అన్వేషించండి

పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?

Puri Rath Yatra Begins 2026: ఆషాఢ మాసంలో జరిగే రథయాత్రకోసం రథాల తయారీకి చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? రథాల తయారీకి ఎన్నాళ్లు పడుతుంది? అసలు మేకులు ఉపయోగించకుండా ఎలా తయారు చేస్తారు? 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రథాల చెక్క బనజాగ యాత్రతో పవిత్ర నియమాలతో ఎంపిక చేస్తారు.
  • వంశపారంపర్య వడ్రంగులు, అక్షయ తృతీయ నుండి నెలన్నర రథాలు నిర్మిస్తారు.
  • రథాలు మేకులు లేకుండా, సంప్రదాయ ఇంటర్‌లాకింగ్ పద్ధతిలో నిర్మిస్తారు.

Rath Yatra Thursday 16 July 2026: పూరి రథయాత్రలో మూడు రథాలుంటాయి.. జగన్నాథుడు-బలభద్రుడు-సుభద్ర రథాలు. ఈ రథాల తయారీకి సంబంధించి చెక్క ఎక్కడి నుంచి తీసుకొస్తారు..తయారీ ఎలా? పూర్తి వివరాలు తెలుసుకుందాం..  

రథాల తయారీకి చెక్క ఎంపిక ఎలా?
 
బనజాగ యాత్ర అనే ప్రత్యేక ఆచారం ద్వారా సరైన చెట్లను ఎంపిక చేస్తారు. ఈ యాత్రలో ఆలయ సేవకులు , పూజారులు , సంబంధిత అధికారులు అడవుల్లోకి వెళ్లి, నిర్దిష్ట పవిత్ర ప్రమాణాలు (దిశ, మట్టి రకం, చెట్టు లక్షణాలు) ఆధారంగా చెట్లను గుర్తిస్తారు.

పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?

పూరి జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు! మీ బంధుమిత్రులకు ఇలా తెలియజేయండి!

రథాల నిర్మాణం

రథాల నిర్మాణానికి మహారాణా సేవకులు అనే వారసత్వ కుటుంబాలకు చెందిన నైపుణ్యం గల వండ్రంగులు ప్రధాన పాత్ర పోషిస్తారు. తయారీ ప్రక్రియ వారు నిర్వహిస్తారు. ఒడిశా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (SJTA) సహకారంతో ఈ ప్రక్రియ జరుగుతుంది.
 
చెక్క రకాలు

ప్రధాన రకాలు - ఫాసి, ధౌరా/ధాస, అసన/భౌన్ర, ఇతర నిర్దిష్ట చెట్లు...మొత్తం 10 నుంచి 12 రకాల చెక్కలను ఉపయోగిస్తారు. ఫాసి చెక్క ప్రధానంగా చక్రాలకు ఉపయోగిస్తారు. దసపల్ల, రాణాపూర్, ఒడిశాలో ఇతర అడవుల నుంచి మహానదిలో రాఫ్ట్‌లుగా తేల్చి పూరికి తీసుకొస్తారు. వీటిని ఒడిశా ప్రభుత్వం (అటవీ శాఖ) ఉచితంగా సరఫరా చేస్తుంది. ఈ మధ్య కాలంలో కొన్ని లాగ్స్...ప్రైవేట్ భూముల నుంచి కూడా వస్తున్నాయి.  


పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?

పూరి జగన్నాథ ఆలయంలో ఫ్రెంచ్ గంట - 200 సంవత్సరాల క్రితం సముద్రంలో జరిగిన అద్భుతం!

రథాల తయారీకి ఎన్ని రోజులు సమయం?

ఏటా అక్షయ తృతీయ ( ఏప్రిల్/మే) నుంచి ప్రారంభమై రథయాత్ర వరకూ సాగుతుంది. అంటే సుమారు నెలన్నర నుంచి రెండు నెలలు. వడ్రంగులు, సహాయకులు, చిత్రకారులు..మొత్తం 150 నుంచి 200 మంది తయారీలో పాల్గొంటారు. 

వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!

మేకుల్లేకుండా రథం తయారీ! 

45 రోజులకు పైగా సాగే రథం నిర్మాణం పూర్తిగా సంప్రదాయ పద్ధతుల్లో జరుగుతుంది. ఎక్కడా మేకులు ఉపయోగించరు. ప్రాచీన కట్టడ పద్ధతిని ఉపయోగిస్తారు. చెక్కలను ఇంటర్‌లాకింగ్ జాయింట్స్ చేస్తారు..అంటే ప్రతి చెక్క ముక్కను ఫజిల్ లా మార్చి ఒకదానితో మరొకటి అమర్చి గట్టిగా కలిపి ఉంచుతారు. ప్రాచీన శిల్పశాస్త్రం ప్రకారం చెక్కలను సహజంగా లాక్ చేస్తారు. బలమైన తాళ్లు ఉపయోగించి మరింత బలంగా మార్చుతారు. కొన్నిచోట్ల ఇనుప క్లాంప్స్, పిన్స్ లేదా రింగ్స్ వాడతారు..కానీ ప్రధాన నిర్మాణంలో మేకులు వినియోగించరు. 

జగన్నాథ రథయాత్రకు రథాలు సిద్ధం చేయడం ఇంజినీరింగ్ కాదు..భక్తి, సంప్రదాయం, శిల్పశాస్త్రం కలయిక. ఈ పద్ధతి వల్ల రథం బలంగా ఉంటుంది. రథయాత్ర తర్వాత కూడా విడదీసినప్పుడు జాయింట్స్ సులభంగా విప్పవచ్చు.  

రథం తయారీకి వినియోగించగా మిగిలిన చెక్క ముక్కలను ఆలయ వంటగదిలో ప్రసాదం తయారీకి ఉపయోగిస్తారు. ప్రతి సంవత్సరం కొత్త రథాలు తయారవుతాయి. 

జగన్నాథుని నైవేద్యాన్ని "అబాధ" అని ఎందుకు పిలుస్తారు? ఆ పేరు వెనుక సాంఘిక సామరస్యానికి సంబంధించిన గంభీరమైన సత్యం తెలుసా?

Frequently Asked Questions

రథాల తయారీకి చెట్లను ఎలా ఎంపిక చేస్తారు?

బనజాగ యాత్ర ద్వారా ఆలయ సేవకులు, పూజారులు అడవుల్లోకి వెళ్లి నిర్దిష్ట పవిత్ర ప్రమాణాల (దిశ, మట్టి రకం, చెట్టు లక్షణాలు) ఆధారంగా చెట్లను గుర్తిస్తారు.

రథాల తయారీకి ఎంత సమయం పడుతుంది?

అక్షయ తృతీయ (ఏప్రిల్/మే) నుండి రథయాత్ర వరకు, సుమారు నెలన్నర నుండి రెండు నెలలు పడుతుంది. ఈ ప్రక్రియలో 150-200 మంది పాల్గొంటారు.

రథాల నిర్మాణంలో మేకులను ఉపయోగిస్తారా?

లేదు, రథాల నిర్మాణంలో మేకులు ఉపయోగించరు. ప్రాచీన పద్ధతిలో చెక్కలను ఇంటర్‌లాకింగ్ జాయింట్స్, బలమైన తాళ్లతో కలిపి ఉంచుతారు.

రథాల తయారీకి మిగిలిన చెక్క ముక్కలను ఏం చేస్తారు?

రథాల తయారీకి వినియోగించగా మిగిలిన చెక్క ముక్కలను ఆలయ వంటగదిలో ప్రసాదం తయారీకి ఉపయోగిస్తారు. ప్రతి సంవత్సరం కొత్త రథాలు తయారవుతాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

06-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
06-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
చీకటిలోనూ వెలుగు: గబ్బిలం నేర్పే లోపలి కన్ను రహస్యం!
చీకటిలోనూ వెలుగు: గబ్బిలం నేర్పే అంతర్ధృష్టి రహస్యం!
Nag Panchami 2026 Date: నాగ పంచమి 2026 తేదీ, పూజావిధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి
నాగ పంచమి 2026 తేదీ, పూజావిధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి
Gen Z ఫోటో స్టిల్స్! ఆలయాలను సందర్శించేటప్పుడు ఫొటోలు ఇలా తీసుకుంటే అదిరిపోతాయ్!
Gen Z ఫోటో స్టిల్స్! ఆలయాలను సందర్శించేటప్పుడు ఫొటోలు ఇలా తీసుకుంటే అదిరిపోతాయ్!
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget