అన్వేషించండి

ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు

పెద్దపల్లి మున్సిపల్ ఏఈ సతీష్ అభివృద్ధి పనుల బిల్లుల కోసం కాంట్రాక్టర్ నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెద్దపల్లిలో మున్సిపల్ ఏఈ సతీష్ 2 లక్షల లంచం తీసుకుంటూ దొరికారు.
  • హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఆస్తులపై ఏసీబీ విస్తృత సోదాలు.
  • ఆదాయానికి మించిన ఆస్తులు ఆరోపణలతో బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)  అధికారులు జరిపిన మెరుపు దాడిలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. పెద్దపల్లి పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ఎంబీ (Measurement Book) రికార్డు నమోదు చేసి, బిల్లులు క్లియర్ చేయడానికి ఏఈ సతీష్ ఆ కాంట్రాక్టర్‌ను భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

అధికారి లంచం అడగడంతో బాధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం పక్కా ప్రణాళికతో వల పన్నింది. కాంట్రాక్టర్ నుంచి ఏఈ సతీష్ లంచం నగదు తీసుకుంటుండగా అధికారులు అప్రమత్తమై రెడ్ హ్యాండెడ్‌గా అతనిని పట్టుకున్నారు. ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతుండగా, ఏఈని అదుపులోకి తీసుకుని నిధుల దుర్వినియోగం, అవినీతి అక్రమాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు.


ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు

HMDA చీఫ్ ఇంజనీర్‌ నివాసాల్లో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌:  అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ నివాసాల్లో ఆకస్మిక సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఫిర్యాదులు వచ్చాయి. దాంతో  ఏసీబీ డీఎస్పీ మాజిద్‌ ఖాన్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగాయి. నగరంలోని మైత్రివనంలో గల హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంతో పాటు, గచ్చిబౌలిలోని సుమధుర టవర్స్‌లో ఉన్న రవీందర్ నివాసంలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. 

రవీందర్ అక్రమాస్తులపై 15 టీమ్స్ తనిఖీలు
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు మొత్తం 15 ప్రత్యేక బృందాలుగా విడిపోయి, రవీందర్ ఇల్లే కాకుండా ఆయన ముఖ్య స్నేహితులు, సన్నిహితులు, బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు జరిపిన సోదాల్లో భారీగా విలువైన స్థిరాస్తులు, చరాస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని, సోదాలు పూర్తిగా ముగిసిన తర్వాతే ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తుల పూర్తి విలువ వెల్లడవుతుందని ఏసీబీ వర్గాలు తెలిపాయి.

Frequently Asked Questions

పెద్దపల్లిలో ఏ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు?

పెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అభివృద్ధి పనుల బిల్లుల క్లియరెన్స్ కోసం ఆయన లంచం డిమాండ్ చేశారు.

పెద్దపల్లి అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్ దేని కోసం లంచం డిమాండ్ చేశారు?

పెద్దపల్లి పట్టణంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఎంబీ రికార్డు నమోదు చేసి, బిల్లులు క్లియర్ చేయడానికి సతీష్ లంచం డిమాండ్ చేశారు. ఒక కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు ఏసీబీ పట్టుకుంది.

హెచ్‌ఎండీఏలో ఏ అధికారి నివాసాలపై ఏసీబీ సోదాలు నిర్వహించింది?

మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ నివాసాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు వచ్చాయి.

హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్‌పై ఏ ఆరోపణలు ఉన్నాయి?

రవీందర్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయన కార్యాలయంతో పాటు, నివాసం, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు జరిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget