అన్వేషించండి

Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు

హైదరాబాద్ పాతబస్తీలో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారని గుర్తించి, ఆకస్మిక దాడులు చేసిన పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడు భరత్ రెడ్డి సహా ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హైదరాబాద్ పాతబస్తీలో డ్రగ్స్ కొనుగోలు చేస్తూ ముగ్గురు పట్టుబడ్డారు.
  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.
  • ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, నిఘా పెంచింది.

Drug Bust in Hyderabad | హైదరాబాద్: భాగ్యనగరంలో పాతబస్తీలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్‌లోని మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, హాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న ముగ్గురు కస్టమర్లను పోలీసులు ఆకస్మిక దాడులు చేసి పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన నేత కుమారుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  పురానాపూల్ పరిసర ప్రాంతాల్లో మాదకద్రవ్యాలను కొనుగోలు చేయడానికి మొత్తం ఏడుగురు వ్యక్తులు రాగా, పోలీసుల రాకను గమనించి వారిలో నలుగురు అక్కడికక్కడే పరారయ్యారు.


Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్
డ్రగ్స్ కొనుగోలు చేయడానికి వచ్చిన వారిలో మాజీ కలెక్టర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డి కుమారుడు భరత్ రాజ్ రెడ్డి, అభిషేక్, బొట్టు యూనిత్ అనే ముగ్గురు నిందితులు పట్టుబడగా, వారి నుంచి 24 గ్రాముల హాష్ ఆయిల్ సాచెట్లు, అలాగే 22 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో సోనీ, వంశీ, మనోజ్, తుల్జాసింగ్ అనే మరో నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పట్టుబడిన భరత్‌రాజ్ రెడ్డి, అభిషేక్, బొట్టు యూనిత్ లను వైద్య పరీక్షల అనంతరం పోలీసులు తదుపరి చర్యల కోసం రిహాబిటేషన్ సెంటర్ కు తరలించారు. ఈ ఘటనపై మంగళహాట్ పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Also Read: Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !

హైదరాబాద్‌లో డ్రగ్స్ నిర్మూలనకు, ఈ సమస్యలపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా యువత డ్రగ్స్ బారిన పడకుండా చూసేందుకు ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటోంది. 

TG-NAB (తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో) బలోపేతం.. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. మోడ్రన్ టెక్నాలజీ, నిఘా పరికరాలతో ఈ విభాగాన్ని బలోపేతం చేసింది. కేవలం డ్రగ్స్ విక్రయించే వారినే కాకుండా, వాటిని కొనుగోలు చేసే వారిపై కూడా పోలీసులు నిఘా పెట్టి ఎప్పటికప్పుడూ తనిఖీలు చేస్తున్నారు. పట్టుబడిన వారిని, ముఖ్యంగా మొదటిసారి అలవాటు పడిన వారిని కౌన్సిలింగ్ నిమిత్తం రిహాబిటేషన్ సెంటర్లకు తరలించి డ్రగ్స్ వల్ల దుష్ప్రరిణామాలను వివరించి మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. 

డ్రగ్స్ కేసుల్లో ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నప్పటికీ వెనకాడకుండా అరెస్టులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తాజాగా జరిగిన మంగళహాట్, పురానాపూల్ పరిసరాల్లో జరిగిన అరెస్టులే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్‌లోని ధూల్‌పేట్, మంగళహాట్, పాతబస్తీ పరిసర ప్రాంతాలతో పాటు ఐటీ కారిడార్‌లోని పబ్‌లు, పార్టీలు జరిగే ప్రాంతాలపై టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు నిరంతర నిఘా ఉంచారు. గంజాయి, హాష్ ఆయిల్, ఎండీఎంఏ వంటి సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేసే నెట్‌వర్క్‌లపై ఉక్కుపాదం మోపుతున్నారు. 

Frequently Asked Questions

హైదరాబాద్ పాతబస్తీలో డ్రగ్స్ కేసులో ఎవరు పట్టుబడ్డారు?

మాజీ కలెక్టర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డి కుమారుడు భరత్ రాజ్ రెడ్డి, అభిషేక్, బొట్టు యూనిత్ అనే ముగ్గురు వ్యక్తులు డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పట్టుబడ్డారు.

పట్టుబడిన నిందితుల నుండి పోలీసులు ఏమి స్వాధీనం చేసుకున్నారు?

పోలీసులు 24 గ్రాముల హాష్ ఆయిల్ సాచెట్లు మరియు 22 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?

తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు చేపట్టింది. TG-NAB ను బలోపేతం చేసి, విక్రయించే వారితో పాటు కొనుగోలు చేసే వారిపై నిఘా పెడుతోంది.

డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారిని పోలీసులు ఏం చేస్తున్నారు?

పట్టుబడిన వారిని వైద్య పరీక్షల అనంతరం రిహాబిటేషన్ సెంటర్లకు తరలిస్తున్నారు. మొదటిసారి అలవాటు పడిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Embed widget