Maruti Brezza Facelift టెస్టింగ్ పూర్తి, త్వరలో మార్కెట్లోకి.. కొత్త మోడల్ ఫీచర్లు ఇవే!
కొత్త Maruti Brezza Facelift త్వరలో మార్కెట్లోకి విడుదల కానుంది. పాత మారుతి Brezza 2022లో వచ్చింది, 3 ఏళ్ల తర్వాత ఫేస్‌లిఫ్ట్‌తో అప్డేట్ వస్తుంది.

Maruti Brezza Car | భారతదేశంలో కస్టమర్ల ఆదరణ పొందిన కాంపాక్ట్ SUVలలో మారుతి బ్రెజ్జా ఒకటి. దీని ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఇటీవల మనాలి హైవేపై టెస్టింగ్ సమయంలో బయటకు వచ్చింది. కొండ ప్రాంతాల్లో టెస్టింగ్ చేయడం ద్వారా, కంపెనీ కారును కఠినమైన పరిస్థితుల్లోనూ ఎలా నడుస్తుందో చెక్ చేయాలని పరీక్షిస్తోంది. తద్వారా కొత్త మోడల్ గత మోడల్ కంటే మెరుగ్గా ఉంటుందని చూపించనుంది. కొత్త Maruti Brezza 2026 ప్రారంభం నాటికి లేదా సంక్రాంతి పండుగ సీజన్‌కు ముందు విడుదలయ్యే అవకాశం ఉంది.
కొత్త డిజైన్ ఎలా ఉంటుంది?
కొత్త Maruti Brezza బాడీ స్టైల్ చాలా వరకు ప్రస్తుత మోడల్‌ను పోలి ఉంటుంది. అయితే పలు చిన్న మార్పులతో పాటు కొన్ని భారీ మార్పులు దీనిని మరింత మోడ్రన్‌గా చేస్తాయి. లీకైన ఫొటోల ప్రకారం చూస్తే.. ఫ్రంట్ ప్రొఫైల్‌లో కొత్త గ్రిల్ ఉంటుంది. ఇది బ్రాండ్ కొత్త కార్లలాగ మరింత స్టైలిష్‌గా, షార్ప్‌గా ఉంటుంది. హెడ్‌లైంప్‌లలో LED DRLలు పాత తరహాలో ఉంటాయి. అయితే బంపర్ డిజైన్ కొద్దిగా మారుతుంది. సైడ్‌లో వీల్ ఆర్చ్‌ల చతురస్రాకార డిజైన్, మందపాటి బాడీ క్లాడింగ్ అలాగే ఉంటాయి. అయితే కొత్త బ్లాక్ ఫినిష్‌తో కూడిన 4-స్పోక్ అల్లాయ్ వీల్స్ SUVకి న్యూ లుక్ ఇస్తాయి. వెనుకవైపు టెయిల్‌లైంప్‌లు ప్రస్తుత మోడల్‌లా ఉంటాయి. అయితే కొత్త రియర్ లైట్ బార్, అప్‌డేట్ చేసిన బంపర్ SUV రియర్ లుక్‌ను మరింత స్పోర్టీగా చేస్తాయి.
ఇంటీరియర్‌లో భారీ మార్పులు
కొత్త Brezza ఇంటీరియర్‌లో అనేక కొత్త ఫీచర్లను చేర్చే అవకాశం ఉంది. అతిపెద్ద మార్పు 10.1-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇది కొత్త సాఫ్ట్‌వేర్, వేగవంతమైన కనెక్టివిటీని కలిగి ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా గతంలో కంటే స్పష్టంగా, మోడ్రన్‌గా కనిపిస్తుంది. క్యాబిన్‌లో కొత్త రంగు ఎంపికలు, మెరుగైన మెటీరియల్స్, కొత్త స్టీరింగ్ వీల్ SUVకి ప్రీమియం అనుభూతిని ఇస్తాయి. సౌకర్యాన్ని పెంచడానికి వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ డ్రైవర్ సీటు వంటి ఫీచర్‌లను చేర్చే అవకాశాలున్నాయి.
సేఫ్టీలో బిగ్ అప్‌గ్రేడ్
Maruti Brezza Faceliftలో భద్రతకు సంబంధించిన ఫీచర్‌లు చాలా మెరుగ్గా ఉంటాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఇప్పటికే ప్రామాణికంగా వస్తున్నాయి. అయితే కొత్త Brezzaలో లెవెల్ 2 ADA S వచ్చే అవకాశం ఉంది. ఇందులో లేన్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, కొలిషన్ వార్నింగ్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్‌లు ఉండవచ్చు. దీనితో పాటు, 360 డిగ్రీస్ కెమెరా, ESC, హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్‌లు కూడా కొనసాగుతాయి.
ఇంజిన్‌లో మార్పులు లేవు
కొత్త Maruti Brezza ఇంజిన్ ప్రస్తుతం ఉన్నట్లుగానే ఉంటుంది. ఇది 1.5-లీటర్ K15C పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 103 bhp శక్తిని, 137 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రెండింటితోనూ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. CNG వేరియంట్ కూడా కొనసాగుతుంది, అయితే ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.
ధర ఎంత ఉండవచ్చు?
కొత్త Maruti Brezza Facelift ప్రారంభ ధర దాదాపు రూ. 8 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆన్ రోడ్ ధర ఎక్కువ ఉంటుందని తెలిసిందే. ఇది ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువ. కొత్త ఫీచర్‌లు, మెరుగైన భద్రత, ఆధునిక డిజైన్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఈ SUV ఇప్పటికీ మీ నగదుకు సరైన విలువగా ప్రూవ్ చేసుకుంది.






















