India vs South Africa 3rd ODI Preview | వైజాగ్ లో మూడో వన్డే మ్యాచ్
భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడవ వన్డే మ్యాచ్ నేడు జరగనుంది. అయితే ఇది డిసైడింగ్ మ్యాచ్ అవడంతో సిరీస్ పై రెండు టీమ్స్ కన్నేశాయి. రాంచీలో తొలి వన్డేను భారత్ గెలిచింది. రాయపూర్‌లో సౌతాఫ్రికా 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది. దాంతో వైజాగ్ లో జరిగే మూడో వన్డే మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానుంది.
వైజాగ్ లో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్ ఉంటుంది కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా 300 ప్లస్ స్కోర్ ఖాయం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ సిరీస్ లో టీమ్ ఇండియా బౌలింగ్ విషయంలో ట్రోల్స్ ఎదుర్కుంటుంది. జరిగిన రెండు వన్డే మ్యాచులో భారత బౌలర్లు భారీగా రన్స్ సమర్పించుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్ ను మినహాయిస్తే హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ ఎక్కువ పరుగులు సమర్పించుకున్నారు. రాయ్ పూర్ మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ 8.2 ఓవర్లలో 85 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపొయ్యాడు.
ఇక ఇప్పుడు నడుస్తున్న మరో చర్చ ... నితీష్ కుమార్ ను ప్లేయింగ్ 11 లోకి తీసుకుంటారా లేదా అని. బ్యాటింగ్‌లో రాణించడమే కాకుండా బౌలర్ గా వికెట్స్ తీస్తూ.. మంచి ఫార్మ్ ను కొనసాగిస్తున్నాడు. కాబట్టి నితీష్ కు ఈ మ్యాచ్ లో చోటు దక్కే అవకాశం ఉంది. విశాఖ గ్రౌండ్ .. భారత్‌కు కలిసొచ్చిన స్టేడియం. ఇక్కడ భారత్ ఇప్పటివరకు ఆడిన 10 వన్డేల్లో 7 విజయాలు సొంతం చేసుకుంది. హిస్టరీ చూసుకొని.. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.





















