'అయ్యగారే నం.1' అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన నాగరాజు, తన అభిమాన నటుడు అఖిల్‌ను గుంటూరులో కలిశారు. అఖిల్ కాళ్లపై పడి నాగరాజు ఆనందాన్ని వ్యక్తం చేయగా, అతడిని ఆలింగనం చేసుకుని అఖిల్ చూపిన ప్రేమ అందరినీ ఆకట్టుకుంటోంది. 'నీ వల్లే నాకు ఆ పేరొచ్చింది.. మనం కలిసి ఇంకో హిట్ కొడదాం' అని అఖిల్ ఇచ్చిన మాట నాగరాజును ఉత్సాహపరిచింది.