Team India Bowling Ind vs SA | తేలిపోయిన భారత బౌలర్లు
భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ చాలా ఉత్ఖంఠభరితంగా కొనసాగుతుంది. తొలి వన్డేలో ఓడిన సౌతాఫ్రికా, రెండో వన్డేలో 359 పరుగుల భారీ లక్ష్యాన్ని మఛేదించింది. అయితే మూడో వన్డే మ్యాచ్ రెండు టీమ్స్ కు చాలా కీలకం. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ప్రసిద్ద్ కృష్ణ 8.2 ఓవర్లలో ఏకంగా 85 పరుగులు ఇచ్చాడు. రెండు వికెట్లు తీసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేక పొయ్యాడు.
అర్ష్‌దీప్ సింగ్ ను మినహాయిస్తే హర్షిత్ రాణా కూడా బౌలింగ్ పరంగా ఆశించినంతగా ప్రభావం చూపలేక పోతున్నాడు. ఈ వన్డే సిరీస్‌లో భారత బ్యాటర్లు పర్వాలేదనిపించినా... బౌలింగ్ విఫలమవడంతో ఫ్యాన్స్ అంతా కంగారులో పడ్డారు. బుమ్రా, సిరాజ్ లేకపోతే టీమ్ ఇండియా పరిస్థితి ఇంత దారుణంగా ఉందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తోపాటు సెలక్షన్ కమిటీ కూడా విమర్శలు అందుకుంటుంది. తొలి వన్డేలో సౌతాఫ్రికా టాప్ ఆర్డర్ రాణించి ఉంటే, ఆ మ్యాచ్‌లో కూడా భారత్ ఓడిపోయేది అని అంటున్నారు. ఇక మూడో వన్డేలో అయినా యంగ్ బౌలర్లు ఎలా తమని తాము ప్రూవ్ చేసుకుంటారో చూడాలి.





















