అన్వేషించండి

IND vs NZ Final: భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే టీ20 ప్రపంచ కప్ విజేత ఎవరు?

Ind vs NZ Final | మార్చి 8న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. అయితే వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే విజేతగా నిలిచే జట్టు ఏంటని నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు.

IND vs NZ Final Reserve Day Rule: టీ20 వరల్డ్ కప్ 2026 సరిగ్గా నెల రోజుల క్రితం ప్రారంభమైంది. 54 మ్యాచ్‌ల ఉత్కంఠ తర్వాత ఇక విజేతను నిర్ణయించే ఫైనల్ మ్యాచ్ సమయం దగ్గర పడింది. ఇందులో భారత్, న్యూజిలాండ్ (IND vs NZ Final) జట్లు తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ మార్చి 8న ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. భారత్ ఇప్పటికే రెండుసార్లు ఛాంపియన్‌గా నిలవగా, న్యూజిలాండ్ తన తొలి టైటిల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. అయితే, వర్షం లేదా ఇతర కారణాల వల్ల ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ రద్దయితే విజేతగా ఎవరిని ప్రకటిస్తారు? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయో ఇక్కడ అందిస్తున్నాం. 

వర్షం పడితే ఏమవుతుంది?

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ మార్చి 8న జరగనుంది. ఒకవేళ మార్చి 8న నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే, అప్పుడు రిజర్వ్ డే రూల్ వర్తిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరుగుతుంది. అయితే, మొదట మార్చి 8వ తేదీనే కనీసం 10 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తారు.

రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడితే విజేత ఎవరు ?

ఒకవేళ మార్చి 9న కూడా వర్షం వల్ల, ఇతర కారణాల వల్ల నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌ కు ఆటంకం కలిగితే కనీసం 10 ఓవర్ల ఆట నిర్వహించడానికి ప్రయత్నిస్తారు. ఐసీసీ ఈవెంట్స్ నాకౌట్ మ్యాచ్‌లలో రిజల్ట్ రావాలంటే ప్రతి ఇన్నింగ్స్‌లో కనీసం 10 ఓవర్ల ఆట తప్పనిసరి. ఒకవేళ మొదటి రోజు కొన్ని ఓవర్ల ఆట జరిగినట్లయితే, రిజర్వ్ డే రోజు అక్కడినుంచే మ్యాచ్ తిరిగి ప్రారంభమవుతుంది.

ఒకవేళ రిజర్వ్ డే కూడా పూర్తిగా వర్షార్పణం అయితే, భారత్, న్యూజిలాండ్ జట్లను సంయుక్త విజేతలుగా (Joint Winners) ప్రకటిస్తారు. ఐసీసీ ఈవెంట్ ఫైనల్ మ్యాచ్‌లో వర్షం కారణంగా ఆట జరగని సందర్భాలు చాలా తక్కువ. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఇలాగే జరిగింది. ఆ సమయంలో భారత్, శ్రీలంకలను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. గంగూలీ కెప్టెన్సీలో భారత్ విజేతగా నిలిచేలా కనిపించింది. కానీ వరుణుడు భారత ఆశలపై నీళ్లుచల్లడంతో లంకతో కలిసి ట్రోఫీని షేర్ చేసుకోవాల్సి వచ్చింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
2027 ODI World Cup Plan: వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget