అన్వేషించండి

Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?

Gen Z Protests : కేంద్రంలో మూడో విడత బీజేపీ పాలనలో జెన్ జీ ఉద్యమాలు , ప్రశాంత్ కిషోర్ ప్రభావం పెరుగుతోంది. దీని వెనుక ఉన్న అసలు రాజకీయ వ్యూహాం బీజేపీదేనా?

Prashant Kishor BJP proxy debate:   కేంద్రంలో భారతీయ జనతా పార్టీ  నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలో పగ్గాలు చేపట్టిన తర్వాత, దేశ రాజకీయ సమీకరణాల్లోనూ ,  ప్రజా పోరాటాల సరళిలోనూ స్పష్టమైన, అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. 2014, 2019 నాటి సంపూర్ణ మెజారిటీ రోజులకు భిన్నంగా, ప్రస్తుతం బీజేపీ సొంత బలానికి తోడు మిత్రపక్షాలపై ఆధారపడటం ఒకటైతే, మరోవైపు వీధుల్లో మొదలవుతున్న ప్రజా ఉద్యమాలు, రాజకీయ వ్యూహకర్తల ప్రత్యక్ష పొలిటికల్ ఎంట్రీలు అధికార పక్షానికి సరికొత్త సవాళ్లను విసురుతున్నాయి. 

రాజకీయ రహిత పోరాటాల కొత్త రూపు 

గతంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీలు లేదా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, బంద్‌లు జరిగేవి. కానీ, మూడో విడత బీజేపీ పాలనలో జెన్ జీ యువత ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమాలు ఏ పార్టీ జెండా లేకుండా, సోషల్ మీడియా వేదికగా  బ్లాస్ట్ అవుతున్నాయి.  జాతీయ స్థాయి పోటీ పరీక్షల లోపాలు పై డిజిటల్ వేదికల నుంచి మొదలై జంతర్ మంతర్ వీధుల వరకు వెళ్లిన కాక్రోచ్ జంతా పార్టీ, జెన్ జీ ఉద్యమాలు  ఇందుకు బలమైన ఉదాహరణ. జాతీయ ఛానెళ్లను పక్కనపెట్టి మీమ్‌లు, డార్క్ హ్యూమర్, జెన్ జీ స్లాంగ్‌లతో ప్రభుత్వంపైకి విరుచుకుపడటం, సోనమ్ వాంగ్‌చుక్ వంటి సామాజిక వేత్తలు దీనికి అండగా నిలవడంతో ప్రభుత్వం తన నిర్ణయాలను సవరించుకోవాల్సి రావడం, చివరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు వెళ్లడం నేటి యువశక్తి నిరసనలకు నిదర్శనంగా మారింది.

 ప్రశాంత్ కిషోర్ జన్ సూరాజ్  మోడల్ - కంచుకోటల బద్దలు! 

మరోవైపు, దశాబ్దాలుగా పాతుకుపోయిన సాంప్రదాయ రాజకీయ కోటలు బద్దలవుతున్నాయి. బీహార్ ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన  ప్రశాంత్ కిషోర్  నేతృత్వంలోని జన్ సూరాజ్ పార్టీ సాధిస్తున్న పురోగతి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. పాట్నాలోని  బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో  గడిచిన 35 ఏళ్లుగా బీజేపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న స్థానంలో.. బీజేపీ జాతీయ స్థాయి కీలక నేతల ప్రాతినిధ్యం ఉన్న స్థానాన్ని ప్రశాంత్ కిషోర్ ఉపఎన్నికల్లో భారీ మెజారిటీతో కైవసం చేసుకోవడం జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సిద్ధాంతాల కంటే ప్యాడ్ యాత్రలు, ప్రత్యామ్నాయ పరిపాలనా వాగ్దానాల ఆధారంగా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా సాంప్రదాయ ఓటు బ్యాంకులను దెబ్బతీయవచ్చని పీకే నిరూపించారు.

 ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే ఈ  జెన్ జీ  నాటకమా? 

సోషల్ మీడియా, రాజకీయ విశ్లేషణల్లో విస్తృతంగా సాగుతున్న ఒక కీలకమైన సిద్ధాంతం ఏంటంటే..  ఈ అసంఘటిత ఉద్యమాలు నిజంగా ప్రభుత్వంపై దాడి కాదా, లేక వ్యతిరేక ఓటును రక్షించే ఎత్తుగడనా?  అని. కేంద్ర ప్రభుత్వంపై ఉత్పన్నమయ్యే ప్రజా అసంతృప్తిని సాంప్రదాయ ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు సొమ్ము చేసుకోకుండా నిరోధించడానికి.. ఇలాంటి  రాజకీయ రహిత, డిజిటల్ ఫ్రంట్లు  ఉపయోగపడతాయనేది ఒక వర్గం విశ్లేషకుల అభిప్రాయం. జెన్ జీ పోరాటాలు ప్రజాసమస్యలపై దృష్టి పెడతాయి తప్ప, ప్రభుత్వాన్ని కూల్చేంత తీవ్ర రాజకీయ ప్రత్యామ్నాయంగా మారవు. ఫలితంగా, ప్రభుత్వ వ్యతిరేకత ఈ చిన్న చిన్న  పాప్-అప్ నిరసనల  వల్ల విభజనగురై , అసలైన ప్రతిపక్షానికి రాజకీయం కలసిరాకుండా పోతోంది.

 ప్రశాంత్ కిషోర్ వెనుక నిజంగానే బీజేపీ హస్తం ఉందా? 

పి.కె. విజయం వెనుక బీజేపీ హస్తం ఉందనే అభిప్రాయం  బలంగానే వినిపిస్తోది.  బీహార్‌లోని సాంప్రదాయ ప్రతిపక్షమైన ఆర్జేడీ   యాదవ-ముస్లిం ఓటు బ్యాంకుతో పాటు, అసంతృప్తిగా ఉన్న అగ్రవర్ణ ఓట్లను పీకే తనవైపు తిప్పుకోవడం వల్ల ఆర్జేడీ ఓటు  తగ్గిపోయిది. బీహార్ బంకిపూర్ వంటి సురక్షిత స్థానంలో పీకే గెలవడం ద్వారా ఆర్జేడీ పూర్తిగా మూడో స్థానానికి పడిపోయింది. పైకి బీజేపీ తన కోటను కోల్పోయినట్లు కనిపించినప్పటికీ, ప్రధాన ప్రత్యర్థి అయిన ఆర్జేడీ, ఇండియా కూటమి పునాదులను దెబ్బతీయడంలో పీకే ఒక  థర్డ్ ఫోర్స్ గా ఉపయోగపడ్డారనేది మరువలేని వాస్తవమని కొందరు వాదిస్తున్నారు.

 మూడో విడత పాలనలో బీజేపీ మారిన వ్యూహం 

గత పదేళ్లలాగా ప్రత్యక్ష ప్రజా వ్యతిరేకతను అధికారికంగా ఎదుర్కోవడం కంటే, దాన్ని చిన్న చిన్న గ్రూపుల ద్వారా 'డిఫ్యూజ్' చేయడం  బీజేపీ   నయా వ్యూహంగా కనిపిస్తోంది. ఒక నిరసన వెల్లువెత్తిన వెంటనే.. అది ఏ రాజకీయ పార్టీ చేతికీ చిక్కకుండా చూసుకోవడం, అవసరమైతే సంబంధిత మంత్రుల చేత రాజీనామా చేయించడం లేదా త్వరితగతిన దిద్దుబాటు చర్యలు చేపట్టడం ద్వారా నష్ట నివారణ చేసుకుంటోంది. ప్రతిపక్షాలు కోలుకోకుండా ఉండేందుకు, కొత్తగా వస్తున్న యువ నాయకులను లేదా స్వతంత్ర శక్తులను  ప్రత్యక్ష రాజకీయాల్లోకి వదిలి, వ్యతిరేక ఓటు ఏకం కాకుండా చూస్తోంది.
 
అంతర్లీనంగా జరుగుతున్న ఈ పరిణామాలు భారత రాజకీయాల్లో ఒక నయా శకానికి నాంది పలుకుతున్నాయి. జెన్ జీ ఉద్యమాలు యువతలోని నిరాశను బయటకు తీస్తుంటే, ప్రశాంత్ కిషోర్ వంటి వారు సాంప్రదాయ పార్టీల అంధకారంలో ప్రత్యామ్నాయం చూపిస్తున్నారు. ఇది బీజేపీకి ఒక రకంగా ముప్పులా కనిపించినప్పటికీ, అంతిమంగా ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీస్తూ, వ్యతిరేక ఓటును ముక్కలు చేయడానికి బీజేపీ పరోక్షంగా ఈ సమీకరణలను తన అనుకూలంగా మార్చుకుంటోందనేది కొట్టిపారేయలేని నిజం. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy Political Party: కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
BRS MLC Tatha Madhu Disqualification: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
BRS Calls for Statewide Protests: అసెంబ్లీ వద్ద పోలీసుల అత్యుత్సాహం.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్‌ పిలుపు
అసెంబ్లీ వద్ద పోలీసుల అత్యుత్సాహం.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్‌ పిలుపు
BRS Leaders Arrest: అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. అరెస్టుకు యత్నించగా కిందపడిపోయిన హరీష్ రావు, కేటీఆర్‌కు గాయాలు!
అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. అరెస్టుకు యత్నించగా కిందపడిపోయిన హరీష్ రావు, కేటీఆర్‌కు గాయాలు!
Advertisement

వీడియోలు

Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం
PCB Takes Custody Of Team Phones | పాకిస్తాన్ ప్లేయర్స్ ఫోన్లు సీజ్
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLC Tatha Madhu Disqualification: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
Section 22A Land Controversy: 22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
MLA Sunitha Laxma Reddy: పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
Vijayasai Reddy Political Party: కమ్మ, కాపులే సీఎం అవ్వాలా? విజయదశమి తరువాత పార్టీ పేరు అనౌన్స్: విజయసాయిరెడ్డి
కమ్మ, కాపులే సీఎం అవ్వాలా? విజయదశమి తరువాత పార్టీ పేరు అనౌన్స్: విజయసాయిరెడ్డి
Asia Cup Deadlock: ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
AP Local Body Elections: ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
Embed widget