అన్వేషించండి

Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !

UP Marriage Cheating Case: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో విచిత్ర మోసం. సోషల్ మీడియాలో ఐఏఎస్ అధికారిణిగా నటించి, పెళ్లయిన కొన్ని గంటలకే కోటి రూపాయల నగలతో పారిపోయింది ఓ పెళ్లి కూతురు.

Wedding Night Heist:  ఐఏఎస్ అధికారిణిని పెళ్లి చేసుకుని సమాజంలో గొప్ప హోదా దక్కించుకోవాలనుకున్న ఒక వరుడి కల.. చివరకు కోటి రూపాయల  పీడకల గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో పెళ్లయిన కొన్ని గంటలకే నగలు, నగదుతో నవవధువు మాయమైన ఈ విచిత్ర క్రైమ్ స్టోరీ స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. తాను  IAS అధికారిణిని అంటూ నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌తో అమాయక కుటుంబాన్ని ముగ్గులోకి దించి, చివరకు కోటి రూపాయల ఆస్తులతో ఉడాయించిన సాధన అనే మాయలాడిని బరేలీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

 బదౌన్‌ పట్టణానికికు చెందిన సాధన అనే మహిళ సోషల్ మీడియాలో తాను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటూ నకిలీ ప్రొఫైల్స్ సృష్టించింది. సివిల్ సర్వెంట్స్ పట్ల సమాజంలో ఉండే విపరీతమైన గౌరవాన్ని పెట్టుబడిగా మలచుకుని, పెద్ద పెద్ద కుటుంబాలను బుట్టలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే బరేలీ ఫరీద్‌పూర్ పరిధిలోని పచోమి గ్రామానికి చెందిన అభిషేక్ అనే యువకుడు ఆమె వలలో పడ్డాడు. పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ పెట్టింది. తమ ఇంటికి ఐఏఎస్ అధికారిణి కోడలిగా రాబోతుందనే ఆనందంతో వరుడి కుటుంబ సభ్యులు ఎగిరి గంతేశారు. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి ఘనంగా ముగిసింది.

అసలు ట్విస్ట్ పెళ్లయిన  రోజే శోభనం సందర్భంగా  జరిగింది. పెళ్లి ముగిసి అత్తవారింట్లో అడుగుపెట్టిన నకిలీ ఐఏఎస్ కోడలికి.. వరుడి తరపు బంధువులు సంప్రదాయం ప్రకారం కోట్ల విలువైన బంగారం, వెండి, డైమండ్ ఆభరణాలను బహుమతులుగా సమర్పించారు. ఆ రాత్రి భర్త అభిషేక్ శోభనం గదిలో అలసటతో గాఢ నిద్రలోకి జారుకోగానే, సాధన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. ఇంట్లో ఉన్న నగదు, బంధువులు ఇచ్చిన విలువైన కోటి రూపాయల నగలతో సహా అర్ధరాత్రి ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచావకుండా ఇల్లు దాటి పారిపోయింది.

ఉదయం లేచి చూసేసరికి భార్యతో పాటు కోటి రూపాయల విలువైన నగలు మాయమవ్వడంతో షాక్‌కు గురైన అభిషేక్ కుటుంబం తలబాదుకుంది. మోసపోయామని గ్రహించి తక్షణమే పోలీసులను ఆశ్రయించింది. అభిషేక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బరేలీ పోలీసులు సాధనతో పాటు ఆమెకు సహకరించిన తండ్రి, మరో ఇద్దరు కుటుంబ సభ్యులపై చీటింగ్,  నేరపూరిత కుట్ర కేసులు నమోదు చేశారు. ఈ కిలేడీని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన మూడు ప్రత్యేక పోలీస్ బృందాలు ఎట్టకేలకు సాధనను పక్కా సమాచారంతో అరెస్ట్ చేసి జైలుకు తరలించాయి.

నకిలీ ఐఏఎస్ ప్రొఫైల్‌ను విశ్లేషిస్తున్న పోలీసులు.. ఈమె గతంలో కూడా ఇదే తరహా మ్యారేజ్ ఫ్రాడ్' నెట్‌వర్క్ ద్వారా ఎంతమందిని ముంచిందనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు. హోదా చూసి మురిసిపోయి, బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకోకుండా పెళ్లి చేసుకుంటే ఎంతటి ఘోర ప్రమాదాలు ముంచుకొస్తాయో చెప్పడానికి ఈ  నకిలీ ఐఏఎస్  పెళ్లి పేరడీయే ఒక పెద్ద ఉదాహరణ.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Embed widget