అన్వేషించండి

River Indie నిజంగా ‘స్కూటర్లలో SUV’నా? కొనే ముందు క్లారిటీ ఇచ్చే 7 ముఖ్యమైన విషయాలు

రివర్ ఇండీని ‘EVల SUV’గా ఎందుకు పిలుస్తారో తెలుసా? - 4kWh బ్యాటరీ, 43లీటర్ల స్టోరేజ్, 14 అంగుళాల వీల్స్‌తో వచ్చిందీ స్కూటర్‌. కొనే ముందే మీరు తెలుసుకోవాల్సిన 7 ముఖ్య విషయాలు ఇవే.

River Indie Electric Scooter Features: బెంగళూరులో స్టార్ట్‌అప్‌గా ప్రారంభమైన River కంపెనీ, తన మొదటి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ River Indie తో మార్కెట్లో మంచి హంగామా సృష్టిస్తోంది. ‘ఫంక్షన్‌ ఓవర్‌ ఫార్మ్‌’ కాన్సెప్ట్‌తో తయారైన ఈ స్కూటర్‌ను కంపెనీ “EVల SUV”గా పిలవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే... ఇందులో ఇచ్చిన స్టోరేజ్, రగ్గ్డ్‌ డిజైన్‌, రోజువారీ ఉపయోగంలో వచ్చే సౌకర్యాలు నిజంగానే SUV స్థాయిలో ఉంటాయి. రివర్ ఇండీ స్కూటర్‌ కొనాలా, వద్దా అని ఆలోచిస్తున్న మీరు, కొనుగోలుకు ముందే తప్పక తెలుసుకోవాల్సిన 7 కీలక విషయాలు ఇవే.

1. రివర్‌ ఇండీ బ్యాటరీ సామర్థ్యం ఎంత?
ఇందులో 4kWh బ్యాటరీ ప్యాక్‌ ఇచ్చారు. కంపెనీ చెప్పే IDC రేంజ్‌ కంటే, నిజ జీవితంలోని మిక్స్‌డ్‌ రైడింగ్‌లో సుమారు 90 కి.మీ. రేంజ్ ఇస్తోంది. ట్రాఫిక్‌ రైడింగ్‌, ఓపెన్‌ రోడ్‌ రైడింగ్‌ రెండింటి కలయికలో ఈ రేంజ్‌ చాలా మందికి సరిపోతుంది. రోజూ ఆఫీస్‌ ట్రావెల్‌, షార్ట్‌ రైడ్స్‌ చేసే వారికి ఈ బ్యాటరీ కెపాసిటీ కంఫర్ట్‌ ఇచ్చేలా ఉంటుంది.

2. రివర్‌ ఇండీ శక్తి ఎంత?
ఈ స్కూటర్‌ పీక్‌ పవర్‌గా 6.7kW ఔట్‌పుట్‌, 26Nm టార్క్‌ ఇస్తుంది. స్టార్ట్‌ నుంచి పికప్‌ త్వరగా అందడం, తక్కువ సిటీ స్పీడ్‌లలో కూడా శక్తిమంతమైన ఫీలింగ్‌ రావడం ఇండీకి ఉన్న ప్రధాన బలం. రైడింగ్‌లో స్కూటర్‌ హుందాగా, నమ్మకంగా అనిపిస్తుంది.

3. మార్కెట్లో బెస్ట్‌ స్టోరేజ్‌ ఎందుకు అంటారు?
ఈ ఇండీని ‘SUV స్కూటర్’ అని పిలిచే ప్రధాన కారణం దీని స్టోరేజ్‌ స్పేస్‌. 

43 లీటర్ల అండర్‌సీట్‌ స్టోరేజ్ – EVల్లో ఏ బండీ అందుకోలేని స్థాయిలో ఇది పెద్ద స్పేస్‌. హెల్మెట్‌, రెయిన్‌కోట్‌, బ్యాగ్‌ వంటివి చాలా సులభంగా సెట్‌ అవుతాయి.

12 లీటర్ల ఫ్రంట్‌ అప్రాన్‌ స్టోరేజ్‌ కూడా ఉంది. లాకబుల్‌ స్పేస్‌ కావడంతో ఫోన్‌, పర్సు, చిన్న వస్తువులు పెట్టుకోవచ్చు, లాక్‌ చేసుకోవచ్చు.

అంతేకాదు, ఇంకా ఎక్కువ స్టోరేజ్‌ కావాలంటే రివర్‌ నుంచి పన్నియర్లు, టాప్‌బాక్స్ కూడా కొనవచ్చు.

4. రివర్‌ ఇండీ 14-అంగుళాల వీల్స్‌తో వస్తుందా?
అవును. ముందు-వెనుకా 14 అంగుళాల వీల్స్ ఉన్నాయి. ఇవి స్కూటర్‌ హ్యాండ్లింగ్‌ని బాగా మెరుగుపరుస్తాయి. గుంతలు, స్పీడ్‌ బ్రేకర్లు, మూలల్లో తిరుగుతూ ఉన్నప్పుడు స్కూటర్‌ స్టేబుల్‌గా ఉంటుంది.

5. రివర్‌‌కు ఎన్ని టచ్‌ పాయింట్లు ఉన్నాయి?
దేశవ్యాప్తంగా రివర్‌ ప్రస్తుతం 37 ఆపరేషనల్‌ స్టోర్లు నడుపుతోంది. ఇండీ మీ ప్రాంతంలో డెలివరీ అందుబాటులో ఉందా, లేదా అన్నది మీ నగరంపై ఆధారపడి ఉంటుంది. ప్రధాన మెట్రో నగరాల్లో అందుబాటులో ఉండే అవకాశాలు ఎక్కువ.

6. రివర్‌ ఇండీ ఏయే రంగుల్లో దొరుకుతుంది?
ఇండీ మొత్తం 5 రంగుల్లో వస్తుంది - ఎరుపు, పసుపు, నీలం, గ్రే, తెలుపు. ఇవన్నీ బ్లాక్‌ ఫ్రంట్‌ ఎండ్‌తో వచ్చి స్కూటర్‌కు షార్ప్‌ స్టైల్‌ను ఇస్తాయి.

7. రివర్‌ ఇండీ ధర ఎంత?
రివర్‌ ఇండీ ధర ₹1.46 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌, బెంగళూరు). ఫీచర్లు, స్టోరేజ్‌, పవర్‌, రగ్డ్‌ డిజైన్‌ దృష్టిలో పెడితే ఈ రేటును అందుబాటు ధరగానే భావించాలి.

రైడింగ్‌లో ప్రాక్టికాలిటీని ప్రాధాన్యం ఇచ్చే వారు, పెద్ద స్టోరేజ్‌ కావాలనుకునేవారు, రోజువారీ ప్రయాణాలకు సులభమైన ఈ-స్కూటర్‌ కోరుకునేవారు - అందరికీ రివర్‌ ఇండీ మంచి ఆప్షన్‌. సిటీ రైడింగ్‌లో మినీ-SUV లాంటి ఫీల్‌ ఇస్తూ, ఇంటి నుంచి ఆఫీస్‌ వరకు సులభమైన ప్రయాణం కోరుకునే వారికి ఇది బెస్ట్‌ ఛాయిస్‌ అవుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?

వీడియోలు

West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget