అన్వేషించండి

Discount On Cars: టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్! గరిష్టంగా 1 లక్షకు పైగా బెనిఫిట్స్ మీ సొంతం

Discount on Tata cars | టాటా, మారుతి కార్లపై డిసెంబర్ 2025లో భారీ డిస్కౌంట్లు. హారియర్, సఫారి, పంచ్, టియాగో, ఫ్రాంక్స్, ఇన్విక్టోలపై ఆఫర్లు.

Discount on Maruti vehicles | కస్టమర్‌లకు డిసెంబర్ 2025 చాలా ప్రయోజనకరంగా మారనుంది. టాటా మోటార్స్ (Tata Motors), మారుతి సుజుకి తమ కార్లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్నాయి. ఈ ఆఫర్‌లలో నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ప్రయోజనం, లాయల్టీ బోనస్ ఉన్నాయి. మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా, అయితే ఈ ఆఫర్లు మీకు పెద్ద మొత్తంలో ఆదా చేసే అవకాశాన్ని అందిస్తాయి. ఏ కార్లపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం. కొన్ని కార్లపై గరిష్టంగా లక్షకు పైగా ఆదా చేసే అవకాశం లభించింది.

టాటా హారియర్ (Tata Harrier), టాటా సఫారి

టాటా హారియర్, సఫారి వాహనాల కొనుగోలుపై మీకు భారీ తగ్గింపు లభిస్తుంది. వాటి 2025 హై-స్పెక్ వేరియంట్‌లపై ఏకంగా రూ.75,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే పాత మోడల్‌లపై ఈ తగ్గింపు ఒక లక్ష రూపాయల వరకు ఉంటుంది. టాటా హారియర్ ధర రూ.14 లక్షల నుండి రూ.25.24 లక్షల వరకు ఉంది. టాటా సఫారి ధర రూ.14.66 లక్షల నుండి టాప్ మోడల్ రూ.25.96 లక్షల వరకు ఉంది.

టాటా ఆల్ట్రోజ్

టాటా ఆల్ట్రోజ్ కొత్త మోడల్‌పై కస్టమర్‌లకు రూ.25,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అదే సమయంలో, పాత ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై ఏకంగా రూ.85,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ రూ.6.30 లక్షల నుండి రూ.10.51 లక్షల ధరలో ఉంటుంది. 

టాటా పంచ్ (Tata Punch)

టాటా పంచ్ అన్ని పెట్రోల్ వేరియంట్, CNG వేరియంట్‌లపై రూ.40,000 వరకు తగ్గింపు లభిస్తుంది. పాత మోడళ్లపై ఏకంగా రూ.75,000 వరకు తగ్గింపు లభిస్తుంది. టాటా పంచ్ ధర రూ.5.50 లక్షలకు ప్రారంభం కాగా, టాప్ ఎండ్ రూ.9.24 లక్షల వరకు ఉంది.

టాటా టియాగో (Tata Tiago), టాటా టిగోర్ (Tata Tigor) 

టాటా టియాగో, టాటా టిగోర్‌పై కూడా మంచిగా ఆదా చేయవచ్చు. ఈ మోడల్స్ 2024 మోడల్స్‌పై రూ.55,000 వరకు తగ్గింపు లభిస్తుంది. కొత్త 2025 మోడల్స్‌పై రూ.35,000 వరకు ఆఫర్‌లు ఉన్నాయి. టాటా టియాగో ధర రూ.4.57 లక్షల నుండి రూ.7.82 లక్షల వరకు ఉన్నాయి. టాటా టిగోర్ ధర రూ.5.49 లక్షలకు ప్రారంభం నుండి రూ.8.74 లక్షల వరకు ఉంది.

మారుతి ఇన్విక్టో (Maruti Invicto) 

మారుతి ఇన్విక్టోపై రూ.2.15 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనం లభిస్తుంది. ఇందులో రూ.1 లక్ష క్యాష్ డిస్కౌంట్, రూ.1.15 లక్షల వరకు స్క్రాపేజ్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. ఈ ప్రీమియం MPV రూ.24.97 లక్షల నుంచి 28.61 లక్షల రూపాయల వరకు లభిస్తుంది.

మారుతి ఫ్రాంక్స్ (Maruti Fronx)

మారుతి ఫ్రాంక్స్ టర్బో వేరియంట్‌పై రూ.88,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో రూ.43,000 విలువైన వెలాసిటీ యాక్సెసరీ ప్యాక్ ఉంది. ఫ్రాంక్స్ పెట్రోల్ మోడల్‌పై రూ.35,000, CNG వేరియంట్‌పై రూ.30,000 వరకు తగ్గింపు ఇచ్చారు.  మారుతి ఫ్రాంక్స్ కారు ధర రూ.6.85 లక్షల నుండి రూ.11.98 లక్షల వరకు ఉంది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

హ్యుందాయ్ కారు కొనేవాళ్లకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ నుంచి ధరలు పెంపు - ఏ మోడల్‌పై ఎంత పెరుగుతుంది?
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌ - మరికొన్ని రోజుల్లో రేట్లు పెంచబోతున్న హ్యుందాయ్‌
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని 50 ఏళ్లుగా వాడుతున్న బ్రెజిల్.. ఇప్పుడు అక్కడి కార్లు, బైకుల పరిస్థితి ఏంటి?
బ్రెజిల్‌లో 50 ఏళ్లుగా ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగం - అక్కడి కార్లు, బైక్‌లకు ఏం కాలేదా?
రోజూ కాలేజీ, ఆఫీస్‌కు వెళ్లిరావడానికి బెస్ట్ ఆప్షన్.. రూ.15,000 లోపే వచ్చే ఎలక్ట్రిక్‌ సైకిళ్లు ఇవే
పెట్రోల్ ఖర్చుకు చెక్.. రూ.15,000 లోపే స్టైలిష్‌ ఎలక్ట్రిక్ సైకిళ్లు, 40km వరకు ప్రయాణం!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget