతి పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. దీంతో రెండో దశ భూసమీకరణకు రైతులు ఆక్తి చూపించడం లేదు. ప్రబుత్వం ఏం చేయబోతోంది?

Are Amaravati projects progressing as fast as expected: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి రాజధాని నిర్మాణం ప్రస్తుతం కీలక దశలో ఉంది. 2024లో పనులు పునఃప్రారంభమైన తర్వాత దాదాపు రెండేళ్లు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో పురోగతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  అమరావతిలో ఐకానిక్ భవనాలైన అసెంబ్లీ, హైకోర్టు మరియు సచివాలయ టవర్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సాధారణ మౌలిక సదుపాయాల పనుల్లో జాప్యం కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రంక్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ లైన్ల వంటి పనులు అంచనా వేసిన దానికంటే నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో అమరావతి పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయా  లేదా అన్న సందేహం ప్రారంభమయింది. ఇది రెండో విడత భూసమీకరణ మీద ప్రభావం చూపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

నెమ్మదిగా సాగుతున్న పనులు 

ప్రధాన కాంట్రాక్టు సంస్థలు నిర్దేశించుకున్న లక్ష్యంలో కేవలం 10 నుండి 20 శాతం వరకు మాత్రమే భౌతిక పురోగతిని సాధించాయి. భారీ వర్షాలు, సాంకేతిక కారణాలు  ఈ మందగమనానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్ల అభివృద్ధి విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మొదటి విడతలో దాదాపు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన ప్లాట్లు అందలేదు. ప్లాట్ల వద్ద రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం వంటి కనీస వసతులు లేకపోవడంతో ఆ ప్లాట్లు అమ్మకానికి గానీ, గృహ నిర్మాణాలకు గానీ అనుకూలంగా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దాదాపు 1,300 కోట్లు లేఅవుట్ల అభివృద్ధి కోసం కేటాయించినప్పటికీ, పనులు ఆశించిన వేగంతో జరగకపోవడం రైతుల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.

రెండో విడత భూసమీకరణపై నీలినీడలు

రాజధానిని మరో 16,000 నుండి 20,000 ఎకరాల మేర విస్తరించాలని ప్రభుత్వం రెండో విడత భూసమీకరణను ప్రారంభించింది. అయితే, మొదటి విడతలో భూములిచ్చిన రైతులకు కలిగిన ప్రయోజనంపై స్పష్టత లేకపోవడంతో, కొత్తగా భూములిచ్చేందుకు రైతులు వెనుకాడుతున్నారు. వైకుంఠపురం, పెదమద్దూరు వంటి గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహిస్తున్నా, రైతుల నుంచి  స్పందన తక్కువగా ఉంది.  ముందు పాత పనులు పూర్తి చేయండి.. ఆ తర్వాతే కొత్త భూములు అడగండి అన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ కారణంగానే రెండో విడత భూసమీకరణ ప్రక్రియ మందగించిందన్న ప్రచారం జరుగుతోంది.

పెట్టుబడుల ఆకర్షణలో సవాళ్లు

అమరావతిలో క్వాంటం వ్యాలీ, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి భారీ ప్రాజెక్టుల ప్రకటనలు ఆశలు రేకెత్తిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలు లేకపోవడం పెట్టుబడిదారులను ఆలోచనలో పడేస్తోంది. రాజధాని ప్రాంతంలో స్థిరాస్తి ధరలు పెరిగినప్పటికీ, వాస్తవంగా నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు , ఆసియా అభివృద్ధి బ్యాంకు నుండిరూ. 15,000 కోట్ల వరకు నిధులు సమీకరించినప్పటికీ, ఆ నిధులను వేగంగా ఖర్చు చేసి పనులు పూర్తి చేయకపోతే ప్రాజెక్టు వ్యయం మరింత పెరిగే ప్రమాదం ఉంది.  ప్రభుత్వం ప్రస్తుతం నిర్దేశించుకున్న 2027-28 లక్ష్యాలను చేరుకోవాలంటే కేవలం భవనాలపైనే కాకుండా, రైతులకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలన్న అభిప్రాయం వినిపిస్తోంది నిర్మాణ సంస్థలపై పర్యవేక్షణ పెంచి, రెండో విడత భూసమీకరణకు వెళ్లే ముందే మొదటి విడత ఫలితాలను కళ్లముందు చూపాల్సిన అవసరం ఉంది. అప్పుడే రెండో విడతలో భూములుఇచ్చేందుకు రైతులు మరింత ఆసక్తి చూపే అవకాశం ఉంది.   

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
BC Reservations In AP: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Smriti Mandhana Captaincy Era:  భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
Leftover Rice Dosa : రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
Election Commission Powers: ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Indrakeeladari Arrangements: ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు.. విజయవాడ ఉత్సవ్ కు తమిళనాడు సీఎం విజయ్‌కు ఆహ్వానం
ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. తమిళనాడు సీఎం విజయ్‌కు ఆహ్వానం
Embed widget