అన్వేషించండి

పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!

కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 ఫోటోలు లీక్‌ అయ్యాయి. కొత్త ఫ్రేమ్‌, ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌, మోనోషాక్‌ సస్పెన్షన్‌తో ఈ బైక్‌ త్వరలో లాంచ్‌ కానుంది.

New Bajaj Pulsar 150 Price And Features Telugu: థ్రిల్లింగ్‌ బైక్‌ కోసం ఎదురుచూస్తున్నవాళ్లకు గుడ్‌న్యూస్‌. కొత్త పల్సర్‌ 150 త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. అయితే.. లాంచ్‌కు ముందే ఈ యూత్‌ఫుల్‌ బైక్‌ ఫోటోలు లీక్‌ అయ్యాయి. ఒక డీలర్‌షిప్‌ వద్ద కనిపించిన బైక్‌, దాదాపు డెలివెరీకి సిద్ధమైన రూపంలో ఉంది. దీంతో కొత్త పల్సర్‌ 150లో వచ్చిన మార్పులన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి.

బజాజ్‌, ప్రస్తుతం వరుసగా కొత్త బైక్‌లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. కొత్త పల్సర్‌ 125 ఇప్పటికే డీలర్‌షిప్‌ వద్ద కనిపించింది. అప్‌డేటెడ్‌ పల్సర్‌ N160 ని ఆగస్టు 12న విడుదల చేయనున్నారు. ఇదే సమయంలో కొత్త పల్సర్‌ 150 కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

కీలక మార్పులు
కొత్త పల్సర్‌ 150లో బజాజ్‌ భారీ మార్పులు చేసింది. ముఖ్యంగా ఇంజిన్‌ & ఛాసిస్‌లో కీలకమైన అప్‌డేట్లు వచ్చాయి. కొత్త బైక్‌ను పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపొందించారు. సింగిల్‌ డౌన్‌ట్యూబ్‌ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. ఇదే తరహా ఫ్రేమ్‌ కొత్త పల్సర్‌ 125లోనూ కనిపించింది.

ఇప్పటివరకు పల్సర్‌ క్లాసిక్‌ మోడళ్లలో కొనసాగిన పాత నిర్మాణాన్ని కొత్త ఫ్రేమ్‌ రీప్లేస్‌ చేయనుంది. సస్పెన్షన్‌ విషయంలోనూ మార్పులు ఉన్నాయి. ముందు భాగంలో టెలిస్కోపిక్‌ ఫోర్క్‌ ఉంటుంది. వెనుక భాగంలో ప్రీలోడ్‌ అడ్జస్టబుల్‌ మోనోషాక్‌ను అమర్చారు.

ఇది కూడా చదవండి: కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!

ప్రస్తుతం ఉన్న పల్సర్‌ 150లో వెనుక భాగంలో ట్విన్‌ షాక్‌ సస్పెన్షన్‌ ఉంది. దీంతో కొత్త మోనోషాక్‌ సెటప్‌ కీలకమైన అప్‌గ్రేడ్‌గా చెప్పొచ్చు. రైడింగ్‌ కంఫర్ట్‌ & హ్యాండ్లింగ్‌లో ఇది మెరుగుదల తీసుకురావచ్చని భావిస్తున్నారు.

ఇంజిన్‌లోనూ మార్పులు
ఇంజిన్‌లోనూ బజాజ్‌ పెద్ద మార్పే చేసింది. ప్రస్తుత పల్సర్‌ 150లో ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంది. కొత్త మోడల్‌లో ఎయిర్‌ కూలింగ్‌తో పాటు ఆయిల్‌ కూలింగ్‌ వ్యవస్థను తీసుకొచ్చింది. దీంతో ఇంజిన్‌ ఉష్ణోగ్రతను మరింత సమర్థంగా నియంత్రించవచ్చు.

ఇంజిన్‌ పనితీరు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. అయితే కొత్త పల్సర్‌ 150 పవర్‌ & టార్క్‌ వివరాలను బజాజ్‌ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం ఉన్న పల్సర్‌ 150లో 149.5cc, సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 14hp శక్తిని & 13.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇది కూడా చదవండి: BMW F 450 GS బైక్‌ రియల్‌ వరల్డ్‌ టెస్ట్.. 100km వేగం కేవలం 5.72 సెకన్లలో!

లుక్స్‌
డిజైన్‌ విషయంలోనూ కొత్త పల్సర్‌ 150కు మార్పులు చేశారు. కొత్త పల్సర్‌ 125 నుంచి కొన్ని డిజైన్‌ అంశాలను తీసుకున్నారు. ముందు భాగంలో కొత్త హెడ్‌లైట్‌ కౌల్‌ కనిపిస్తోంది. మస్క్యులర్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌ డిజైన్‌ను కొనసాగించారు. ట్యాంక్‌కు ఇరువైపులా ఎక్స్‌టెన్షన్లు ఉన్నాయి.

వెనుక భాగాన్ని మరింత స్లీక్‌గా రూపొందించారు. పల్సర్‌ సిరీస్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన ట్విన్‌ LED టెయిల్‌లైట్లు కొనసాగుతున్నాయి. కొత్త కలర్‌ LCD ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను కూడా ఈ బైక్‌లో అందించే అవకాశం ఉంది.

ఆగస్టు 12న బజాజ్‌ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. ఇందులో.. అప్‌డేటెడ్‌ పల్సర్‌ N160 లాంచ్‌ కానుంది. కొత్త పల్సర్‌ 125 & పల్సర్‌ 150 కూడా అదే కార్యక్రమంలో విడుదలవుతాయా, లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. అయితే, పల్సర్‌ 150 ఇప్పటికే డీలర్‌షిప్‌లకు చేరడంతో, లాంచ్‌ సమయం దగ్గరలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget